Samantha:ప్రముఖ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత(Samantha) లేడీ ఓరియంటెడ్ గా చేసిన చిత్రం మా ఇంటి బంగారం. జూన్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇందులో సమంత కోడలిగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే మరొకవైపు యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది. ముఖ్యంగా అటు గుల్షన్ దేవయ్య కూడా తన పాత్ర పరిధికి మించి నటించారు. ఇక రచన, శ్రీముఖి, శ్రీలక్ష్మి, గౌతమి ఇలా తదితరులు నటనతో ఆకట్టుకున్నారు.
శుభవార్త చెప్పిన సమంత..
ఇకపోతే ఈ సినిమా సక్సెస్ సాధించిన సందర్భంగా పలు సక్సెస్ ఈవెంట్లు నిర్వహిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది సమంత. ఈ నేపథ్యంలోనే ఇటీవల మా ఇంటి బంగారం సక్సెస్ సెలబ్రేషన్స్ లో కనిపించి సందడి చేసింది. ఇందులో బేబీ బంప్ తో కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. దీనితో సమంత ప్రెగ్నెంట్ అంటూ ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు. అయితే దీనిపై ఎక్కడ అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ చిరంజీవి(chiranjeevi) ఇంటికి మా ఇంటి బంగారం టీం వెళ్లినప్పుడు చిరంజీవి.. సమంత – రాజ్ దంపతులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు .ఇక దీంతో సమంత ప్రెగ్నెంట్ అని దాదాపు కన్ఫామ్ అయిపోయింది. కానీ సమంత, రాజ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాలని అభిమానులు ఎంతగానో కోరుకున్నారు.
also read:Singer Sunitha: ఇండస్ట్రీ మహిళలకు సేఫ్ ప్లేస్ కాదు .. సింగర్ సునీత బోల్డ్ స్టేట్మెంట్!
మెటర్నటీ లీవ్ తీసుకోబోతున్నాను..
అందరూ అనుకున్నట్టుగానే నిన్న మీడియా మిత్రులతో ఒక సమావేశం నిర్వహించగా అందులో సమంత మాట్లాడుతూ..”అవును, మీరు అనుకుంటున్నట్టు నేను గర్భవతి”నే అంటూ శుభవార్త చెప్పేసింది.. ఈ మేరకు సమంత మాట్లాడుతూ.. “కొంతకాలం గ్యాప్ తీసుకొని మా ఇంటి బంగారం సినిమాతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మళ్లీ నేను లీవ్ తీసుకోబోతున్నాను. మెటర్నటీ లీవ్ తీసుకోబోతున్నాను” అంటూ చెప్పి సర్ప్రైజ్ చేసింది. మొత్తానికి అయితే సమంత ప్రెగ్నెంట్ అంటూ క్లారిటీ ఇవ్వడంతో అటు సినీ సెలబ్రెటీలు, అభిమానులు, సినీ ప్రేక్షకులు ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
also read:Faima: 9 ఏళ్ల ప్రేమ.. సడన్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన ఫైమా!
ఫ్యాన్స్ నిరాశలో..
సమంత ప్రెగ్నెంట్ అని శుభవార్త చెప్పి అభిమానులను సంతోషపరిచింది కానీ ఆ విషయాన్ని చెప్పి అభిమానులను నిరాశపరిచింది. ఏమిటా విషయం అంటే ఈమె మెటర్నిటీ లీవ్ తీసుకోబోతోంది.దీంతో కొంతకాలం ఇండస్ట్రీకి మళ్ళీ బ్రేక్ ఇవ్వబోతోంది..ఏది ఏమైనా సమంత మళ్లీ ఇండస్ట్రీకి దూరం కాబోతోంది అనే విషయం అభిమానులను నిరాశకు గురిచేసినప్పటికీ సమంత ఆరోగ్యంగా ఉండాలి అని, పండంటి బిడ్డకు జన్మనివ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇంక సమంత ప్రస్తుతం మరో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కాబట్టి పండంటి బిడ్డకు జన్మనిచ్చి కొంతకాలం వారితో జీవితాన్ని గడిపి ఆ తర్వాతే ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇంకా దీన్ని బట్టి చూస్తే సమంత మరో మూడేళ్లు ఇండస్ట్రీకి దూరం కాబోతోంది అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో..
#Samantha confirmed her pregnancy and revealed that she will be taking a brief maternity break from films🤝pic.twitter.com/wjjuJjTceS
— AmuthaBharathi (@CinemaWithAB) June 24, 2026


