Obsession:ఇటీవల కాలంలో ప్రపంచం మొత్తం ఎక్కువగా వినిపించిన సినిమా ఏదైనా ఉందంటే ఆ సినిమా అబ్సెషన్. ఈ చిత్రాన్ని కర్రీ బార్బర్ అనే ఒక యూట్యూబ్ దర్శకుడు తెరకెక్కించారు. కేవలం రూ .7కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించగా ఇప్పటివరకు రూ.3000 వేల కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ సినిమా ఓటిటి కోసం చాలామంది సినీ యూజర్స్ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ కోసమే అన్నట్టుగా ఓటీటి అధికారిక ప్రకటన వచ్చేసింది.
ఇండియన్ భాషల్లో స్ట్రీమింగ్ కి రాబోతున్న హాలీవుడ్ మూవీ..
గత నెలలో అమెరికాలో రిలీజ్ అయిన ఈ చిత్రం రెండు మూడు వారాల తర్వాత మన దేశంలోని థియేటర్లలో రిలీజ్ అయింది . భారతీయ ప్రేక్షకులను కూడా ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా ఆపిల్ టీవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఇంగ్లీష్ వెర్షన్ లో మాత్రమే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలోనే తెలుగు, తమిళ్, హిందీ వంటి డబ్బింగ్ భాషలలో కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
also read:Tamannaah Bhatia: వానలో తడుస్తూ మురిసిపోతున్న తమన్నా.. వీడియో వైరల్!
అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా..
ఆపిల్ ఓటీటీ తో పాటుగా ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో మైకేల్ జాన్స్టన్, ఇండే నవరెట్టే హీరో హీరోయిన్లుగా కనిపిస్తారు. ఇద్దరి మధ్య ఉండే అతి ప్రేమ అనేది ఇద్దరు ప్రేమికుల జీవితాలను ఎలా నాశనం చేస్తుంది అనే కాన్సెప్ట్ తో అబ్సెషన్(Obsession) చిత్రాన్ని తీశారు. కొంతమంది ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా కలెక్షన్స్ సునామీ మాత్రం సృష్టించింది.
also read:Isakapatnam Movie Review:ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ.. స్టార్ క్యాస్ట్ మెప్పించిందా?
అబ్సెషన్ స్టోరీ..
అబ్సెషన్ స్టోరీ విషయానికి వస్తే.. బేర్ (మైకేల్ జాన్స్టన్) కాలేజీలో చదువుతూ ఉంటారు. అలాగే ఒక మ్యూజిక్ షాపులో కూడా పనిచేస్తుంటారు. ఇతడికి ముగ్గురు ఫ్రెండ్స్ అందులో ఒకరైన నిక్కిని (ఇండే నవరెట్టే) ను ప్రేమిస్తుంటాడు. అయితే ఆమెకు ఆ విషయం చెప్పేందుకు చాలా భయపడుతుంటారు. అలా ఒకరోజు వన్ విష్ అనే పేరుతో ఒక చిన్న వస్తువుని కొని . దాన్ని విరగ్గొట్టి నిక్కి తనని చాలా ప్రేమించాలని బలమైన కోరికను కోరుతాడు. అయితే ఊహించని విధంగా ఆ కోరిక నిజమవుతుంది. ఆ సమయం నుంచి నిక్కి, బేర్ ను ప్రేమించడం మొదలు పెడుతుంది. అయితే అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా తారుమారవుతాయి? ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మిగతా స్టోరీ.


