Allu Arjun:గత 24 గంటలుగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడనే వార్త భారీగా వైరల్ అవుతోంది. ఈ ప్రచారం ఎక్కడి నుంచి మొదలైందో స్పష్టత లేకపోయినా, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ కారణంగా ఆయనకు సంబంధించిన ప్రతి వార్త వేగంగా ట్రెండ్ అవుతోంది.
రూమర్ ఎలా మొదలైంది?:
సోషల్ మీడియాలో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నాడని, కొత్త పార్టీ పెట్టేందుకు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను కలిశాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ వార్తలకు ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. అల్లు అర్జున్(Allu Arjun), ఆయన తండ్రి అల్లు అరవింద్ (Allu ARAVIND)లేదా కుటుంబ సభ్యులెవరూ దీనిపై స్పందించలేదు.
అసలు నిజం ఇదే:
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్‌కు రాజకీయాలపై ఆసక్తి లేదని తెలుస్తోంది. ఆయన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉంది. కుటుంబంతో సమయం గడపడం, కమిట్ అయిన చిత్రాలను పూర్తి చేసి అభిమానులను అలరించడంపైనే ఆయన ఫోకస్ ఉన్నట్లు సమాచారం.
ఎందుకు వస్తున్నాయి ఈ ప్రచారాలు?:
గతంలో తన స్నేహితుడైన ఒక రాజకీయ నేతకు ఎన్నికల ప్రచారం చేయడంతో అల్లు అర్జున్ విమర్శలు ఎదుర్కొన్నారు. అలాగే ఆయన కుటుంబంలో రాజకీయ నేపథ్యం ఉండటం కూడా ఈ ప్రచారాలకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో కొందరు కావాలనే రాజకీయ రంగు పులుముతూ కొత్త రూమర్లు సృష్టిస్తున్నారని అంటున్నారు.
పార్టీ పెట్టే ఆలోచన ఉందా?:
ఇప్పటివరకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో అల్లు అర్జున్ రాజకీయాలపై ఎప్పుడూ ఆసక్తి వ్యక్తం చేయలేదు. అలాగే పుష్ప విడుదల సమయంలో జరిగిన ఘటనలు, ఆ తర్వాత వచ్చిన వివాదాలను కూడా ఈ రూమర్లతో ముడిపెడుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్‌తో భేటీ అయినట్లు ఒక్క ఫోటో, పోస్టు లేదా అధికారిక సమాచారం కూడా లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండగా, త్వరలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోని కొత్త ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టనున్నాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి అధికారిక నిజం లేదు.




