Sunday, July 5, 2026
HomeLATESTTrisha Krishnan: "ఇది మూడోసారి.. ఇక మారరా మీరు?"..త్రిష ఫుల్ సీరియస్..!

Trisha Krishnan: “ఇది మూడోసారి.. ఇక మారరా మీరు?”..త్రిష ఫుల్ సీరియస్..!

Trisha Krishnan: హీరోయిన్ త్రిష కృష్ణన్ ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ జారా డెలివరీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దుర్వాసన వస్తున్న దుస్తులు అందాయని సోషల్ మీడియాలో

on
- Advertisement -banner Ad

Trisha Krishnan: హీరోయిన్ త్రిష పేరు ఇప్పుడు సినిమాల్లలో.. అదేవిధంగా రాజకీయాల్లలో ఎలా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా తమిళనాడు సీఎంగా విజయ్ దళపతి(Vijay) ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తమిళ పాలిటిక్స్ లో త్రిష(Trisha Krishnan) పేరు తీవ్ర చర్చనీయాంసమైంది. ఇలాంటి మూమెంట్లోనే హీరోయిన్ త్రిష చేసిన పోస్ట్ మరోసారి ఆమె పేరు మారు మ్రోగిపోయేలా చేసింది. స్టార్ హీరోయిన్ త్రిష ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ “జారా” సేవలపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తరచు ఆన్లైన్ షాపింగ్ చేసే త్రిష ఇటీవల “జారా” వెబ్సైట్ ద్వారా ఒక డ్రెస్ ను ఆర్డర్ చేసింది. అయితే డెలివరీ అందుకున్న తర్వాత ప్యాకెట్ ను తెరిచి చూడగా ఆ దుస్తుల నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైనట్లు వెల్లడించింది.

మూడోసారి కూడా అదే అనుభవం:

ఈ సమస్య ఒక్కసారి మాత్రమే కాదని ఇప్పటికే మూడుసార్లు ఇలాంటి అనుభవమే ఎదురైందని త్రిష తన సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొంది. ప్రతిసారి దుస్తుల నుంచి అసహ్యకరమైన వాసన రావడం వల్ల ఆ బ్రాండ్ నాణ్యత పై ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆమె అభిప్రాయపడింది. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ నుంచి ఇలాంటి సేవలు రావడం ఆశ్చర్యకరమని ఆమె వ్యాఖ్యానించింది.

- Advertisement -

also read:Ott :డ్యాన్స్‌లో దాగిన దెయ్యాల రహస్యం.. ఓటీటీలోకి వచ్చిన సూపర్‌నేచురల్ హారర్ మూవీ!

జారా బ్రాండ్ కు త్రిష సూచనలు:

జారాను ట్యాగ్ చేస్తూ త్రిష చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. “హోమ్ డెలివరీ పంపే దుస్తులను ప్యాక్ చేసే ముందు వాటి నాణ్యత, పరిశుభ్రతను తప్పనిసరిగా పరిశీలించండి.. కస్టమర్లకు ఇలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోండి” అంటూ పోస్టులో రాసుకొచ్చింది.

- Advertisement -

also read:Nani:నాని నెక్స్ట్ మూవీ లాక్.. సెన్సేషనల్ డైరెక్టర్‌తో బిగ్గెస్ట్ బ్లాస్టింగ్ కాంబో!?

సోషల్ మీడియాలో వైరల్:

త్రిష చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆమె అభిమానులుతో పాటు పలువురు నెటిజన్లు కూడా తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు. మరోవైపు అంతర్జాతీయ స్థాయి బ్రాండ్ అయిన జారా ఈ ఫిర్యాదు పై ఎలా స్పందిస్తుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. కస్టమర్ల సంతృప్తికి ప్రాధాన్యం ఇచ్చే సంస్థగా గుర్తింపు పొందిన జారా నుంచి అధికారిక స్పందన కోసం నెటిజెన్లు ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you