Hyper Aadi:తెలుగు బుల్లితెరపై ఎంతో పాపులర్ అయిన కామెడీ షోలలో జబర్దస్త్ కూడా ఒకటి. ఈ షో ప్రారంభ దశలో జడ్జిగా వ్యవహరించిన నాగబాబు తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు. కమెడియన్లను ప్రోత్సహించడం, వారి స్కిట్లలో మంచి పాయింట్లు సూచించడం ద్వారా షో విజయవంతం కావడంలో ఆయన పాత్ర కీలకంగా నిలిచింది.
మళ్లీ జబర్దస్త్‌లోకి నాగబాబు:
కొన్ని కారణాలతో గతంలో జబర్దస్త్‌కు దూరమైన నాగబాబు ఇటీవల మళ్లీ ఈ షోలో భాగమయ్యారు. ఆయన రాకతో షోలో కొత్త ఉత్సాహం వచ్చిందని అభిమానులు భావిస్తున్నారు. స్కిట్ల ఎంపిక, కాన్సెప్ట్లపై సూచనలు ఇవ్వడంతో పాటు టీం లీడర్లకు సలహాలు కూడా ఇస్తున్నారని సమాచారం. కేవలం సలహాలతోనే కాకుండా కమెడియన్లను ప్రోత్సహించేందుకు నాగబాబు ప్రత్యేకంగా రివార్డులు కూడా ఇస్తున్నారట. బెస్ట్ స్కిట్, బెస్ట్ పెర్ఫార్మర్ విభాగాల్లో తన సొంత డబ్బులతో ప్రోత్సాహకాలు అందిస్తున్నారని సమాచారం.
also read:Ramayana:విడుదలకు ముందే పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న రామాయణ!
నాగబాబుపై హైపర్ ఆది ప్రశంసలు:
జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హైపర్ ఆది ప్రస్తుతం సినిమాలు, ఇతర టీవీ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఒక ప్రత్యేక ఎపిసోడ్‌లో పాల్గొన్న ఆయన నాగబాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొంటూ కూడా జబర్దస్త్ కోసం సమయం కేటాయిస్తున్నారని ఆది పేర్కొన్నారు. టీం సభ్యులకు సూచనలు ఇవ్వడం, స్కిట్లకు లైన్లు అందించడం వంటి పనులు చేసినా కొన్నిసార్లు ఆశించిన ఫలితం రాకపోవడం బాధాకరమని తనదైన స్టైల్‌లో కామెడీ డైలాగ్స్ వదిలారు.
also read:Keerthy Suresh:ఆ పాన్ ఇండియా సినిమాలో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్?
నాగబాబుకు ఆది సరదా సలహా:
జబర్దస్త్‌లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వారికి నగదు బహుమతులు ఇస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ హైపర్ ఆది(Hyper Aadi) సరదాగా స్పందించారు. స్కిట్లకు ప్రోత్సాహం ఇవ్వడం మంచిదే కానీ, ఈ క్రమంలో నాగబాబు ఎక్కువగా ఖర్చు పెట్టి ఇబ్బంది పడకూడదని కామెడీగా వ్యాఖ్యానించారు.
“ఇక్కడ బెస్ట్ పంచ్ వేస్తే ₹1000, పర్ఫార్మర్ ఆఫ్ ది డేకు ₹5000, ఎక్కువ స్కిట్లు కొడితే ₹50,000, ఇంకా ఎక్కువ కొడితే లక్ష అని ఆఫర్లు పెట్టారంటగా. ఆయన డబ్బులు తీసుకుని నవ్వుకునే వెళ్లే మీరు, డబ్బులు ఇచ్చి మరీ నవ్వుకుంటున్నారా? ఓటుకు నోటు క్షమించని మీరు, ఇక్కడ స్కిట్‌కు నోటు ఇచ్చి మరీ ఎంకరేజ్ చేస్తున్నారా?” అంటూ సరదాగా వ్యాఖ్యలు చేశారు. “ఏదేమైనా ఇలా డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేసే ప్రాసెస్‌లో వాళ్లు పెద్దవాళ్లు కాకపోయినా పర్వాలేదు. మీరు మాత్రం పేదవాళ్లు అవ్వకండి సార్” అంటూ నాగబాబుకు సలహా ఇచ్చారు. దీంతో హైపర్ ఆది చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.




