Keerthy Suresh:నాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న బిగ్ పాన్ ఇండియా సినిమా “ది ప్యారడైజ్”. ఈ సినిమాపై అభిమానుల్లో ఎన్ని అంచనాలు ఉన్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో వీరిద్దరి కలయికల వచ్చిన “దసరా” సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అందుకోవడంతో ఈ సినిమాపై ఇంకా ఆసక్తి పెరిగిపోయింది. కొత్త కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
also read:Anupama parameswaran: ఎరుపు రంగు చీరలో మెస్మరైజ్ చేస్తున్న అనుపమ!
మాస్ స్పెషల్ సాంగ్ కోసం కీర్తి సురేష్ :
తాజా సమాచారం ప్రకారం “ది ప్యారడైజ్”లో ఉండే ఓ హై వోల్టేజ్ మాస్ స్పెషల్ సాంగ్ కోసం నటి కీర్తి సురేష్ (Keerthy Suresh)ని ఎంపిక చేయాలి అనే చిత్రబృందం ఆలోచిస్తున్నట్లు సినీ వర్గాలల్లో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తపై ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే మాత్రం ఈ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందనే చెప్పాలి. నాని – కీర్తి సురేష్ జోడి మరోసారి తెరపై సందడి చేయనుంది అంటూ టాక్ మొదలైంది . గతంలో నేను లోకల్ సినిమాలో కలిసి నటించిన ఈ జంట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన “దసరా” సినిమాలో వీళ్ళ కెమిస్ట్రీ అద్భుతంగా ఉండింది.
also read:fauzi:ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఫౌజీ సినిమా పై బిగ్ అప్డేట్!
అనిరుధ్ సంగీతం మరో ప్రత్యేక ఆకర్షణ
“ది ప్యారడైజ్” చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందిస్తున్నారు. ఆయన మాస్ బీట్స్ కి ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్ లో కనిపిస్తే అనిరుద్ సంగీతం ఆమె డాన్స్ కలియక సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కీర్తి సురేష్ తెలుగు ప్రేక్షకులకు “నేను శైలజ” సినిమా ద్వారా పరిచయమయ్యారు. ఇక తర్వాత “మహానటి” సినిమాతో ఆమె రేంజ్ మారిపోయింది. ఈ సినిమాలో నటించినందుకుగాను ఉత్తమ జాతియ అవార్డు కూడా అందుకున్నారు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి సినిమాలు నటించి ఆమె క్రేజ్ అమాంతం పెంచేసుకున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ పలు క్రేజీ ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. అయినా సరే నాని అంటే ఉండే ఫ్రెండ్షిప్ తో “ది ప్యారడైజ్” సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ లో కనిపించడానికి ఓకే అన్నారట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది..!!




