Wednesday, July 22, 2026
HomeLATESTOTT : వెన్నులో వణుకు పుట్టిస్తున్న క్రైమ్ మూవీ.. ఓటీటీని షేక్ చేస్తున్న రియల్ స్టోరీ!

OTT : వెన్నులో వణుకు పుట్టిస్తున్న క్రైమ్ మూవీ.. ఓటీటీని షేక్ చేస్తున్న రియల్ స్టోరీ!

OTT : ఒక రియల్ క్రైమ్ స్టోరీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తూ అటు ఇంటర్నేషనల్ లెవెల్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

on
- Advertisement -banner Ad

OTT : సాధారణంగా ఓటీటీలోకి ఎన్నో జానర్లలో సినిమాలు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి.. కానీ కొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్ లు మాత్రం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించడమే కాకుండా క్యూరియాసిటీని కూడా పెంచుతూ ఉంటాయి. అంతేకాదు ఇంకొన్ని చిత్రాలు వెన్నులో వణుకు పుట్టిస్తూ ఓటీటీ ను షేక్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అలా ఇప్పుడు ఒక సిరీస్ ఏకంగా ఓటీటీ ప్లాట్ఫామ్ ను షేక్ చేస్తూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది ఒక రియల్ క్రైమ్ స్టోరీ.. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఓటీటీని షేక్ చేస్తున్న రియల్ క్రైమ్ స్టోరీ..

ఇకపోతే దేశవ్యాప్తంగా అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ సిరీస్ గురించి విపరీతమైన చర్చ జరగడానికి కారణం గతంలో దేశాన్ని వణికించిన ఒక క్రైమ్ స్టోరీ ఆధారంగానే ఈ సిరీస్ ను తెరకెక్కించడమే. కేవలం ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఐ ఎం డి బి లో కూడా ఈ సిరీస్ కి టాప్ రేటింగ్ లభించడం విశేషం. మరి ఇన్ని సంచలనాలు సృష్టిస్తున్న ఈ వెబ్ సిరీస్ ఏంటి? అందులో ఏముంది? అసలు స్టోరీ ఏంటి? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -
Advertisement

ALSO READ:Trisha Krishnan:బ్రేకప్ కాదు విత్ లవ్.. విజయ్ తో స్పెషల్ ఫోటో షేర్ చేసిన త్రిష!

రియల్ కథతో..

స్టోరీ విషయానికి వస్తే.. 1978వ సంవత్సరంలో దేశ రాజధాని ఢిల్లీలో ఒక ప్రముఖ అధికారి పిల్లలు ఇద్దరు ఒకేరోజు అదృశ్యం అవుతారు. కట్ చేస్తే ఆ పిల్లలు ఇద్దరు మరుసటి రోజు అడవిలో శవాలుగా కనిపిస్తారు .ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తుంది .మరి ఆ ఇద్దరు పిల్లలను అత్యంత కిరాతకంగా చంపింది ఎవరు? ఎందుకు ఈ హత్యలు చేశారు? పోలీసులు ఆ క్రిమినల్స్ ను ఎలా పట్టుకున్నారు? ఆ తర్వాత ఏం జరిగింది ? అనేది ఈ సిరీస్. 1978లో దేశాన్ని వణికించిన బిల్లా -రంగ కేసు ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ పేరు రాఖ్.

- Advertisement -
Advertisement

ALSO READ:Peddi Movie Ott:మరో వారంలో ఓటీటీలోకి పెద్ది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

హిందీతో పాటు తెలుగు, తమిళ్..

మీర్జాపూర్ ఫేమ్ అలీ ఫజల్ ప్రధాన పాత్ర పోషిస్తూ స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే మరో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన ఈ సిరీస్ లో పలువురు బాలీవుడ్ తారలు మెరిసారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న ఈ వెబ్ సిరీస్ ని పాతాళ్ లోక్ సిరీస్ ఫేమ్ ప్రొసిత్ రాయ్ తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇక హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతూ ఉండడం గమనార్హం.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you