OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నటించిన ‘ఓజీ’ చిత్రం (OG Movie) ఎలాంటి ఆదరణను పొందిందో, ఎలాంటి సక్సెస్ అందుకుందో, ఏ విధంగా కలెక్షన్స్ రాబట్టిందో అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే భారీగా కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘ఓజీ’ నిలిచింది. మరి అలాంటి చిత్రం.. తాజాగా ప్రకటించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (Telangana Gaddar Film Awards)లో ఒక్క కేటగిరిలో కూడా అవార్డును పొందకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. నిజంగా జ్యూరీకి అసలు ఈ సినిమా ఒకటి 2025లో విడుదలైందనే విషయం తెలుసా? అనేలా అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే, కుర్రాడు సుజీత్ డైరెక్షన్, థమన్ మ్యూజిక్, పవన్ కళ్యాణ్ హీరోయిజం, ఇవన్నీ కూడా సినిమాకు హైలెట్సే. ఇంకా చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. కానీ, ఒక్కటంటే ఒక్క కేటగిరీలో కూడా అవార్డు రాకపోవడం ఏంటని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.
అసలీ అవార్డులకు కొలమానం ఏమిటి?
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌కు కొలమానం ఏమిటి? కేవలం తెలంగాణ చిత్రాలకే అవార్డులు అనుకుంటే.. వాళ్లు ప్రకటించిన చిత్రాలు తెలంగాణ అనడానికి వీలు లేకుండా కొన్ని కేటగిరి అవార్డులు ఉన్నాయి. 2024-2025 కొలమానం తీసుకుంటే, 2025 జూన్ వరకు విడుదలైన చిత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. కానీ, ‘ఓజీ’ తర్వాత విడుదలైన ‘అఖండ 2’ చిత్రానికి అవార్డు ఇచ్చారు. ఇంకా 2026లో విడుదలైన గుణశేఖర్ ‘యుఫోరియా’ చిత్రానికి కూడా అవార్డు ఇచ్చారు. అసలు ఏ కొలమానం తీసుకుని జ్యూరీ ఈ అవార్డులను ఎంపిక చేస్తుంది? అనేలా సినిమా ఇండస్ట్రీలోని వారు కూడా డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు.

Also Read- Varalaxmi: తమిళ్ కాదు.. తెలుగు రాజకీయాల్లోకే రావచ్చేమో!
ఆ లెక్కన ఓజీకి కూడా ఇవ్వాలిగా?- OG Movie
‘అఖండ 2’, ‘యుఫోరియా’ చిత్రాలతో పాటు ఈ అవార్డులలో ఎక్కువ అవార్డులు సొంతం చేసుకున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’, ‘దండోరా’, ‘ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రాలు ‘ఓజీ’ తర్వాతే రిలీజ్ అయ్యాయి. ‘ఓజీ’కి ముందు విడుదలైన కొన్ని చిత్రాలకు కూడా అవార్డులు వచ్చాయి. మరి ‘ఓజీ’కి మాత్రమే ఎందుకు ఒక్క అవార్డు కూడా రాలేదు. లాస్ట్ సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా జనాదరణ పొందిన సినిమా అయితే, ‘ఓజీ’ కూడా ఆ కేటగిరీకే వస్తుంది కదా. మరి ఎందుకు కన్సిడర్ చేయలేదు? అనేలా ఇప్పుడంతా ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఏదో ఒక కేటగిరీలోనైనా అవార్డు ఇవ్వాలి కదా? అని అంతా ఈ అవార్డులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అంతా ఫిక్సింగా?
ఒక్క ‘ఓజీ’నే కాదు, 2025లో విడుదలైన చాలా చిత్రాలకు అవార్డులు మిస్సయ్యాయనేలా సోషల్ మీడియాలో సైతం వాదనలు వినిపిస్తున్నాయి. కచ్చితంగా ఈ అవార్డుల విషయంలో ఫిక్సింగ్ జరిగినట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిజమే మరి? 2024-2025 పరిగణనలోకి తీసుకుంటే అత్యధిక అవార్డులు వచ్చిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ అసలు లేదు కదా? మరి ఎలా అవార్డులకు ఎంపిక చేశారు? అంటే.. ఈ అవార్డుల వెనుక ఏదో మతలబు అయితే ఉందనే విషయం క్లియర్‌గా స్పష్టమవుతుంది. మరి ఆ మతలబు ఏంటనేది జ్యూరీ మెంబర్స్ కచ్చితంగా వివరణ ఇవ్వాల్సి ఉంది. మరి ఆ వివరణ ఎవరు, ఎప్పుడు ఇస్తారో చూడాల్సి ఉంది.
Also Read- Ustaad Bhagat Singh: దేవి శ్రీ ప్లేస్‌లోకి థమన్.. అసలేం జరిగిందంటే?
ఎంట్రీ ఫీజే కారణమా?
‘ఓజీ’ సినిమాకు అవార్డు రాకపోవడానికి కారణం చిత్ర నిర్మాత డివివి దానయ్యే కారణమా? వాస్తవానికి ఈ అవార్డ్స్ నిమిత్తం ఎంట్రీ ఫీజు ఉంటుందనే విషయం తెలియంది కాదు. ఒక్కో చిత్రానికి పది వేల రూపాయల ఎంట్రీ ఫీజు కట్టి, సినిమాను సబ్మిట్ చేయాలనే రూల్ ప్రకారం చూస్తే.. దానయ్య ‘ఓజీ’ చిత్రాన్ని ఈ అవార్డులకు పంపించలేదనేలా కూడా డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. సినిమా షూటింగ్ టైమ్‌లో ఓ సన్నివేశానికి నిర్మాత డబ్బులు ఇవ్వకపోతే, దర్శకుడు సుజీత్ తన కారు అమ్మి, ఆ ఎపిసోడ్ షూట్ చేసినట్లుగా ఈ మధ్య వార్తలు వచ్చాయి. అందుకే సుజీత్ అమ్మిన కారుని పవన్ కళ్యాణ్ అతనికి కొనిచ్చాడనే, ఇటీవల ఆయన కారు ఇచ్చినప్పుడు వార్తలు వచ్చాయి. అలా చూస్తే, నిర్మాత తీవ్ర అన్యాయం చేసినట్టే.
Daily dosage of #OG ❤️🔥#TheyCallHimOG pic.twitter.com/yFBZPI2098
— DVV Entertainment (@DVVMovies) October 26, 2025
పవన్ కళ్యాణ్ రాడని అనుకున్నారా?
ఒకవేళ నిర్మాత పంపించినా, అవార్డు ప్రకటిస్తే తీసుకోవడానికి ఎలాగూ పవన్ కళ్యాణ్ రాడు అని, ఆయన్ని ఎంపిక చేయలేదా? ఆయన రాడు సరే, మిగతా కేటగిరీలలో ఏదో ఒక కేటగిరీకి ఎంపిక చేయవచ్చు కదా. అలా కూడా జరగలేదు. ఏదీ ఏమైనా, అసలు ఈ అవార్డు ఎంపికకు ఉన్న ప్రాతిపదిక ఏమిటనేది మాత్రం స్పష్టంగా తెలియాల్సి ఉంది. ‘ఓజీ’కి అవార్డు రాకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం చాలా నిరాశలో ఉన్నారన్నది మాత్రం వాస్తవం.
Also Read- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇంకా సినిమాలు చేస్తాడా?
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 పూర్తి డిటైల్స్ ఇవే..
* మొదటి ఉత్తమ చిత్రం: రాజు వెడ్స్ రాంబాయి
* రెండవ ఉత్తమ చిత్రం: దండోరా
* మూడవ ఉత్తమ చిత్రం: ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో
* జాతీయ సమగ్రత చిత్రం: తండేల్
* ఉత్తమ పర్యావరణ, చరిత్ర, వారసత్వ చిత్రం: ఎగ్వ (EGWA)
* ఉత్తమ డెబ్యూ (తొలి) చిత్రం: లిటిల్ హార్ట్స్
* ఉత్తమ వినోదాత్మక చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం
* సామాజిక సందేశాత్మక చిత్రం: కోర్ట్ (COURT)
* ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: మిరాయ్
* ఉత్తమ బాలల చిత్రం: అనగనగ
* ఉత్తమ దర్శకుడు: సాయిలు కాంపాటి (రాజు వెడ్స్ రాంబాయి)
* ఉత్తమ నటుడు: అక్కినేని నాగచైతన్య (తండేల్)
* ఉత్తమ నటి: రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)
* ఉత్తమ సహాయ నటుడు: శివాజీ (దండోరా)
* ఉత్తమ సహాయ నటి: భూమిక చావ్లా (యుఫోరియా)
* ఉత్తమ సంగీత దర్శకుడు: మార్క్ కె రాబిన్ (దండోరా)
* ఉత్తమ గాయకుడు: అనురాగ్ కులకర్ణి (పాట: రాంబాయి నీ మీద నాకు మనసు ఆయెనే – రాజు వెడ్స్ రాంబాయి)
* ఉత్తమ గాయని: ఎం.ఎస్. సాహితి చాగంటి (పాట: సగమై చేరి – కన్నప్ప)
* ఉత్తమ హాస్యనటుడు: కృష్ణ తేజ రెడ్డి (జిగ్రిస్)
* ఉత్తమ బాలనటుడు: మాస్టర్ రోహన్ రాయ్ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో)
* ఉత్తమ కథా రచయిత: గుణశేఖర్ (యుఫోరియా)
* ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత: అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
* ఉత్తమ గీత రచయిత: నందకిషోర్ (కుబేర)
* ఉత్తమ సినిమాటోగ్రాఫర్: కార్తీక్ ఘట్టమనేని (మిరాయ్)
* ఉత్తమ ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్)
* ఉత్తమ ఆడియోగ్రాఫర్: ఎమ్.ఆర్. రాధాకృష్ణన్ (కిష్కంధపురి)
* ఉత్తమ కొరియోగ్రాఫర్: ఆట సందీప్ (ఛాంపియన్- గిర గిర)
* ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: తోట తరణి (ఛాంపియన్)
* ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్: పీటర్ హెయిన్స్ (ఛాంపియన్)
* ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: వై. గోవిందరాజు (అఖండ 2: తాండవం)
* ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: చంద్రకాంత్ సోనావాణి, అజయ్ కుమార్ నంబాల (ఛాంపియన్)
Also Read- Virosh Wedding: విజయ్, రష్మికల ప్రేమ నుంచి పెళ్లి రిసెప్షన్ వరకు.. జరిగింది ఇదే!
* స్పెషల్ జ్యూరీ అవార్డ్ 1: రాజ్ రాచకొండ (డైరెక్టర్, స్టోరీ రైటర్: 23)
* స్పెషల్ జ్యూరీ అవార్డ్ 2: చైతన్య జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
* స్పెషల్ జ్యూరీ అవార్డ్ 3: రోషన్ మేక (ఛాంపియన్)
* స్పెషల్ జ్యూరీ అవార్డ్ 4: అనంతిక సనిల్ కుమార్ (8 వసంతాలు)
* ఉత్తమ పుస్తకం: శూన్యం నుండి శిఖరాగ్రాలకు (రచయిత: జర్నలిస్ట్ ప్రభు)
* ఉత్తమ విమర్శకుడు (Critic): హెచ్. రమేష్ బాబు
* ఉత్తమ మొదటి డాక్యుమెంటరీ: UNITY (The Man of Social Justice)
* ఉత్తమ రెండవ డాక్యుమెంటరీ: ది ఫస్ట్ యాక్షన్ హీరో పైడి జైరాజ్ ప్రస్థానం
* ఉత్తమ మూడవ డాక్యుమెంటరీ: మహామనిషి డా. ఏ.ఎస్. రావ్
* మొదటి ఉత్తమ షార్ట్ ఫిల్మ్: వనజీవి రామయ్య
* రెండవ ఉత్తమ షార్ట్ ఫిల్మ్: మౌనమే నీ భాష
* మూడవ ఉత్తమ షార్ట్ ఫిల్మ్: సైబర్ స్లావరీ
* డిప్లొమో ఆఫ్ మెరిట్: తల్లిదండ్రుల ఆత్మగౌరవం
స్పెషల్ అవార్డ్స్
* ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు: కొణిదెల చిరంజీవి
* పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు: కమల్ హాసన్
* బి.ఎన్. రెడ్డి ఫిల్మ్ అవార్డు (దర్శకుడు): సింగీతం శ్రీనివాసరావు
* నాగిరెడ్డి & చక్రపాణి ఫిల్మ్ అవార్డు (నిర్మాత): చలసాని అశ్వినీ దత్
* టి.ఎల్. కాంతారావు ఫిల్మ్ అవార్డు: ఆర్. నారాయణ మూర్తి
* రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు: రమేష్ ప్రసాద్
* సి. నారాయణ రెడ్డి ఫిల్మ్ అవార్డు (కవి/రచయిత): సుద్దాల అశోక్ తేజ
* అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్ అవార్డు: జయసుధ

