Nani:టాలీవుడ్ లో నాచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నాని సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి సపోర్టు లేకుండా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకుంటున్నారు. నాని (Nani)తన కెరియర్లో ఎప్పుడూ కూడా విభిన్నమైన కథలతో అభిమానులను, ప్రేక్షకులను అలరిస్తుంటారు.అలా గత కొంతకాలంగా వరుస సక్సెస్ లతో బిజీగా ఉన్న నాని తాజాగా ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, వీడియోలు సైతం సినిమా పై అంచనాలను పెంచేశాయి.
గాయాలతో నాని..
ఇక అప్పుడప్పుడు నాని కూడా ఈ సినిమా గురించి తెలియజేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు మరోసారి నాని సోషల్ మీడియాలో జూలై నెలకు స్వాగతం పలుకుతూ కొన్ని ఫోటోలను షేర్ చేయడంతో అవి వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా నాని షేర్ చేసిన ఫోటోలలో కొత్తగా.. లాంగ్ హెయిర్ లుక్ కనిపించడమే కాకుండా తన ఎడమ చేతి మోచేతికి బ్యాండేజ్ కట్టుకొని కనిపించడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.. ఈ ఫోటోలకు నాని”ఘమాల్ హూ.. ఇస్లియే ఘాతక్ హూ” అంటూ దురద సినిమాలోని ఒక క్యాప్షన్ జత చేస్తూ ఈ ఫోటోలను షేర్ చేశారు. తన చేతికి గాయమైనప్పటికీ కూడా తాను ఉత్సాహంగానే ఉన్నానని యాక్షన్ సన్నివేశాలు చేయడం కోసం తను పూర్తిగా సిద్ధంగానే ఉన్నానంటూ ఈ పోస్టు ద్వారా అభిమానులకు తెలియజేసినట్లు కనిపిస్తోంది.
also read:Pawan Kalyan: వారికోసం పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్..!
పట్టు విడవని విక్రమార్కుడిలా..
నాని ది ప్యారడైజ్ సినిమా గత కొంతకాలంగా విడుదల తేదీ విషయంలో వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాని ఆగస్టు 21వ తేదీన గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకులను అలరించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు గాయంతో ఉన్నప్పటికీ షూటింగ్ కి సిద్ధమైన నాని తాజా పోస్టులను సోషల్ మీడియాలో షేర్ చేయగా నాని కొత్త లుక్ చూసి అభిమానులు కూడా తెగ వైరల్ గా చేస్తున్నారు. అంతేకాకుండా ప్యారడైజ్ సినిమా నుంచి మరికొన్ని అప్డేట్ ఇవ్వాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా కోసం నాని ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు మరి ఈ సినిమా నాని కెరియర్ కి ఎలాంటి టర్నింగ్ పాయింట్ అవుతుందో చూడాలి మరి.
also read:Surekha konidela: మెగా ఫ్యామిలీకి గుడ్ న్యూస్.. కొణిదెల సురేఖకు అక్కడ చోటు!
నాని చిత్రాలు..
ప్యారడైజ్ సినిమాలో కాయాదులోహర్ హీరోయిన్గా నటిస్తోంది, మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు, రాజు జూయల్ తదితర నటీనటులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. గత ఏడాది హిట్ 3 సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా, నాని యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పవచ్చు. అలాగే డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో బ్లడీ రోమియో అనే సినిమాలో కూడా నటిస్తున్నారు నాని. మరి ఈ సినిమాకి సంబంధించి నటీనటులను అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారో చూడాలి.
View this post on Instagram


