Wednesday, July 22, 2026
HomeLATESTFaima: 9 ఏళ్ల ప్రేమ.. సడన్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన ఫైమా!

Faima: 9 ఏళ్ల ప్రేమ.. సడన్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన ఫైమా!

Faima: జబర్దస్త్ ఫైమా సడన్గా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

on
- Advertisement -banner Ad

Faima: జబర్దస్త్ లేడీ కమెడియన్ ఫైమా(Faima) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన కామెడీతో.. విలక్షణ లేడీ కమెడియన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. బిగ్ బాస్ షో ద్వారా కూడా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా బిగ్ బాస్ లో తన అద్భుతమైన టాస్క్ పెర్ఫార్మన్స్ తో అందరినీ ఆకట్టుకున్న ఈమె.. ఎంతో మంది బుల్లితెర అభిమానులకు ఫేవరెట్ కమెడియన్ అయిపోయింది . ఇక సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన ఈమె ఒకప్పుడు పటాస్ ప్రవీణ్ (Praveen) తో ప్రేమలో ఉన్నట్లు కొంతకాలం వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ఫైమా..

అద్భుతమైన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ సడన్గా బ్రేకప్ చెప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి. ముఖ్యంగా ప్రవీణ్ ఈమెను పెళ్లి చేసుకుంటానని పదేపదే అడగడం.. బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ అసలు విషయం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రవీణ్ తనకు కేవలం ఆన్ స్క్రీన్ ఫ్రెండ్ మాత్రమేనని తాను గత తొమ్మిది సంవత్సరాలుగా ఒక అబ్బాయితో ప్రేమలో ఉన్నాననే విషయాన్ని గత ఏడాది బహిర్గతం చేసింది.

- Advertisement -
Advertisement

ALSO READ:OTT : వెన్నులో వణుకు పుట్టిస్తున్న క్రైమ్ మూవీ.. ఓటీటీని షేక్ చేస్తున్న రియల్ స్టోరీ!

విడిపోవడానికి వెయ్యి కారణాలు.. మేము పెళ్లి చేసుకున్నాం..

అయితే ఇప్పుడు తాజాగా పెళ్లి పీటలెక్కి ఆశ్చర్యపరిచింది. పైగా సైలెంట్ గా చడీ చప్పుడు లేకుండా తన సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ విషయాన్ని వీడియో రూపంలో ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. “చాలామంది మా ప్రేమను నిందించారు. మమ్మల్ని అవమానించారు. మమ్మల్ని విడగొట్టాలని ప్రయత్నించారు. కానీ మా ప్రేమ ప్రతి అడ్డంకిని అధిగమించి మరింత బలంగా నిలిచింది . లెక్కలేనన్ని పోరాటాలు చేసాము. అంతులేని సహనాన్ని భరించాము. వదిలేయడానికి 1000 కారణాలు ఉన్నా ప్రతిరోజు వాటిని మేము అధిగమిస్తూ ఒకరికి ఒకరు అండగా నిలుస్తూ ఈరోజు మేము భార్యాభర్తలుగా మారిపోయాము .ఎట్టకేలకు మాకు పెళ్లయింది . మా తొమ్మిదేళ్ల ప్రేమాయణానికి తెరపడుతూ పెళ్లి అనే బంధం లోకి మేము అడుగుపెడుతున్నాం” అంటూ ఫైమా ఒక ఎమోషనల్ నోట్ పంచుకుంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Trisha Krishnan:బ్రేకప్ కాదు విత్ లవ్.. విజయ్ తో స్పెషల్ ఫోటో షేర్ చేసిన త్రిష!

కొత్త జంటకు శుభాకాంక్షలు..

మొత్తానికైతే ఫైమా తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలు ఎక్కి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ఇకపోతే ఈమె పెళ్లి చేసుకున్న అబ్బాయి పేరు ప్రవీణ్ నాయక్. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

- Advertisement -
Advertisement

 

View this post on Instagram

 

A post shared by FAIMA (@faima_patas)

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you