Saturday, June 27, 2026
HomeLATESTJabardast Mahesh:ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నటుడు మహేష్!

Jabardast Mahesh:ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నటుడు మహేష్!

Jabardast Mahesh: జబర్దస్త్ ద్వారా కమెడియన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపున సొంతం చేసుకుని ఇప్పుడు పలు సినిమాలలో అవకాశాలు అందుకుంటున్న మహేష్ ఎమోషనల్ వీడియో షేర్ చేశారు.

on
- Advertisement -banner Ad

Jabardast Mahesh:జబర్దస్త్ కామెడీ షోలోకి కమెడియన్ లుగా ఎంట్రీ ఇచ్చిన చాలామంది.. సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా, హీరోలుగా పేరు సంపాదించిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో నటుడు మహేష్ కూడా ఒకరు. సినిమాలలో చిన్నచిన్న పాత్రలలో నటించి తన అద్భుతమైన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో పలు సినిమాలలో అవకాశాలను అందుకున్నారు. యాత్ర, రంగస్థలం, శతమానం భవతి, మహానటి వంటి సినిమాలతో నటుడుగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న మహేష్ కొన్ని చిత్రాలలో విలన్ గా కూడా నటించారు. దీంతో చాలామంది దర్శక నిర్మాతలు కూడా మహేష్ ను బాగా ఎంకరేజ్ చేశారు.

ఎమోషనల్ వీడియో షేర్ చేసిన మహేష్..

ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ బాగానే పేరు సంపాదించిన మహేష్.. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియోని రిలీజ్ చేశారు. అయితే అది ఒక సాధారణ వీడియో అయితే ఎవరు పెద్దగా పట్టించుకునే వారు కాదు.కానీ తాను ఏదో ఎమోషనల్ అవుతూ ఆ వీడియోని విడుదల చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. మునుపెన్నడూ లేని విధంగా మహేష్ ఎమోషనల్ అవుతూ ఆ వీడియోని షేర్ చేశాను. మహేష్ మాట్లాడుతూ.. “లైఫ్ చాలా అన్ ప్రిడక్టబుల్.. ఎప్పుడు ఎవరి లైఫ్ లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మనం బయట చూసిన దాన్నిబట్టి ఏవేవో ఊహించుకోకూడదు.. నమ్మే టైం కూడా కరెక్ట్ కాదు. అలాగే ముఖ్యంగా రిపోర్టర్స్ కి , మీమర్స్ కి నేను నిజం చెప్పే వరకు మీరు అనుకున్నది రాయొద్దు అంటూ ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేశారు.

- Advertisement -

also read:Anchor:మద్యం సేవిస్తానంటూ బాంబు పేల్చిన జబర్దస్త్ యాంకర్!

మహేష్ వీడియో పై భిన్నాభిప్రాయాలు..

అయితే మహేష్(Jabardast Mahesh) ఇంతలా ఎందుకు ఎమోషనల్ అయ్యారు అనే విషయం మాత్రం అర్థం కావడం లేదు. కొంతమంది నెటిజన్స్ మాత్రం ఇది సినిమా ప్రమోషన్స్ లో భాగమే అయ్యుంటుంది అంటూ మహేష్ వీడియో పైన కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీడియో పైన మహేష్ ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.

- Advertisement -

also read:Bahubali 3:బాహుబలి 3 వచ్చేస్తోంది.. రంగంలోకి అనుష్క – ప్రభాస్!

మహేష్ స్పందిస్తారా?

నిజానికి ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్ పేరిట ఇలాంటి వీడియోలను రిలీజ్ చేస్తూ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేసి చివర్లో బాంబు పేలుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటివి చేయడం వల్ల ఒక్కొక్కసారి సెలబ్రెటీలు నిజంగానే తమకు చేదు అనుభవం ఎదురైనా.. ఇలాంటి వాటి వల్ల నమ్మే పరిస్థితి దాదాపు లేకపోవచ్చని చెప్పాలి. అయితే మహేష్ మరి నిజంగానే ఎమోషనల్ అవుతూ ఆ వీడియోని షేర్ చేశారా లేక ఇది ఒక సినిమా ప్రమోషనా అనే విషయం తెలియాలి అంటే మహేష్ స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే.

- Advertisement -

 

View this post on Instagram

 

A post shared by Mahesh Achanta (@mahesh_achanta)

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you