Rao Bahadur:సమంత నటించిన “మా ఇంటి బంగారం” సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ రేంజ్ లో ఆకట్టుకునే సినిమా ఇక రాదు..రాబోదు అని అంతా అనుకున్నారు. కానీ, ఆ సినిమా విడుదలైన కొన్ని రోజులకే జనాలను ఆకట్టుకునే సినిమా వచ్చేసింది. టాలీవుడ్ లో విభిన్న కథలను ఎంచుకునే నటుడుగా గుర్తింపు పొందిన “సత్యదేవ్” ప్రధాన పాత్రలో.. దర్శకుడు “వెంకటేష్ మహా” తరకెక్కించిన అద్భుతమైన సినిమా “రావు బహదూర్”. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మానసిక సంఘర్షణలు, కుటుంబ బంధాలు, అనుమానం వంటి అంశాల చుట్టూ నడిచే ఈ చిత్రం ఫుల్ కమర్షియల్ ఫార్మేట్ కు భిన్నంగా సాగుతూ సినిమా చూసిన ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే ప్రయత్నం చేసింది. అసలు ఈ సినిమా కథ ఏంటి..? సత్యదేవ్ నటన ఎలా ఉంది..? సినిమాని ఎందుకు చూడాలి..? సినిమా జనాలని ఆకట్టుకుందా..? లేదా..? అనే పూర్తి విషయాలు ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!
స్టోరీ:
భువనం రాజవంశానికి చెందిన వారసుడు “రావు బహదూర్ రామప్ప” (సత్యదేవ్)(Satyadev) ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నప్పటికీ.. తన మనోధైర్యంతో జీవితం కొనసాగిస్తూ ఉంటాడు. అతనికి అండగా ఒక డాక్టర్ స్నేహితుడు నిలుస్తాడు. అయితే రామప్పను శారీరిక వ్యాధి కంటే కూడా ఎక్కువగా వేధించేది ఒకటి ఉంది. అదే ఆయన చిన్న కుమారుడు కుసుమప్ప. అతడి ప్రవర్తన కుటుంబంలో చోటు చేసుకున్న అనుమానాలు, దాచిన నిజాలు, వాటి వల్ల ఏర్పడిన మానసిక ఒత్తిళ్లు, దానివల్ల రామప్ప ఎలాంటి బాధలు అనుభవించారు..? చివరికి ఎలాంటి పరిణామాలకు దారితీసాయి..? అన్నదే ఈ సినిమా కథ.
విశ్లేషణ:
సినిమా కథ, కాన్సెప్ట్ అంతా ఇదివరకు చూసిన విధంగానే ఉంటుంది. సినిమా మొదటి భాగం నెమ్మదిగా సాగినప్పటికీ ఇంటర్వెల్ తర్వాత కథ పై ఆసక్తి పెరిగిపోతుంది. ఇక చివరిగా 40 నిమిషాలు గురించి అస్సలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. అసలు ఏం జరిగింది..? ఎందుకు అలా అయ్యింది..? అంటూ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు అనుకోక తప్పదు. మానవ సంబంధాలు ,అనుమానం, కులం, సామాజిక విలువలపై దర్శకుడు చెప్పిన భావాలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే కథానానికే ప్రాధాన్యం ఇవ్వడం ఈ సినిమాకి బిగ్ బిగ్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి.
ప్లస్ పాయింట్స్ :
*సత్యదేవ్ అద్భుతమైన నటన
*క్లైమాక్స్ భావోద్వేగ సన్నివేశాలు
*సంభాషణలు , సహజమైన కథనం
*నేపధ్య సంగీతం, సినిమాటోగ్రఫీ
* కొన్ని కొన్ని డైలాగులు ప్రేక్షకులను ఆలోచింపజేయడం
మైనస్ పాయింట్స్:
*ఫస్టాఫ్ నెమ్మదిగా సాగడం
*కొంతఎక్కువగా రన్ టైం ఉండడం
*మాస్ ప్రేక్షకులకు తక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం.
టెక్నికల్ లుక్ :
స్మరణ్ సాయి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను వేరే లెవెల్ కి తీసుకెళ్ళాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఒక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏ సినిమాలో చూడలేదు అని అనడంలో సందేహమే లేదు. ఈ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి బలం ఇచ్చింది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డిజైన్, కాస్ట్యూమ్స్, కథకు పర్ఫెక్ట్ గా సరిపోయాయి. కధకు ఇంకా బలం చేకూర్చాయి. అయితే ఎడిటింగ్ ఇంకొంచెం కచ్చితంగా ఉండి ఉంటే సినిమా ఇంకొంచెం బాగా ఉండేది అనే అభిప్రాయం ప్రతి ఒక్కరికి ఉంది.
also read:Akhil Akkineni:అక్కినేని అఖిల్ మూడేళ్లు గ్యాప్ కు కారణం సర్జరీనేనా?
పబ్లిక్ టాక్ :
విభిన్న కథలు, సైకలాజికల్ డ్రామాలు ఇష్టపడే ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి స్పందన లభిస్తుంది. కచ్చితంగా ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. సత్యదేవ్ నటన అయితే వేరే లెవెల్. ఇప్పటివరకు సత్యదేవ్ ఇలాంటి పర్ఫామెన్స్ ఇవ్వనేలేదు. క్లైమాక్స్ పై ప్రశంసలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా నెమ్మది అయిన కథనం గురించి మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
also read:Nababandham Movie Review: ‘నాగబంధం’ మూవీ రివ్యూ.. విజువల్ వండర్ గా ఆకట్టుకుందా?
పంచ్ లైన్ :
కమర్షియల్ హంగులకు దూరంగా మానసిక సంఘర్షణలను హృదయానికి హత్తుకునేలా చెప్పిన సత్యదేవ్ ‘రావు బహదూర్’ ఓపికగా చూస్తే మెప్పించే రియలిస్టిక్ సైకలాజికల్ డ్రామా ఇది.. ప్రతి ప్రేక్షకుడిని మెప్పిస్తుంది.


