TV:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది కమెడియన్లు వచ్చారు, వెళ్లిపోయారు. కానీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, ఇండస్ట్రీలో లేనప్పుడు, కూడా ఒక కమెడియన్ పేరును మాత్రం జనాలు ఎక్కువగా తలుచుకుంటూ ఉంటారు. ఆయన మరెవరో కాదు.. తన కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులను విపరీతంగా నవ్వించిన గుండు హనుమంతరావు(GUNDU HANUMANTHA RAO). కొంతమంది స్క్రీన్‌పై కనిపించి కామెడీ చేస్తేనే నవ్వొస్తుంది. కానీ గుండు హనుమంతరావు అలా కాదు. స్క్రీన్‌పై కనిపిస్తేనే తన బాడీ లాంగ్వేజ్‌తో జనాలను పకపకా నవ్వించేవారు.టీవీ (TV) సీరియల్ ఆయన అమృతం సీరియల్ ద్వారా మరింత క్రేజ్ పెంచుకున్నారు. ఈ సీరియల్ కొన్ని ఎపిసోడ్స్ మొత్తం ఈయన కామెడీ తోనే నడిచేది. ఎలాంటి సన్నివేశమైనా సరే హెల్తీ కామెడీగా మార్చి అందరినీ కడుపుబ్బా నవ్వించడం ఆయన స్పెషాలిటీ. ఈ పేరు వినగానే అందరికీ “అమృతం” సీరియల్ గుర్తొస్తుంది. అనేక చిత్రాల్లో బ్రహ్మానందంతో కలిసి నటించి అద్భుతమైన కామెడీ పండించారు. ఆయన టైమింగ్, ఆయన రైమింగ్, ఆయన మంచితనం అందరికీ ఎంతో ఇష్టం. మరి ముఖ్యంగా ఆహా నా పెళ్లంట చిత్రంలో చెవిటి వ్యక్తిగా ఆయన చేసిన నటన అద్భుతం. తెలుగు ఇండస్ట్రీలో అలాంటి పర్ఫార్మెన్స్ చేసే కమెడియన్ మరెవ్వరూ లేరని చెప్పడంలో సందేహం లేదు.
వ్యక్తిగత జీవితంలో వరుస విషాదాలు:
వందలాది చిత్రాల్లో నటించి కోట్లాది మందిని నవ్వించిన హాస్యనటుడు గుండు హనుమంతరావు వ్యక్తిగత జీవితం మాత్రం చాలా విషాదభరితంగా సాగింది. ఆయన ఆఖరి రోజుల్లో పడిన బాధ వర్ణనాతీతం. చాలా కష్టాలతో ఆయన జీవితం గడిచింది. దాదాపు 600కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన ఆయన జీవితంలో 2008 నుంచి వరుస కష్టాలు మొదలయ్యాయి. 2008లో ఆయన కూతురు మెదడువాపు వ్యాధితో చిన్న వయసులోనే మరణించింది. ఆ బాధ నుంచి కోలుకోవడానికి ఆయనకు చాలా సమయం పట్టింది. ఆ బాధ నుంచి బయటపడుతున్న సమయంలోనే 2010లో భార్య ఝాన్సీ రాణి కూడా కన్నుమూశారు. దీంతో ఆయన మరింత డిప్రెషన్‌కు గురయ్యారు. ఒంటరివాడినైపోయాననే భావన ఆయనను వెంటాడింది.
ALSO READ:OTT: కర్మకాలి మీ ఫోన్‌లోనూ ఇలా జరిగితే..? ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తున్న సస్పెన్స్ సిరీస్..!
కొడుకు కోసం చేసిన త్యాగం:
ఇక మిగిలింది కొడుకు. అతని భవిష్యత్తు పాడవకూడదనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి అమెరికాకు పంపించి ఎంఎస్ చదివించారు. చివరి దశలో హనుమంతరావుకు గుండెజబ్బు రావడంతో పాటు రెండు కిడ్నీలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో ఆయనకు డయాలసిస్ చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ డయాలసిస్ చేయించుకోవడానికి కూడా ఆయన వద్ద డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో అమెరికాలో చదువుకుంటున్న కొడుకు ఉద్యోగంలో చేరబోతున్న సమయంలోనే తండ్రిని చూసుకోవడానికి ఇండియాకు వచ్చేశాడు. అమెరికా జీవితాన్ని వదిలేసి, తల్లి, చెల్లెలు లేని ఆ ఇంట్లో తండ్రికి అన్ని విధాలా సేవ చేశాడు. దగ్గరుండి తండ్రి బాగోగులు చూసుకున్నాడు.
ALSO READ:Allu Arjun-Lokesh Movie: పుష్పరాజ్‌ను మించే అవతార్‌లో బన్నీ.. లుక్ టెస్ట్‌పై క్రేజీ అప్డేట్..!
చిరంజీవి సాయం.. అయినా తప్పని విషాదం:
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi )కూడా ఆయనకు ఆర్థిక సహాయం చేశారు. కానీ బైపాస్ సర్జరీ, కిడ్నీ సమస్యలతో శరీరం పూర్తిగా సహకరించకపోవడంతో 2014లో గుండు హనుమంతరావు కన్నుమూశారు. గుండు హనుమంతరావు మరణం తర్వాత కుటుంబంలో కొడుకు ఒక్కడే మిగిలాడు. ఆయనకు ఎవ్వరూ లేరని బాధపడిన ప్రముఖ నటుడు బ్రహ్మానందం ఎంతో గొప్ప మనసు చాటుకున్నారు. “నీకు ఎవ్వరూ లేరని అనుకోకు. నీకు నేనున్నాను. నువ్వు నా అబ్బాయి. నేను నిన్ను దత్తత తీసుకుంటున్నాను. మీకు ఏ అవసరం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే నన్ను అడుగు. నీకు అండగా నేనుంటాను. తండ్రిగా చూసుకుంటాను” అని అందరి ముందే ప్రకటించారు. తోటి నటుడి కుటుంబానికి బ్రహ్మానందం(BRAHMANANDAM) అండగా నిలిచిన తీరు తెలుగు సినీ పరిశ్రమలో ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఆయన చేసిన ఈ మానవత్వాన్ని ఎంతోమంది ప్రశంసించారు.


