Pawan Kalyan:టాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు పొందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. అలాగే జనసేన పార్టీని కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో మరింత ముందుకు తీసుకువెళ్లేలా సన్నహాలు చేస్తున్నారు. కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ విషయాలను కూడా పవన్ కళ్యాణ్ తెలియజేయడం జరిగింది. కొద్దిరోజుల క్రితం తాను షూటింగ్లో తగిలిన కొన్ని చిన్న చిన్న గాయాలు ఇప్పటికీ ఇబ్బంది పెడుతుంటాయని తెలియజేశారు. అయినా కూడా తాను అభిమానుల కోసం అన్నిటినీ భరిస్తున్నానంటూ తెలిపారు.
పవన్ కళ్యాణ్ కి ఆపరేషన్..
ఇటీవలి భుజాల కండరాలకు సంబంధించి ఆపరేషన్ చేయించుకోవాలని తెలియజేశారు. అందుకు సంబంధించి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వైద్య పరీక్షల కోసం ముంబైకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. తన భార్య అన్నా లెజినోవాతో కలిసి ముంబైకి చేరుకున్నారు. భుజాలకు సంబంధించి రోటేటర్ కఫ్ గాయం, రెండు భుజాలకు సంబంధించి కండరాలు కూడా చిట్లడంతో ఇబ్బంది పడుతూ ఉన్న పవన్ కళ్యాణ్ వైద్య పరీక్షలు నిమిత్తం ముంబైలోని కోకిల బెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్ళినట్లు తెలుస్తోంది. పరీక్ష అనంతరం రిపోర్ట్ చూసుకుని మరీ ఆపరేషన్ గురించి చర్చించి తిరిగి రేపటి రోజున రాబోతున్నట్లు సమాచారం.
ALSO READ:NTR – Trivikram : పురాణాల కథతో త్రివిక్రమ్.. పోస్టర్లో ఇంత ఉందా?
సర్జరీ కూడా..
త్వరలోనే వీటికి సంబంధించి ఆపరేషన్ కూడా పవన్ కళ్యాణ్ చేయించుకోబోతున్నారనే విషయం అభిమానులకు తెలియగానే ఆందోళన చెందుతున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం సెట్ అవ్వలేదా అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. జనసేన పార్టీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ విషయం అధికారికంగా ప్రకటించారు. మరి ఈ విషయం పైన స్వయంగా పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి. ఇటీవల కాలంలో రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఇటువంటి తరుణంలోనే ఈ విషయం అభిమానులను నిరుత్సాహపరిచేలా చేస్తోంది.
ALSO READ:Balayya vs chiru: :2027లో బాలయ్య వర్సెస్ చిరంజీవి.. మళ్ళీ పోరుకు సిద్ధం!
పవన్ కళ్యాణ్ సినిమాలు..
పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలతో అభిమానులను అలరించారు. త్వరలోనే ఓజీ 2 సినిమాని సెట్స్ మీదికి తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి డైరెక్టర్ సుజిత్ కూడా అన్ని పనులు చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఇవే కాకుండా మరి కొంతమంది దర్శకులు కూడా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
View this post on Instagram


