Wednesday, July 22, 2026
HomeLATESTBalayya vs chiru: :2027లో బాలయ్య వర్సెస్ చిరంజీవి.. మళ్ళీ పోరుకు సిద్ధం!

Balayya vs chiru: :2027లో బాలయ్య వర్సెస్ చిరంజీవి.. మళ్ళీ పోరుకు సిద్ధం!

Balayya vs chiru: బాలయ్య చిరంజీవి మధ్య పోటీ మరోసారి నెలకొనబోతోంది. 2027 సంక్రాంతికి వీరిద్దరి మధ్య సినిమా వార్ జరగనున్నట్లు సమాచారం.

on
- Advertisement -banner Ad

Balayya vs chiru: సీనియర్ నటులలో ఇప్పటికీ తమదైన సినిమాలతో ప్రేక్షకులను బాగా అలరిస్తున్న హీరోలలో నాగార్జున వెంకటేష్, బాలకృష్ణ ,చిరంజీవి అని చెప్పవచ్చు. ఎవరికివారు తమ సినిమాలతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటున్నారు. చాలా అరుదుగానే సీనియర్ హీరోల సినిమాలు ఒకేసారి పండుగలకు విడుదల అవుతూ ఉంటాయి. అలా ఇప్పుడు తాజాగా 2027 సంక్రాంతికి ఇద్దరు అగ్ర హీరోలు ఒకేసారి రంగంలోకి దిగబోతున్నారనే వార్తలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఆ చర్చ మరింత జోరుగా కొనసాగుతోంది. మరి ఆ హీరోలు ఎవరో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.

2027 పోరుకు సిద్ధం అంటున్న బాలయ్య – చిరు..

ఆ హీరోలు ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), నందమూరి బాలకృష్ణ(Balakrishna). చిరంజీవి గత కొన్నినేళ్లుగా నటిస్తున్న చిత్రం విశ్వంభర. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సినిమాని 2027 సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మాత్రం నాలుగేళ్ల క్రితం అభిమానులను ఊపేసిన సంక్రాంతి పోరు ఇప్పుడు మరొకసారి రిపీట్ కాబోతోందని వినిపిస్తోంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Suriya : రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ హీరో సూర్య?

నెగ్గేదెవరు..

ఈ రెండు సినిమాల విడుదల తేదీ పైన ఇప్పటివరకు ఇంకా ఎటువంటి అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ వచ్చే ఏడాది 2027 సంక్రాంతి లక్ష్యంగానే పెట్టుకొని ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వంభర సినిమా పైన మొదట భారీగానే అంచనాలు ఉన్నప్పటికీ ఎన్నోసార్లు వాయిదా పడుతూ ఉండడమే కాకుండా వీఎఫ్ఎక్స్ వల్ల ఈ సినిమా పైన కొంతమేరకు హైప్ తగ్గిందనే అభిప్రాయం సినీ విశ్లేషకులలో ఉన్నది. ఇక బాలకృష్ణ వరుసగా మంచి కథలతో దూసుకుపోతూ అభిమానులను అలరిస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:OTT movies: ఈవారం ఓటీటిలో వచ్చే 15 మూవీస్, వెబ్ సిరీస్ ఇవే!

సంక్రాంతి బరిలో నిలిచే మరో చిత్రం..

చిరంజీవి, బాలకృష్ణ మధ్య పోటీ కొత్తేమి కాదు. గతంలో చూసుకుంటే 2023 సంక్రాంతి సందర్భంగా బాలయ్య నటించిన వీర సింహారెడ్డి, అలాగే చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఒకే సీజన్లో విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలను మైత్రి మూవీస్ మేకర్స్ వారే నిర్మించారు. ఈ రెండు చిత్రాలు కూడా సంక్రాంతికి విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే బాలయ్య చిరంజీవి సినిమాలతో పాటు వచ్చే ఏడాది సంక్రాంతికి సైతం డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ ,కళ్యాణ్ రామ్ నటిస్తున్న సినిమా కూడా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఏ ఏ సినిమాలు సంక్రాంతికి విడుదలవుతాయో తెలియాలి అంటే మరొకొన్ని నెలలు ఆగాల్సిందే.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you