Wednesday, July 22, 2026
HomeLATESTKollywood: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత..!

Kollywood: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత..!

Kollywood: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నటుడు అయిన ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.

on
- Advertisement -banner Ad

Kollywood: గత కొంతకాలంగా చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీల మరణాలు అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. కొంతమంది అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిస్తే.. మరికొంతమంది వయస్సు వృద్ధాప్య కారణాల వల్ల కన్ను మూస్తున్నారు. అయితే ఇప్పుడు మరొక విషాదం సినీ పరిశ్రమలో తాజాగా చోటుచేసుకుంది.

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి..

ప్రముఖ తమిళ డైరెక్టర్ , నటుడు, రచయిత కే భాగ్యరాజ్ (73) గుండెపోటుతో ఈరోజు చెన్నైలో అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. భాగ్యరాజ్ (K.Bhagyaraj)తమిళనాడులోని ఈ రోడ్ జిల్లాలో జన్మించారు. ఈయన ప్రముఖ డైరెక్టర్ గా పేరు సంపాదించిన భారతీ రాజా దగ్గర సహాయ దర్శకుడుగా కూడా పనిచేశారు.అక్కడ నుంచి తన సినీ కెరీర్ ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. అనంతరం తనదైన శైలిలో దర్శకుడుగా పేరు సంపాదించిన భాగ్యరాజ్.. ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాల జీవితాలకు సంబంధించిన కథలను తెరకెక్కించి బాగా గుర్తింపు సంపాదించుకున్నారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Jabardast Mahesh:ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నటుడు మహేష్!

దర్శకుడు గానే కాదు నటుడిగా కూడా..

డైరెక్టర్ భాగ్యరాజ తన సినీ జీవితంలో 25 కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించగా.. 75 చిత్రాలకు పైగా నటించారు. తమిళ సినీ పరిశ్రమలో ఈయన సినిమాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈయన సినిమాలలో అందరి హృదయాలను తాకేలా కథనం ఉండడమే కాకుండా వినోదంతో పాటు సామాజిక అంశాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవి. ఈయన ప్రతిభను గుర్తించిన నటుడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ సినీ పరిశ్రమలో తన వారసుడిగా ఈయనను ప్రశంసించారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Anchor:మద్యం సేవిస్తానంటూ బాంబు పేల్చిన జబర్దస్త్ యాంకర్!

బాలీవుడ్ లో కూడా భారీ పాపులారిటీ ..

బాలీవుడ్ లో కూడా ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో చిలిపి పెళ్ళాం, మేం వయసుకు వచ్చాం, డిటెక్టివ్, అల్లంత దూరాన, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, తదితర చిత్రాలలో నటించారు భాగ్యరాజ్. చివరిగా ధనుష్ నాగార్జున నటించిన కుబేర చిత్రంలో సాధువు పాత్రలో కనిపించారు.భాగ్యరాజ కొన్ని సీరియల్స్ ను కూడా రచించారు. అలాగే కొన్ని నవలలు కూడా రచించినట్లు తెలుస్తోంది. 1983లో ముందనై ముడిచ్చు సినిమాకి గాను ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు భాగ్యరాజ్. ఈయన మృతితో తమిళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఈయన మృతికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానుల సైతం సంతాపం తెలుపుతున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you