Wednesday, July 22, 2026
HomeMOVIE NEWSTollywood : లాస్ట్ మినిట్ లో 'శ్రీనివాస మంగాపురం' టీం మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్!

Tollywood : లాస్ట్ మినిట్ లో ‘శ్రీనివాస మంగాపురం’ టీం మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్!

Tollywood:జయకృష్ణ ఘట్టమనేని నటించిన శ్రీనివాస మంగాపురం సినిమా విడుదల వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన తేదీకి బదులుగా ఈ చిత్రం ఇప్పుడు జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

on
- Advertisement -banner Ad

Tollywood:దివంగత సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి హీరోగా పరిచయమవుతున్న జయకృష్ణ ఘట్టమనేని(Jayakrishna Ghattamaneni) నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈ సినిమా విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసింది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తుండటంతో సినిమా పై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఆయన గత చిత్రాల కారణంగా ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది. టీజర్, పోస్టర్లు సినిమాపై మంచి అంచనాలను పెంచేశారు. నిజానికి ఈ సినిమా జూలై 9న థియేటర్లలోకి రావాల్సి ఉంది.

అధికారికంగా విడుదల వాయిదా:

అయితే తాజాగా చిత్రబృందం ఈ సినిమా విడుదల తేదీలో మార్పు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ, ‘శ్రీనివాస మంగాపురం’ ఇప్పుడు జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించింది.

- Advertisement -
Advertisement

also read:Trisha:ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. స్టార్ హీరోయిన్ త్రిష లైఫ్ లో న్యూ చాప్టర్ బిగిన్?

క్లాష్‌ను నివారించేందుకే నిర్ణయమా? :

సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం..ఈ సినిమా రిలీజ్ చేయాలి అనుకున్న అదే సమయంలో విడుదల కానున్న అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ చిత్రంతో బాక్సాఫీస్ పోటీని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు సినిమాలు ఒకే తేదీన విడుదలైతే కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో, మేకర్స్ వ్యూహాత్మకంగా విడుదల తేదీని మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది జరుగుతుందని అంతా ముందే ఊహించారు. కానీ చిత్ర బృందం ఎటువంటి హింట్ ఇవ్వకపోవడంతో..అనుకున్న టైంకి ఖచ్చితంగా మూవీ రిలీజ్ చేస్తారు అని సూపర్ స్టార్ ఫ్యామిలీ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఎవ్వరు ఊహించని విధంగా లాస్ట్ మినిట్ లో సినిమా విడుదల వాయిదా వేసుకుంది చిత్ర బృందం.

- Advertisement -
Advertisement

also read:Maa Inti Bangaram: ‘మా ఇంటి బంగారం’ డిలీటెడ్ సీన్స్ వచ్చేశాయి.. థియేటర్‌లో ఉంటే ఇంకో లెవల్ అయ్యేది..!

సినిమాకి అదే బలం:

ఈ చిత్రంలో సీనియర్ నటుడు మోహన్ బాబు(Mohan babu) కీలక పాత్రలో కనిపించనుండటం విశేషం. అలాగే ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. ఈ కొత్త జంట ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది.

- Advertisement -
Advertisement

అశ్వినీ దత్ సమర్పణ.. జి.వి. ప్రకాష్ సంగీతం:

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ సమర్పిస్తున్నారు. సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తుండగా, సినిమా పాటలు మరియు నేపథ్య సంగీతంపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. కొత్త విడుదల తేదీతో ‘శ్రీనివాస మంగాపురం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో ఆసక్తిగా మారింది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you