Wednesday, July 22, 2026
HomeLATESTVaranasi : ‘వారణాసి’ ఓటీటీ డీల్.. రిలీజ్‌కు ముందే భారీ బిజినెస్ టాక్!

Varanasi : ‘వారణాసి’ ఓటీటీ డీల్.. రిలీజ్‌కు ముందే భారీ బిజినెస్ టాక్!

Varanasi : రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న వారణాసి సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

on
- Advertisement -banner Ad

Varanasi : గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘వారణాసి’ (Varanasi)గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా గ్లోబల్ లెవెల్‌లో తెరకెక్కుతుండటంతో, దానిపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ కావడానికి ఇంకా చాలా టైమ్ ఉన్నప్పటికీ, అప్పుడే దీని బిజినెస్ వర్గాల్లో ఒక రేంజ్ క్రేజ్ మొదలైపోయింది. ఓటీటీ, టీవీ హక్కుల కోసం టాప్ కంపెనీలు గట్టి ఆఫర్లతో ముందుకొస్తున్నాయనే వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాలు చూద్దాం..

గ్లోబల్ కాంబో.. అంచనాలు మామూలుగా లేవు:

మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్‌గా వస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran ) విలన్‌గా నటిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ కావడంతో, ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ కోసం ఆడియన్స్ ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఇంతటి భారీ స్టార్ కాస్టింగ్ ఉన్న సినిమా కాబట్టే, బిజినెస్ పరంగా కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది.

- Advertisement -
Advertisement

also read:OTT movies:అవతార్ 3 నుండి బాహుబలి ది టార్చ్ బేర్ వరకూ.. ఈ ఒక్క వారంలోనే ఓటీటీలో 21 సినిమాలు..

ఓటీటీ, సాటిలైట్ కలిపి భారీ ఆఫర్:

తాజా సమాచారం ప్రకారం.. ‘వారణాసి’ కేవలం ఇండియన్ వర్షన్ హక్కుల కోసమే ఒక పాపులర్ ఓటీటీ సంస్థ భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తూ ముందుకు వచ్చిందట. వారు కేవలం డిజిటల్ రైట్స్ మాత్రమే కాకుండా, సాటిలైట్ హక్కులను కూడా కలిపి సొంతం చేసుకోవాలని చూస్తున్నారట. సాటిలైట్, ఓటీటీ రెండు కలిపి డీల్ మాట్లాడటం అంటే.. ప్రస్తుత మార్కెట్ ప్రకారం జీ5 లేదా జియో సినిమా-హాట్ స్టార్ రేసులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ వర్గాలు అంటున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Dhanush:ప్రేమే లేని చోట బ్రేకప్ ఏంటి.. తెర వెనుక అసలు నిజం!

ఇంకా ముగియని చర్చలు.. రేసులో ఎవరున్నారో?:

సాధారణంగా ఇలాంటి క్రేజీ సినిమాల హక్కులు రికార్డు స్థాయి ధరలకు అమ్ముడవుతుంటాయి. అయితే, ‘వారణాసి’ ఓటీటీ డీల్ ఇప్పటివరకు పూర్తిగా క్లోజ్ కాలేదని తెలుస్తోంది. హక్కుల కోసం ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక రాజమౌళి సినిమా రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే కాబట్టి, భారీ బడ్జెట్ చిత్రానికి తగ్గట్టుగానే మేకర్స్ కూడా నెక్స్ట్ లెవెల్ రేటును ఆశిస్తున్నారు. మరి ఈ భారీ డీల్‌ను దక్కించుకుని ఫ్రంట్ రన్నర్‌గా నిలిచే ఆ లక్కీ సంస్థ ఏదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

- Advertisement -
Advertisement

ఏది ఏమైనా ‘వారణాసి’ సినిమా షూటింగ్ దశలోనే ఇలాంటి మైండ్ బ్లోయింగ్ బిజినెస్ ఆఫర్లను అందుకోవడం మహేష్ బాబు, రాజమౌళి క్రేజ్‌కు అద్దం పడుతోంది. ఇక థియేటర్లలోనే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి..

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you