Monday, September 28, 2026
HomeLATESTSampoornesh Babu: స్టేజ్ పైన సంపూర్ణేష్ బాబు ఎమోషనల్ కామెంట్స్..!

Sampoornesh Babu: స్టేజ్ పైన సంపూర్ణేష్ బాబు ఎమోషనల్ కామెంట్స్..!

Sampoornesh Babu: ప్రముఖ సినీ నటుడు సంపూర్ణేష్ బాబు ఇటీవల మూవీ ఆఫర్స్ పై ఎమోషనల్ కామెంట్లు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

on
- Advertisement -banner Ad

Sampoornesh Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి వారికైనా సరే అవకాశం లభిస్తుంది. కానీ వారు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మంచి విజయాలను అందుకుంటారు. అలా హృదయ కాలేయం సినిమాతో బర్నింగ్ స్టార్ గా పేరు సంపాదించిన సంపూర్ణేష్ బాబు.. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఎంతోమంది హీరోల చిత్రాలలో నటించిన సంపూర్ణేష్ బాబు చాలా కాలం తర్వాత సరికొత్త మేకోవర్ తో వెండితెర పైన కనిపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఇటీవల నాని, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిక్స్డ్ టాక్ ని సంపాదించుకుంది.

స్టేజ్ పై సంపూర్ణేష్ బాబు ఎమోషనల్ కామెంట్స్..

ఇందులో సంపూర్ణేష్ బాబు బిర్యాని అనే ఒక పాత్రలో నటించారు. శనివారం రోజు ది ప్యారడైజ్ టీం ప్రత్యేకంగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu) మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. కెరియర్లో ఎదురైన గ్యాప్, అవకాశాలు లేని సమయంలో తాను పడ్డ ఆవేదనను తెలియజేస్తూ బాగోద్వేగానికి లోనయ్యారు. తన కెరీర్ లో చాలా ఒడిదుడుకులను చూశాను కొబ్బరిమట్ట విడుదలైన తర్వాత నా ఫోన్ రింగ్ అవ్వడం ఆగిపోయింది.. ఆ మధ్యలో చాలా సినిమాలు వచ్చాయి.. పోయాయి.. కానీ ఫోన్ మాత్రం మోగలేదు.. ఏదో సంపూర్ణేష్ బాబు నాలుగు కామెడీ సినిమాలు చేశారు ఇక అతని పని అయిపోయిందని అందరూ అనుకున్నారు.

- Advertisement -
Advertisement

also read:Nani:”నాని” టోటల్ చీటింగ్.. ‘ది ప్యారడైజ్’కు కొత్త తలనొప్పి..!

శ్రీకాంత్ నాకు మరో పుట్టుక ఇచ్చారు..

అలాంటి సమయంలోనే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల అన్న నన్ను నమ్మి ఈ పాత్ర ఇచ్చారు. రాజేష్ అన్న అనుకుంటే సంపూర్ణేష్ బాబు పుట్టాడు.. ఇప్పుడు శ్రీకాంత్ అన్న అనుకుంటేనే ది ప్యారడైజ్ లో బిర్యానీ రూపంలో సంపూర్ణేష్ బాబు పుట్టాడు. నాలో ఉన్న నటుడిని నాకే పరిచయం చేశారు. ఈ విషయంపై డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు సంపూర్ణేష్ బాబు. హీరో నానితో కలిసి పని చేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ షూటింగ్ మొదటి రోజే నా చేతిలో బీడీ పెట్టి గెటప్ వేశారు. ఎదురుగా నాని అన్న ఉన్నారు . ఆ క్యారం బోర్డు సీన్లో డైలాగు చెప్పే సమయంలో ఒకటికి పది సార్లు టేకు తీసుకున్నాను.. అప్పుడే భయపడ్డ అసలు ఈ సినిమాలో నన్ను ఉంచుతారా ? తీసేస్తారా అని చాలా భయపడిపోయానని చెప్పారు.

- Advertisement -
Advertisement

also read:Anushka Sharma:మూసేయాలనుకున్న రెస్టారెంట్‌కు అనుష్క శర్మ ఒక్క పోస్ట్‌తో ఊహించని టర్న్!

నాని అన్న లేకపోతే ఈరోజు నేను లేను..

మాలిక్ ఎక్కడ అని నాని అన్న చిన్న డైలాగు చెబితే నేను చిన్నగా చెప్పడం లేదా నాని అన్న గట్టిగా చెప్పడం, లేదా నేను గట్టిగా చెబితే నాని అన్న చిన్నగా చెప్పడం వంటివి జరిగాయి. ఆ కన్ఫ్యూజన్లో ఉన్న సమయంలో నాని అన్న దగ్గరుండి సంపూ అలా వద్దు ఇలా చెయ్ అంటూ పక్కనుండి మరి నాతో ఆ సీన్ చేయించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. నాని అన్న నుంచి నేను చాలా నేర్చుకున్నాను. చదువుకునే రోజుల్లో ఎవరి డైలాగులు చెబుతూ పెరిగానో ఇవాళ వాళ్లు (మోహన్ బాబు గారు) పక్కన క్యారెక్టర్ చేయడం కూడా చాలా అదృష్టమంటూ తెలిపారు. ది ప్యారడైజ్ సినిమాకు థియేటర్లలో డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే.. ఆ ఆనందం మాటల్లో చెప్పలేనంతగా కలుగుతోందని , తనమీద నమ్మకం పెట్టుకొని ఇంత మంచి బ్రేక్ ఇచ్చిన చిత్ర బృందానికి సంపూర్ణేష్ బాబు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you