Wednesday, July 22, 2026
HomeLATESTNTR - Trivikram : పురాణాల కథతో త్రివిక్రమ్.. పోస్టర్లో ఇంత ఉందా?

NTR – Trivikram : పురాణాల కథతో త్రివిక్రమ్.. పోస్టర్లో ఇంత ఉందా?

NTR - Trivikram: ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న కొత్త సినిమా అఫీషియల్ అనౌన్స్మెంటును తాజాగా మేకర్స్ ప్రకటించారు.

on
- Advertisement -banner Ad

NTR – Trivikram :టాలీవుడ్ లో గత కొద్దిరోజులుగా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న అప్డేట్ ఈరోజు రానే వచ్చింది. అదే ఎన్టీఆర్, త్రివిక్రమ్. వీరిద్దరి కలయికలో రాబోతున్న సినిమా తాజా ప్రకటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా గడిచిన కొన్ని గంటల క్రితం అద్భుతమైన పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా గాడ్ కార్తికేయుని జీవితం ఆధారంగా రూపొందించబోతున్నారని ప్రచారం.. అయితే ఎట్టకేలకు అదే నిజం అయింది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ చూస్తూ ఉంటే అభిమానులకు మరింత పూనకాలు తెప్పించేలా కనిపిస్తోంది.

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మూవీ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్..

జూనియర్ ఎన్టీఆర్(NTR) తన ట్విట్టర్ లో ఇలా రాసుకుంటూ.. “ది సన్ ఆఫ్ శివ.. ది ప్రైడ్ ఆఫ్ పార్వతి.. ది ఎటర్నల్ కమాండర్” అంటూ రాసుకు వచ్చారు.. అంటే (పరమశివుని పుత్రుడు, పార్వతీమాత గర్వకారణం అంటూ నేరుగా సుబ్రహ్మణ్యస్వామి జననం) గురించే సినిమా ఉండబోతున్నట్లు ఒక హింట్ ఇచ్చారు. తారకాసురుడిని సంహరించడానికి ఉద్భవించినటువంటి పరమశివుని తేజస్సుని ఈ సినిమా కథ ఆధారంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా కుమారస్వామి దేవతల సైన్యానికి అధ్యక్షుడిగా, మహా సైన్యాన్ని నడిపించే వీరుడిగా దేవసేనాధిపతి అంశంతో జన్మించి ఒక యోధుడిగా కనిపించబోతున్నారని సమాచారం.

- Advertisement -
Advertisement

ALSO READ:OTT movies: ఈవారం ఓటీటిలో వచ్చే 15 మూవీస్, వెబ్ సిరీస్ ఇవే!

పోస్టర్ తో పాటు పవర్ఫుల్ కొటేషన్..

ఈ పోస్టర్ తో పాటుగా చిత్ర బృందం మరొక ఒక పవర్ఫుల్ కొటేషన్ ను విడుదల చేయడం మరింత అంచనాలను పెంచేస్తోంది.. కుమారస్వామి జననం హిమాలయాల దరిదాపుల్లోని శరవణభవ లో జరిగినట్లుగా పురాణాలు చెబుతున్నాయని తెలియజేశారు. కుమారస్వామిని తమిళనాడులో మురుగన్ గా, తెలుగు రాష్ట్రాలలో సుబ్రహ్మణ్యేశ్వరుడిగా భక్తులు ఆరాధిస్తారు. దీంతో ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కథ కేవలం ఒక ప్రాంతానికి పరిమితమయ్యే కథ కాదు అని యూనివర్సల్ గా పేరు పొందిన కథ అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement

ALSO READ:Balayya vs chiru: :2027లో బాలయ్య వర్సెస్ చిరంజీవి.. మళ్ళీ పోరుకు సిద్ధం!

త్రివిక్రమ్ తన టాలెంట్ కి వదిలిపెట్టనున్నారా?

ఇకపోతే పౌరాణిక నేపథ్యంలో ఉన్న సోషియో ఫాంటసీ సినిమా స్టోరీ అన్నట్లుగా ఈ పోస్టర్ చూస్తూ ఉంటే స్పష్టం అవుతోంది. ముఖ్యంగా పోస్టర్ లో పరమశివుని త్రిశూలం యుద్ధ భూమిలో నిటారుగా నిలుచొని ఉన్నట్టు కనిపిస్తోంది.. కానీ ఇది పైకి చూడడానికి పరమశివుని త్రిశూలంలా ఉన్నప్పటికీ ఇది కుమారస్వామి (సుబ్రహ్మణ్యస్వామి) ఆయుధమైన వేల్ కు మధ్య ఒక బలమైన సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పోస్టర్ లో అత్యంత ఆసక్తికరమైన అంశాలను కూడా జతచేసినట్లు కనిపిస్తోంది. మరి ఈసారి త్రివిక్రమ్(Trivikram) ఏదో బలమైన కథతోనే జన్యు శాస్త్రానికి, ఆధునిక జీవ శాస్త్రానికి మధ్య లింకు పెట్టే విధంగా సినిమా స్టోరీని తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి సంబంధించి నటీనటుల పేర్లు కూడా త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయబోతున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you