TV:తెలుగు బుల్లితెరపై నటిగా.. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో వందన గొల్లు కూడా ఒకరు. హైదరాబాద్‌లో జన్మించిన ఆమె సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. వందన తన ప్రతిభా కష్టంతోనే టెలివిజన్ రంగంలో అవకాశాలు దక్కించుకుంది. కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే ఆమె వ్యక్తిగత జీవితం , వృత్తి జీవితాన్ని సమతుల్యంగా కొనసాగిస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చంద్రశేఖరన్ ని వివాహం చేసుకున్న వందనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సీరియల్స్ తో ప్రారంభమైన కెరియర్ :
యాక్టింగ్ పై ఉన్న ఆసక్తితో వందన బుల్లితెరలో అడుగుపెట్టింది. బీఫార్మసీ పూర్తి చేసిన తర్వాత నటన కెరియర్‌గా ఎంచుకుంది. “స్వాతి చినుకులు”, “అభిషేకం” వంటి ప్రముఖ తెలుగు సీరియల్స్ లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. సహాయ పాత్రలతో పాటు కుటుంబ కథ నేపధ్యంలోని పాత్రల్లో సహజ నటనతో గుర్తింపు పొందింది. సాంప్రదాయ పాత్రల నుంచి ఆధునిక పాత్రల వరకు విభిన్నమైన నటనను ప్రదర్శిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
ALSO READ:Pavala shyamala: నటి పావలా శ్యామల కన్నుమూత!
సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ :
టెలివిజన్ (TV) తో పాటు సోషల్ మీడియాలో కూడా వందనకు మంచి ఆదరణ ఉంది. ఇంస్టాగ్రామ్ లో లక్షకు పైగా ఫాలోవర్లతో యాక్టివ్ గా ఉంటూ రీల్స్, ఫోటోషూట్ లు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అప్డేట్స్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా సీరియల్ షూటింగ్ వెనుక జరిగే విశేషాలు, ట్రావెల్ వ్లాగ్స్, ఫ్యాషన్, కుకింగ్, లైఫ్ స్టైల్ వీడియోలను అందిస్తూ డిజిటల్ ప్రేక్షకులను మరింతగా చేరువైంది.
ALSO READ:OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. రెండు రోజుల్లోనే టాప్ ట్రెండింగ్..!
ఆదాయం-ఆసక్తికర విషయాలు:
టెలివిజన్ రంగంలో నటీనటుల పారితోషకం వారి అనుభవం, పాత్ర ఆధారంగా ఇస్తుంటారు. వందన సీరియల్స్ తో పాటు సోషల్ మీడియా ప్రమోషన్లు, యూట్యూబ్ కంటెంట్ ద్వారా కూడా మంచి ఆదాయం పొందుతున్నట్లు తెలుస్తుంది . ప్రజాదరణ పెరిగిన సాధారణంగా అందరితో కలిసి మెలిసి ఉండడాన్ని ఆమె ఇష్టపడుతుంది . ఒక వైపు సీరియల్ షూటింగ్ లతో బిజీగా ఉంటూనే మరోవైపు డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గా తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ అభిమానులను అలరిస్తోంది.




