Wednesday, June 24, 2026
HomeLATESTChiranjeevi:సమంత - రాజ్ దంపతులకు చిరంజీవి స్పెషల్ విషెస్.. ప్రెగ్నెన్సీ వార్తలు నిజమేనా?

Chiranjeevi:సమంత – రాజ్ దంపతులకు చిరంజీవి స్పెషల్ విషెస్.. ప్రెగ్నెన్సీ వార్తలు నిజమేనా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మా ఇంటి బంగారం సినిమా వీక్షించి సినిమాపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు సమంత దంపతులకు మరో స్పెషల్ విషెస్ తెలియజేశారు.

on
- Advertisement -banner Ad

Chiranjeevi:ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. ఇక రాజ్ కథ ,స్క్రీన్ ప్లే , సహా నిర్మాణంలో వచ్చిన మా ఇంటి బంగారం సినిమాతో చాలాకాలం గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రముఖ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే అటు చిత్ర బృందం స్పెషల్ సక్సెస్ మీట్ లు నిర్వహిస్తూ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.

సమంత – రాజ్ దంపతులకు మెగాస్టార్ స్పెషల్ విషెస్..

ఇక ఈ నేపథ్యంలో వివాహం తర్వాత అలాగే తన సినిమా సక్సెస్ అయినందుకు మా ఇంటి బంగారం చిత్ర బృందం మెగాస్టార్ చిరంజీవిని(Chiranjeevi) ఆయన ఇంటికి వెళ్లి స్వయంగా కలిశారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ.. సమంత – రాజ్ దంపతులను ఆశీర్వదిస్తూ వారికి స్పెషల్ విషెస్ తెలియజేశారు. “మా ఇంటి బంగారం సినిమా చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో యాక్షన్, ఎమోషన్స్ ను అందంగా మేళవించి దర్శకురాలు నందిని రెడ్డి తనదైన శైలిలో ఈ చిత్రానికి ప్రాణం పోసి.. ఎంతో వినోదాత్మకంగా మలిచారు. ముఖ్యంగా సమంత(Samantha) నటన, యాక్షన్ పర్ఫామెన్స్ సినిమాకి వెన్నెముకగా నిలిచాయి. అంతేకాదు జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత దంపతులకు కూడా ప్రత్యేక శుభాకాంక్షలు” అంటూ చిరంజీవి కామెంట్లు చేశారు.

- Advertisement -

also read:Trisha – Vijay:విజయ్ – త్రిష మధ్య బ్రేకప్.. అసలు ఏమైందంటే?

సమంత స్వయంగా ప్రకటిస్తుందా..

మొత్తానికి అయితే ఒకవైపు మా ఇంటి బంగారం సినిమాపై ప్రశంసలు కురిపిస్తూనే.. మరొకవైపు సమంత రాజ్ తమ జీవితంలోకి కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అంటే దీన్ని బట్టి చూస్తే సమంత గత కొన్ని రోజులుగా ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలకు ఆయన ఇండైరెక్టుగా ఊపిరి పోసారనే వార్తలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా చిరంజీవి ఇచ్చిన ఈ ఇన్ డైరెక్ట్ హింట్ అభిమానులను మరింత సర్ప్రైజ్ చేసిందని చెప్పవచ్చు. ఇక సమంత స్వయంగా ఈ హ్యాపీ మూమెంట్ ని షేర్ చేసుకోవాలని కూడా కోరుతున్నారు.

- Advertisement -

also read:Varanasi : ‘వారణాసి’ ఓటీటీ డీల్.. రిలీజ్‌కు ముందే భారీ బిజినెస్ టాక్!

మెగాస్టార్ చిరంజీవి సినిమా కెరియర్..

మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే.. ఈ ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు సినిమా చేసి ఇండస్ట్రీ హిట్టును తన ఖాతాలో వేసుకున్నారు. ఒక ప్రస్తుతం బాబి దర్శకత్వంలో ముంబై మాఫియా డాన్ నేపథ్యంలో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

- Advertisement -

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you