Trisha Krishnan:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు దక్కించుకొని.. టీవీకే అనే రాజకీయ పార్టీని స్థాపించి, ఈ ఏడాది తమిళనాడులో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే తమిళనాడుకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఆయన కెరియర్ పరంగా దూసుకుపోతున్నప్పటికీ వ్యక్తిగతంగా విమర్శలు మాత్రం ఎదుర్కొంటున్నారు.
త్రిష – విజయ్ మధ్య బ్రేకప్ రూమర్స్ వైరల్..
గత కొంతకాలంగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష తో ఈయన రహస్యంగా ఎఫైర్ కొనసాగిస్తున్నారనే వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తూ వచ్చాయి. పైగా ఎలక్షన్స్ సమయంలో, ఎన్నికల ఫలితాల సమయంలో అలాగే ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు కూడా త్రిష (Trisha Krishnan)స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అలాంటి ఈమె.. సోమవారం విజయ్ పుట్టినరోజు కాక ఆయనకు అటు సోషల్ మీడియా వేదికగా ఎటువంటి విషెస్ చెప్పలేదు. దీంతో విజయ్(Vijay Thalapathy) త్రిష మధ్య మనస్పర్ధలు వచ్చాయని.. బ్రేకప్ చేసుకున్నారని కామెంట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపించాయి.మరొకవైపు సంగీత – విజయ్ కలువబోతున్నారు. వీరిని కలపడానికి విజయ్ తల్లి రంగంలోకి దిగింది. ఇక వీరు కలుస్తున్న నేపథ్యంలో త్రిష ఆయనకు దూరం అయిందేమో అంటూ కూడా ఊహాగానాలు వ్యక్తం చేశారు.
ALSO READ:Peddi Movie Ott:మరో వారంలో ఓటీటీలోకి పెద్ది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సడన్ ట్విస్ట్ ఇచ్చిన త్రిష..
అయితే ఆ రూమర్స్ అన్ని పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యంలో సడన్గా మంగళవారం సాయంత్రం తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఊహించని పోస్ట్ పెట్టి అందరిని సర్ప్రైజ్ చేసింది. విజయ్ దళపతి బర్తడే సందర్భంగా కేక్ కట్ చేస్తున్న ఒక క్యాండీడ్ ఫోటోను షేర్ చేస్తూ రూమర్స్ కి చెక్ పెట్టింది.ఈ ఫోటోలో విజయ్ కేకు ముందు కూర్చోగా.. ఆయన పక్కనే కూర్చుని ఆయననే చూస్తూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ..” అన్నింటిని విలువగా మార్చే వ్యక్తికి హ్యాపీ బర్తడే” అంటూ పోస్ట్ చేసింది. ఈ సెలబ్రేషన్స్ ను అర్ధరాత్రి 12 గంటలకు జరిపినట్లుగా హింట్ ఇస్తూ 00:00 అని పోస్ట్ పెట్టడంతో త్రిష విజయ్ బర్తడేను అందరికంటే ముందే అర్ధరాత్రి సెలబ్రేట్ చేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు . అంతేకాదు క్యాప్షన్ పక్కన లవ్ ఎమోజితో పాటు దిష్టి ఎమోజిని కూడా ఆమె పంచుకుంది.
ALSO READ:Chiranjeevi:సమంత – రాజ్ దంపతులకు చిరంజీవి స్పెషల్ విషెస్.. ప్రెగ్నెన్సీ వార్తలు నిజమేనా?
ప్రేమ బలపడిందా..
ఇకపోతే ఈ ఫోటో, పెట్టిన కొటేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బర్తడే విషెస్ చెప్పినప్పటికీ ఎందుకు సోషల్ మీడియాలో వెంటనే షేర్ చేయలేదు. రూమర్స్ కు ఎందుకు తావు ఇచ్చింది అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి అయితే త్రిష షేర్ చేసిన ఈ ఫోటో ఇచ్చిన క్యాప్షన్ ని బట్టి చూస్తే వీరి మధ్య రిలేషన్ మరింత బలపడిందనే కామెంట్లు వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం.
విడాకులా? లేక సర్దుకుపోవడమా?
ఇక మరొకవైపు విజయ్ భార్య సంగీత (Sangeetha )తన భర్త నుంచీ విడాకులు కావాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు విచారణలు జరగగా తదుపరి విచారణను ఆగస్టు కి వాయిదా వేసింది న్యాయస్థానం. మరి తదుపరి విచారణలో వీరు నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారా లేక విజయ్ తల్లి ప్రోత్సాహంతో తిరిగి మళ్ళీ ఒకటి అవుతున్నారా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.
View this post on Instagram


