Wednesday, July 29, 2026
HomeLATESTRamayana:విడుదలకు ముందే పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న రామాయణ!

Ramayana:విడుదలకు ముందే పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న రామాయణ!

Ramayana: బ్రహ్మ ముహూర్తంలో రామాయణ ట్రైలర్ను రిలీజ్ చేయడంతో పాటు ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం.

on
- Advertisement -banner Ad

Ramayana:భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న చిత్రం రామాయణం. నితీష్ తివారీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో, సాయి పల్లవి సీతాదేవి పాత్రలో, యశ్ రావణుడిగా నటిస్తూ ఉన్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలకు ముందే మరో సంచలన వార్తలతో నిలుస్తోంది. ఈ సినిమా మ్యూజికల్ హక్కుల కోసం టి సిరీస్ ఏకంగా రూ .75 కోట్ల రూపాయల భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

భారీ ధరకు అమ్ముడుపోయిన రామాయణ మ్యూజిక్ రైట్స్..

ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. టీ సిరీస్ ఈ సినిమా మ్యూజిక్ కోసం రెండు భాగాలకు సంబంధించి హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి అడ్వాన్స్ రూపంలో కొంతమేరకు చెల్లించినట్లుగా సమాచారం. దీంతో ఇండియన్ హిస్టరీ లోను ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద మ్యూజిక్ డీల్ ఇదే అన్నట్లుగా వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే కనుక రికార్డ్స్ బద్దలయ్యే అవకాశం ఉన్నది.. పుష్ప 2 సినిమా మ్యూజిక్ రైట్స్ 65 కోట్లకు అమ్ముడుపోయాయని, ఇప్పుడు రామాయణం సినిమా ఆ రికార్డు అధికమించినట్టే అవుతుందంటూ వినిపిస్తోంది.

- Advertisement -
Advertisement

also read:Keerthy Suresh:ఆ పాన్ ఇండియా సినిమాలో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్?

రంగంలోకి బడా సంస్థ..

సినిమాకు విడుదలకు ముందే ఇలాంటి భారీ వ్యాపారం జరగడం అనేది ఆ ప్రాజెక్టు పైన ఉన్న మార్కెట్ ని మరింత పెంచుతుందని చెప్పవచ్చు. ప్రముఖ మ్యూజిక్ దర్శకులుగా పేరు సంపాదించిన ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతాన్ని అందిస్తున్నారు. భారతీయ ఆధ్యాత్మిక భావాలను ప్రతిబింబించే సంగీతాన్ని రామాయణం సినిమాకి అందించబోతున్నారు. అందువల్లే ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ కోసం భారీ స్థాయిలో పోటీ పడినట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement

also read:fauzi:ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఫౌజీ సినిమా పై బిగ్ అప్డేట్!

బ్రహ్మ ముహూర్తంలో రామాయణ ట్రైలర్..

రామాయణం(Ramayana) సినిమా ట్రైలర్ ని జూలై 30వ తేదీన బ్రహ్మ ముహూర్తమైన తెల్లవారుజామున ఉదయం 4:15 నిమిషాలకు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా చిత్ర బృందం ప్రకటించారు. ఈ పవిత్రమైన సమయాన్ని ఎంచుకోవడం వల్ల సినిమాకి ఉన్న ఆధ్యాత్మిక భావాలను ప్రేక్షకులను మరింత బలంగా చేరుకోవాలని ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా సుమారుగా రూ .4000 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లు వినిపిస్తోంది. ఆధ్యాత్మిక విజువల్ ఎఫెక్ట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా ట్రైలర్ కోసం చాలామంది అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you