Akhil raj:రాజు వెడ్స్ రాంబాయి చిత్రంతో మంచి విజయం అందుకున్న యంగ్ హీరో అఖిల్ రాజ్ ఇప్పుడు ఊహించని వివాదంలో ఇరుక్కున్నారు. డెలివరీ బాయ్ పై దాడి చేయగా.. సదరు వ్యక్తి ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ క్షమాపణలు చెప్పినా సరే హీరో అఖిల్(Akhil raj) తో పాటు ఆయన కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
డెలివరీ బాయ్ ను అఖిల్ కొట్టారా?
తాజాగా వైరల్ అవుతున్న వీడియోని బట్టి చూస్తే సదరు డెలివరీ బాయ్ పొరపాటున రాంగ్ అడ్రస్ కు పార్సెల్ తీసుకొచ్చాడు. తన పొరపాటున గ్రహించి వెంటనే హీరోకి క్షమాపణలు కూడా చెప్పారట. కానీ హీరో అఖిల్ రాజ్ , అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. బిల్డింగ్ మెట్ల పైనుంచి కిందకి వస్తున్న డెలివరీ బాయ్ వైపు హీరో కోపంతో దూసుకు రావడం , అతడిని కొట్టడానికి ప్రయత్నించడం.. హీరో అఖిల్ ని తన తండ్రి ఆపే ప్రయత్నం చేసినా.. అఖిల్ తన తండ్రిని నెట్టేసి మరీ కిందకి రావడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అక్కడ ఉన్న కొంతమంది అఖిల్ ను ఆపే ప్రయత్నం చేసినా.. ఆయన శాంతించలేదు. డెలివరీ బాయ్ స్వయంగా ఈ దృశ్యాలను రికార్డు చేస్తూ తన ఆవేదన పంచుకున్నాడు. తాను క్షమాపణలు చెప్పినా వినకుండా హీరో అఖిల్ తనపై దౌర్జన్యానికి దిగాడు అని, అంతటితో ఆగకుండా అఖిల్ తల్లి తన ముఖంపై ఉమ్మి వేసి తీవ్రంగా అవమానించింది అంటూ ఆరోపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సదరు హీరో పై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
also read:Pawan Kalyan:ముంబైకి వెళ్లిన పవన్ కళ్యాణ్.. అసలేం జరిగిందంటే?
హీరో పై విమర్శలు..
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారగా.. నెటిజన్లు మండిపడుతూ ప్రతిరోజు కష్టపడే డెలివరీ బాయ్స్ పట్ల ఇలాంటి అహంకారపూరిత వైఖరి తగదు అంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కేవలం డెలివరీ బాయ్ వైపు ఉన్న వీడియో మాత్రమే బయటకు వచ్చినందున అసలు గొడవకు దారి తీసిన పూర్తి కారణాలు తెలియాల్సి ఉందని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఈ గొడవకు దారి తీసిన పూర్తి కారణాలు తెలియాలి అంటే ఈ ఘటనపై అఖిల్ లేదా ఆయన కుటుంబ సభ్యులు స్పందిస్తేనే అసలు నిజం వెలుగు చూస్తుంది.
also read:NTR – Trivikram : పురాణాల కథతో త్రివిక్రమ్.. పోస్టర్లో ఇంత ఉందా?
రాజు వెడ్స్ రాంబాయి సినిమా హీరో అంటా…
అనవసరంగా కెరీర్ పాడుచేసుకుంటున్నాడు….🤦🏼♂️https://t.co/WPWY3WdZXy
— RAM…🇮🇳🇮🇳 (@ram_views) June 29, 2026


