Sunday, July 5, 2026
HomeLATESTSamantha:అరుదైన మైలురాయికి చేరువలో సమంత!

Samantha:అరుదైన మైలురాయికి చేరువలో సమంత!

Samantha: ప్రముఖ హీరోయిన్ సమంత తాజాగా నటించిన మా ఇంటి బంగారం సినిమా ఒక అరుదైన మైలురాయని చేరుకోబోతోంది.

on
- Advertisement -banner Ad

Samantha:టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించిన సమంత(Samantha:) తాజాగా నటించిన చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించగా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా జూన్ 19న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, మహిళలు ఈ సినిమాని తెగ చూసేస్తున్నారు. ఓవర్సీస్ లో కూడా మా ఇంటి బంగారం సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్ రాబడుతున్నట్లు వినిపిస్తోంది. ఇప్పటికే అక్కడ టూ మిలియన్ డాలర్లు మార్కును క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. ఇటువంటి తరుణంలోనే ఇప్పుడు తాజాగా అరుదైన మైలురాయికి దగ్గరగా మా ఇంటి బంగారం సినిమా ఉన్నట్లుగా తెలుస్తోంది.

రికార్డ్ సృష్టించిన సమంత..

అసలు విషయంలోకి వెళ్తే.. ఇప్పటివరకు మా ఇంటి బంగారం సినిమా ప్రపంచవ్యాప్తంగా 92 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా వీకెండ్ కావడంతో టికెట్ ధరలను కూడా కాస్త తగ్గించడంతో సినిమా ప్రేక్షకులు ఆదరణ పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో ఈ వీకెండ్ ముగిసే సరికి 100 కోట్ల క్రాస్ కలెక్షన్స్ క్లబ్ లోకి మా ఇంటి బంగారం సినిమా చేరే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే తెలుగులో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మహిళా ప్రధాన పాత్ర సినిమా ఇదే నిలిచే అవకాశం ఉంటుంది.

- Advertisement -

also read:OTT: ఓటీటీలోకి వడ్డే నవీన్ ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఆ గుర్తింపు సమంతాకే!

అలా ఇప్పటికే మహిళ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రాలలో మహానటి సినిమా రూ .85 కోట్లతో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు కీర్తి సురేష్(keerthy suresh) సినిమా రికార్డును కూడా సమంత దాటేసింది, అలాగే అనుష్క శెట్టి(Anushka Shetty) నటించిన అరుంధతి సినిమా రూ .70 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా ఆ రికార్డును కూడా దాటేసింది. ఏది ఏమైనప్పటికీ సమంత టాలీవుడ్ హిస్టరీ లోనే ఫస్ట్ మహిళా ప్రధాన పాత్ర చిత్రంతో నెంబర్ వన్ స్థానంలో నిలిచిపోతుంది.

- Advertisement -

also read:Tollywood:లాస్ట్ మినిట్ లో ‘శ్రీనివాస మంగాపురం’ టీం మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్!

లాభాల దిశగా మా ఇంటి బంగారం..

మా ఇంటి బంగారం సినిమా థియేట్రికల్ రన్ టైం ముగిసే లోపు సుమారుగా 30 కోట్ల వరకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మా ఇంటి బంగారం సినిమాలో తన కుటుంబాన్ని కాపాడుకునే కోడలి పాత్రలో సమంత అద్భుతంగా నటించింది. ఆమె చేసిన యాక్షన్ సీన్స్ కూడా అందరిని ఆకట్టుకున్నాయి. ఇందులో గుల్షన్ దేవయ్య, శ్రీముఖి తదితరులు కీలకమైన పాత్రలలో నటించారు. సమంత మా ఇంటి బంగారం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాను తల్లి కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాను ఒక ఏడాది కాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నట్లుగా కూడా ప్రకటించింది. ఈ ఏడాది చివరిలో సమంత తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు సమాచారం.

- Advertisement -

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you