Wednesday, July 1, 2026
HomeLATESTSurekha konidela: మెగా ఫ్యామిలీకి గుడ్ న్యూస్.. కొణిదెల సురేఖకు అక్కడ చోటు!

Surekha konidela: మెగా ఫ్యామిలీకి గుడ్ న్యూస్.. కొణిదెల సురేఖకు అక్కడ చోటు!

Surekha konidela: మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెలకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతను అందించింది.

on
- Advertisement -banner Ad

Surekha konidela: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ కుటుంబం గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు. ఎంతోమంది హీరోలు ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తుండడమే కాకుండా రాజకీయంగా కూడా రాణిస్తున్నారు. అంతేకాకుండా సేవా కార్యక్రమాలలో కూడా మెగా కుటుంబం ముందు వరుసలో ఉంటుంది. ఇప్పుడు తాజాగా చిరంజీవి(Chiranjeevi) భార్య సురేఖ కొణిదెలకు తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధిలో భాగంగా కీలకమైన అడుగు వేసింది. ఇందులో బోర్డ్ మెంబర్గా మెగాస్టార్ చిరంజీవి భార్య కొణిదెల సురేఖకు సభ్యురాలుగా చోటు దక్కడం గమనార్హం.

సురేఖ కొణిదెలకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యత..

యాదగిరిగుట్ట ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అక్కడ ప్రభుత్వం అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అలా కొత్తగా ఏర్పాటు చేసిన ఈ పాలకమండలిలో మొత్తం 18 మంది సభ్యులను నియమించారు. ఇందులో బోర్డు చైర్మన్ గా ఎం సత్యనారాయణ రెడ్డి ని ప్రభుత్వం నియమించింది. అలాగే వివిధ రంగాలలో అనుభవం ఉన్న కొంతమంది ప్రముఖులను కూడా కమిటీలోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆలయ పరిపాలన అభివృద్ధి పనులు భక్తుల సౌకర్యాల పైన ప్రత్యేకించి దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

- Advertisement -

also read:Nirupam Paritala: కొత్త కారు కొన్న డాక్టర్ బాబు.. ధర ఎంతో తెలుసా?

అందుకే ఎంపిక..

అయితే చిరంజీవి భార్య కొణిదెల సురేఖకు( Surekha konidela) ఈ బోర్డులో సభ్యత్వం ఇవ్వడం వల్ల ఇప్పుడు రాజకీయంగా సినీవర్గాలలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. సామాజిక సేవా కార్యక్రమంలో ఎప్పుడు ముందు ఉండే మెగా కుటుంబం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా తరచూ పాల్గొంటూ ఉంటారు. ఇటువంటి సందర్భంలోనే కొణిదెల సురేఖను కూడా ఆలయ అభివృద్ధికి ఉపయోగపడతారనే అభిప్రాయంతోనే నియమించారు. ఈ విషయాన్ని మెగా అభిమానులు మాత్రం తెగ వైరల్ చేస్తున్నారు. అయితే ఇదే విషయంలో మరి కొంతమంది విమర్శలు చేస్తున్నారు.

- Advertisement -

also read:Varanasi: వారణాసి సినిమాలో మైండ్ బ్లోయింగ్ సీన్ అదే!

చిరంజీవి సినిమాలు..

చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. దాదాపుగా రూ .300 కోట్ల క్లబ్ లోకి చేరింది ఈ సినిమా. చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. తదుపరి సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ వశిష్ఠ తో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా విఎఫ్ఎక్స్ కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తోంది. అలాగే శ్రీకాంత్ ఓదెలతో ఒక ప్రాజెక్టుని చేయబోతున్నట్లుగా అఫీషియల్ గా ప్రకటించారు. అలాగే డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. మరి ఈ సినిమాలన్నీ కూడా వచ్చే ఏడాది విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you