Pawan Kalyan:సినీ పరిశ్రమలో అడుగు పెట్టాలని, తమ ప్రతిభను నిరూపించుకోవాలని చాలామంది తహతహలాడుతూ ఉంటారు. అయితే అలాంటి వారికి సరైన ప్లాట్ఫారం లేక ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయని చాలామంది తెలియజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి వారి కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. తన సొంత నిర్మాణ సంస్థ అయిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ లో పనిచేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రియేటర్స్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ సినీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి సువర్ణ అవకాశం కల్పిస్తున్నామంటూ తెలియజేశారు.
టాలెంట్ ఉన్నవారికి బంపర్ ఆఫర్..
సినిమా పట్ల ప్యాషన్ ఉన్న వారందరినీ ఒకే తాటి పైన తీసుకువచ్చేందుకు #PKCWCOMMUNITY పేరిట ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలెంటెడ్ పీపుల్స్ కి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పునాది వంటిది అంటూ తెలియజేశారు. సినిమా రంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ తదుపరి తరం కోసం క్రియేటివ్ ఇన్నోవేషన్ కు సంబంధించి ప్రతిభావంతులను గుర్తించి మరీ వారికి ఒక గుర్తింపు ఇవ్వడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అంటూ తెలియజేశారు. సినీ పరిశ్రమలో ఉండే వ్యక్తిగ ఫిలిం మేకర్ గా, టెక్నీషియన్ గా మూడు దశాబ్దాలకు పైగా ప్రయాణం చేశారు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ గొప్ప నిర్ణయం..
అందులో భాగంగానే ఎంతోమంది కొత్త ప్రతిభను గుర్తించి మరీ వారి విజయాలకు కారణమయ్యారు పవన్ కళ్యాణ్. PKCW దృష్టిలో కథలు చెప్పడం అనేది కేవలం ఒక వ్యాపారం మాత్రమే కాదు అని విలువల పరిరక్షణకు సమాజాన్ని మేల్కోవడానికి ఉపయోగపడేటువంటి వారధిగా దీనిని సూచిస్తున్నారు అంటూ తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ బ్యానర్ వ్యవస్థాపకులైన పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ఒక అద్భుతమైన టాలెంట్ ఉంటుంది, వాటిని ఉపయోగించుకునేందుకు ఈ ఫ్లాట్ఫామ్ చాలా ఉపయోగపడుతుంది. అలాంటి వారందరి క్రియేటర్స్తో కలిసి పనిచేయడానికి తాను ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నానని తెలియజేశారు. అసాధారణమైన క్రియేటివిటీ కలిగి ఉండి అలాగే సరైన గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది ఒక ప్రోత్సాహం వంటిది అంటూ తెలియజేశారు.
పవన్ కళ్యాణ్ సినిమాలు..
పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే.. ఏడాది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరిచారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో హరిహర వీరమల్లు 2, ఓజి 2 సినిమాలు మాత్రమే ఉన్నాయి. అలాగే మరి కొంతమంది దర్శకులు కూడా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి మక్కువ చూపుతున్న పొలిటికల్ వైపే పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కు సంబంధించిన ఈ విషయం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
Join the #PKCWCommunity now.
Pawan Kalyan Creative Works invites passionate creators, technicians, artists,aspiring amateurs, professionals and researchers from every craft of cinema to join the global PKCW creative ecosystem.@PawanKalyanhttps://t.co/YWPlOwQ2zG
— Pawan Kalyan Creative Works (@PKCWoffl) July 1, 2026


