Tamannaah Bhatia: టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించింది హీరోయిన్ తమన్నా. నిరంతరం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ మధ్యకాలంలో తమన్నా(Tamannaah Bhatia) సినిమాలలో కంటే స్పెషల్ సాంగులతోనే మరింత క్రేజీ సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది తమన్నా. ఇప్పుడు తాజాగా తమన్నా షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలను ఆస్వాదిస్తూ తన ఇంటి బాల్కనీలో గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకుంది.
వర్షపు చినుకులలో తడిసి ముద్దవుతున్న తమన్నా..
తమన్నా ఈ వీడియోలో చిన్నపిల్లలా తడుస్తూ, ఆనందపడుతూ కనిపిస్తూ ఉన్న వీడియో వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్స్, అభిమానులు కూడా తెగ వైరల్ చేస్తున్నారు. చల్లని గాలికి వర్షపు చినుకులు పూర్తిగా తమన్నా తడుస్తూ గజ గజ వణుకుతున్న చాలా ఆనందంగా కనిపిస్తోంది. ముంబైలో కురుస్తున్న వర్షం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందంటూ ఈ వీడియో ద్వారా తమన్న తెలియజేసింది. వర్షంలో గడిపిన క్షణాలను సహజంగా కెమెరాలను బంధించి మరీ అభిమానులతో పంచుకోవడం మరింత హైలెట్ గా మారింది.
also read:Isakapatnam Movie Review:ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ.. స్టార్ క్యాస్ట్ మెప్పించిందా?
రైన్ క్వీన్ మిల్కీ బ్యూటీ..
ఇప్పటికే ఈ వీడియోకి 11 లక్షలకి పైగా వ్యూస్ సాధించింది. ఈ వీడియో కింద కామెంట్స్ అయితే రైన్ క్వీన్ మిల్కీ బ్యూటీ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక తమన్నా సినీ కెరియర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటుగా ఇతర భాషలలో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నది. సినిమాలలోనే కాకుండా ఓటీటీలో పలు ప్రాజెక్టులు చేస్తూ బిజీగా మారిపోయింది. తమన్నా ఈ మధ్యకాలంలో విభిన్నమైన పాత్రలలో నటించడమే కాకుండా తన కెరియర్ కు ఉపయోగపడేలా పాత్రలను ఎంచుకుంటోంది. తమన్నా తనకి విశ్రాంతి దొరికితే చాలు ట్రావెల్స్ చేస్తూ ఫిట్నెస్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది.
also read:Sukumar:రామ్ చరణ్ కోసం ఫ్లాప్ హీరోయిన్ ను ఎంపిక చేస్తున్న సుకుమార్!
తమన్నా వ్యక్తిగత జీవితం..
గడిచిన కొద్ది నెలల క్రితం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపించాయి. వీరిద్దరూ కలసి లస్ట్ స్టోరీస్2 అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు. ఈ వెబ్ సిరీస్ లో ఇంటిమేట్ సీన్స్ లో నటించారు ఈ జంట. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ఒకే కారులో తిరగడం షికారులు చేయడంతో వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారనే విధంగా వార్తలు వినిపించాయి. కానీ అనుకోని విధంగా తమన్నా , విజయ్ వర్మ బ్రేకప్ అయ్యారనే వార్తలు అభిమానులను అయోమయంలో పడేసింది. రెండేళ్లుగా డేటింగ్ చేసిన ఈ జంట విడిపోయారనే విషయాన్ని ఇప్పటికే అభిమానులు నమ్మలేకపోతున్నారు. బ్రేకప్ తర్వాత అటు తమన్నా తన సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా విజయ్ వర్మ కూడా సినిమాలతో బిజీగా ఉన్నారు.
View this post on Instagram


