Raksha Gowda:సాధారణంగా సీరియల్ స్టార్స్ అంటే హీరోయిన్స్ కన్నా కొంచెం తక్కువగా చూస్తారు. హీరోయిన్స్ అంతా అందంగా ఉండరు అని, హీరోయిన్స్ అంతా హావభావాలు పలికించలేరు అని, ఎమోషనల్ సీన్స్ లో పెద్దగా నటించలేరు అని ఒక భ్రమ అందరికీ ఉంటుంది. అయితే వాటిని అన్నిటిని తిప్పి కొట్టింది బెంగళూరు ముద్దుగుమ్మ “రక్షాగౌడ”. ఇలా చెప్తే జనాలు గుర్తుపట్టకపోవచ్చు. వసుధార అంటే మాత్రం అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు. అంతలా “గుప్పెడంత మనసు” సీరియల్ లో “వసుధార” అనే పాత్రలతో ఆమె అద్భుతమైన అభిమానాన్ని సంపాదించుకుంది. జనాలు ఆమెను ఒరిజినల్ పేరు పెట్టి పిలవడం కన్నా కూడా సీరియల్ తో పాపులర్ అయిన “వసుధార” పేరుతోనే పిలవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. పాన్ ఇండియా స్థాయిలో పేరు సంపాదించుకున్న హీరోయిన్స్ కి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ రక్ష గౌడ కు ఉంది అనడంలో సందేహమే లేదు. రక్షా గౌడ(Raksha Gowda) సీరియల్ లోకి ఎలా వచ్చింది? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? ఆమె మోడలింగ్ ఎలా స్టార్ట్ చేసింది? సోషల్ మీడియాలో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా సంపాదించుకోగలిగింది..? ఫ్యూచర్లో ఆమె ఏం చేయాలనుకుంటుంది…? అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!
బెంగళూరులో ప్రారంభమైన ప్రయాణం:
కన్నడ, తెలుగు బుల్లితెర ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసిన “రక్షా గౌడ” అభిమానులు ముద్దుగా పిలుచుకునే “వసుధార” 1996 సెప్టెంబర్ 7న కర్ణాటకలోని బెంగుళూరులో జన్మించింది. ఆమె “రక్షా” సంప్రదాయ కుటుంబంలో పెరిగింది. చిన్నప్పటినుంచి కలలపై ఆసక్తి పెంచుకున్న ఆమె బెంగుళూరులోనే తన విద్యను పూర్తి చేసింది. బిజినెస్ మేనేజ్మెంట్లో బీబీఏ పట్టా అందుకుని చదువులో కూడా టాప్ అనిపించింది. చదువుతోపాటు మోడలింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో అటువైపుగా అడుగులు వేసింది. మోడలింగ్ లో కూడా సూపర్ సక్సెస్ అయి నటనలోకి అడుగుపెట్టింది.
మోడలింగ్ నుంచి స్టార్ హీరోయిన్ వరకు:
రక్షా గౌడ మొదటగా మోడల్గా తన కెరీర్ను ప్రారంభించింది. ఆ తరువాత కన్నడ టెలివిజన్ లో “రాధా రమణ” అనే సీరియల్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో “కృష్ణవేణి” అనే సీరియల్ తో ప్రేక్షకులకు పరిచయమై అందరి మనసులను దోచేసింది. అయితే ఆమెకు బ్రేక్ ఇచ్చిన సీరియల్ మాత్రం “గుప్పెడంత మనసు” అనే చెప్పాలి. “గుప్పెడంత మనసు” సీరియల్ లో ఎంతో మంది యాక్టర్లు ఉన్న వసుధార పాత్రలో నటించిన రక్షా గౌడ కి క్రేజ్ మాత్రం వేరే లెవెల్ లో వచ్చింది. ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. సినీ స్టార్స్ కూడా ఫిదా అయ్యారు అంటే ఆమె నటన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సీరియల్ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి వసుధార నటన కూడా ప్రధాన కారణమని జనాలు అభిప్రాయపడుతున్నారు.
also read:Akhil Akkineni:అక్కినేని అఖిల్ మూడేళ్లు గ్యాప్ కు కారణం సర్జరీనేనా?
సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ :
బుల్లితెరలతో పాటు సోషల్ మీడియాలో కూడా రక్షా గౌడ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఇన్స్టా లో ఆమె షూటింగ్ విశేషాలు లేదా ఆమెకు సంబంధించిన ఏదైనా ఫోటోలు షేర్ చేస్తే వెంటనే భారీ వ్యూస్ , లైక్స్ వచ్చేస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా మోడరన్ లుక్స్ కు సంబంధించిన ఫోటోలు , వీడియోలను అభిమానులతో ఎక్కువగా పంచుకుంటూ ఉంటూ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది రక్షా గౌడ.
రెమ్యూనరేషన్ :
గుప్పెడంత మనసు సీరియల్ విజయం అనంతరం రక్షా గౌడ టెలివిజన్ (TV)లో మంచి పారితోషకం అందుకుంటున్న నటుల్లో టాప్ 3 లో నిలిచింది అంటూ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె ఒక్కరోజు కాల్ షిట్ కు సుమారు 25వేల నుంచి 30 వేల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. కన్నడ అమ్మాయి అయినా తక్కువ సమయంలోనే తెలుగు భాషను నేర్చుకుని ప్రేక్షకులకు మరింత చేరువ అవ్వడం ద్వారా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరిగిపోయింది.
త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ:
ప్రయాణాలు, ఫొటోగ్రఫీ, కొత్త ప్రదేశాల అన్వేషణ అంటే ఆమెకు చాలా చాలా ఇష్టం . భవిష్యత్తులో సినిమాల్లోనూ తనదైన ముద్రవేయాలని లక్ష్యంతో పలు కథలు వింటున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే రెండు మూడు సినిమాలలో హీరోయిన్గా చేసే ఛాన్స్ వచ్చినా కథ నచ్చక రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం బుల్లితెరపై తన నటనతో ఆకట్టుకుంటూనే వెండితెర అవకాశాల కోసం కూడా రక్షా గౌడ ఎదురుచూస్తున్నట్లు టాక్. తన అందంతో అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన రక్షా గౌడ త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చూద్దాం మరి ఆ మంచి అవకాశం ఎప్పుడు వస్తుందో..? రక్షా గౌడ మన ముందుకు హీరోయిన్ గా ఎప్పుడు దర్శనమిస్తుందో చూడాలి.


