Kanna Movie: మాధురి ప్రజెంట్స్, పాషనేట్ ఫిలిం మేకర్స్, సినిమాటిక్ విజువల్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘కన్న’. ఎస్ఎన్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం కన్న టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మఖ్యఅతిథిగా హీరో చైతన్య రావు, హీరో కార్తిక్ శివన్, హీరోయిన్ గీతికా రథన్, మంజు వెంకట్, సినిమా యాక్టర్స్, టెక్నీషన్స్ తదితరులు పాల్గొన్నారు.
చైతన్యరావు చేతుల మీదుగా ‘కన్న’ మూవీ టీజర్ విడుదల అయింది.
ఈ చిత్రాన్ని 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఈ సందర్భంగా యాక్టర్ వెంకీ మాట్లాడుతూ… ఇది చిన్న సినిమా కావచ్చు కానీ అందరు గుర్తు పెట్టుకునే సినిమా అవుతుందని అన్నారు.
ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో హీరో కార్తీక్ శివన్, హీరోయిన్ గీతికా రథన్, కిట్టయ్య, రూపేష్, ప్రేమ్ కృష్ణ , సూరజ్, రామ్ పటాస్, వేణు, డైరెక్టర్ నాని కాసరగడ్డ, రవీంద్ర, వెంకీ, మురళి, బంటు, మంజు వెంకట్, దేవా, బృందావనం మూవీ టీమ్, మేకర్స్ తదితరులు పాల్గొన్నారు.
డైరెక్టర్ ఎంతో సహనంతో ఈ సినిమాను తెరకెక్కించారని చెప్పారు ప్రొడ్యూసర్ కృష్ణ.