Saturday, June 27, 2026
HomeLATESTAnchor:మద్యం సేవిస్తానంటూ బాంబు పేల్చిన జబర్దస్త్ యాంకర్!

Anchor:మద్యం సేవిస్తానంటూ బాంబు పేల్చిన జబర్దస్త్ యాంకర్!

Anchor: జబర్దస్త్ యాంకర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మద్యం సేవిస్తాను అంటూ బాంబు పేల్చింది.

on
- Advertisement -banner Ad

Anchor:సినీ , బుల్లితెర సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో కుతూహలం కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా వారి పర్సనల్ విషయాలు దాదాపుగా రహస్యంగానే ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఆ విషయాలను వారే స్వయంగా బట్టబయలు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక యాంకర్ తాను కూడా మద్యం సేవిస్తాను అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. మరి ఆమె ఎవరు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

తండ్రి గురించి మాట్లాడడానికి నిరాకరించిన సౌమ్యారావు..

ఆమె ఎవరో కాదు ప్రముఖ యాంకర్ సౌమ్యా రావు(Anchor Sowmya Rao).. సీరియల్ నటిగా తన కెరీర్ ను ప్రారంభించిన ఈమె కొన్ని సీరియల్స్ లో విలన్ పాత్రలతో ఆకట్టుకుంది. ఇక జబర్దస్త్ కామెడీ షో తో యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. కానీ అనూహ్యంగా షో నుంచి అతి తక్కువ సమయంలోనే ఎలిమినేట్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె..ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని ఒక చిన్న తాలూకులో జన్మించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి ప్రశ్నించగా సౌమ్య మాట్లాడుతూ నా తండ్రి గురించి వదిలేయండి. వాళ్ల గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు అంటూ కామెంట్స్ చేసింది సౌమ్యా రావు.

- Advertisement -

ALSO READ:Bahubali 3:బాహుబలి 3 వచ్చేస్తోంది.. రంగంలోకి అనుష్క – ప్రభాస్!

తన తల్లి అవమానాలు భరించరానివి అంటూ..

అలాగే తన తల్లితో తనకున్న బలమైన బంధం గురించి మాట్లాడుతూ.. “మా అమ్మ సింగిల్ పేరెంటు కాదు.. నాకు అమ్మానాన్నలు ఇద్దరూ ఉన్నారు. అయితే నా చిన్నతనంలో మా అమ్మ పేదరికం కారణంగా సామాజికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఏదైనా శుభకార్యానికి లేదా పెళ్లిళ్లకు వెళ్తే మంచి చీరలు, నగలు లేకపోవడం వల్ల బంధువులు మా అమ్మని చిన్నచూపు చూసేవారు. నువ్వు ఎందుకు ప్రతి దానికి ముందు ముందుకు వెళ్తావ్.. పెళ్లికి వెళ్తున్నప్పుడు వెనకాలే ఉండు.. అంటూ మా అమ్మను అవమానించారు. ఈ సంఘటనలు నన్ను ఎంతగానో బాధించాయి. నా తల్లికి మంచి జీవితాన్ని ఇవ్వాలని, మంచి చీరలు కొనివ్వాలని, ఎప్పుడూ నగలు ధరించి గౌరవంగా చూసుకోవాలని ఎన్నో కలలు కన్నాను. కానీ నా కలలు నెరవేరకముందే మా అమ్మ అనారోగ్యానికి గురై మంచం పట్టింది. ఈ పరిణామం నన్ను మానసికంగా కృంగదీసింది. ఈ కష్టాలన్నీ నేను అనుభవించాను.

- Advertisement -

ALSO READ:Blast Movie: ఓటీటీలో దడ పుట్టిస్తున్న యాక్షన్ థ్రిల్లర్.. గూస్ బంప్స్ గ్యారెంటీ!

మద్యం కూడా సేవిస్తాను – సౌమ్య రావు

ఆ బాధల నుండి బయటపడడానికి అప్పుడప్పుడు మద్యం కూడా సేవిస్తాను అంటూ నిర్మొహమాటంగా చెప్పేసింది సౌమ్యరావు. ముఖ్యంగా రెడ్ వైన్ తీసుకోవడం వల్ల మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. స్కిన్ గ్లో అవుతుంది. అయితే అది కూడా కేవలం అప్పుడప్పుడు మాత్రమే తీసుకుంటాను. అలవాటుగా మార్చుకోలేదు.. అంటూ క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఏది ఏమైనా సౌమ్యరావు తాజాగా చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే సౌమ్యరావు తన తల్లి ఎదుర్కొన్న అవమానాలు ఇబ్బందుల గురించి చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు

- Advertisement -

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you