Janhvi kapoor:బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఒక్కొక్క సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ స్టేటస్ ని సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అప్పుడప్పుడు పలు రకాల రూమర్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. గత కొంతకాలంగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత డైరెక్టర్ అయిన కరణ్ జోహార్ తో జాన్వీ కపూర్ కు విభేదాలు ఉన్నాయ్ అంటూ జోరుగా ప్రచారమైతే జరుగుతోంది.
కరణ్ జోహార్ తో జాన్వీ కపూర్ కి విభేదాలా?
ముఖ్యంగా జాన్వీ కపూర్(Janhvi kapoor) కరణ్ జోహార్ (Karan Johar)కు చెందిన సంస్థను వీడిన తర్వాత ఈ వార్తలు మరింత వైరల్ గా మారాయి. ఈ తాజా పరిణామాలన్నీ చూస్తూ ఉంటే ఈ రూమర్స్ లో నిజం లేదనే విధంగా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జాన్వీ కపూర్ 2018లో విడుదలైన ధడక్ చిత్రం ద్వారా హీరోయిన్గా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి పరిచయమయ్యింది. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు. ఆ తర్వాత గోస్ట్ స్టోరీస్, మిస్టర్ అండ్ మిసెస్ మహి, హోం బౌండ్ , గుంజన్ సక్సేనా , తులసి కుమారి వంటి పలు ప్రాజెక్టులతో కూడా కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ తన సినీ కెరీర్ ని కొనసాగించింది.
also read:Akhil Lenin:మొదటిసారి తన కెరియర్లో అలాంటి రికార్డు సృష్టించిన అఖిల్..!
రూమర్స్ రావడానికి కారణం?
కానీ ఇటీవలే జాన్వీ కపూర్ , కరణ్ జోహార్ కు చెందిన కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్వర్క్ నుంచి వైదొలగడంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని అందుకే దూరం పెరిగింది అనే వార్తలు వినిపించాయి. ముఖ్యంగా జాన్వీ తన కెరీయర్ని సొంతంగా , స్వతంత్రంగా నిర్మించుకోవాలని ఉద్దేశంతోనే అలా ఆ సంస్థ నుంచి బయటికి వచ్చినట్లు బాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.. ఈ సమయంలోనే జాన్వీ సౌత్ ఇండస్ట్రీ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టడం తెలుగులో వరుస సినిమాలలో నటించడం తన మార్కెట్‌ను పెంచుకునే ప్రయత్నం కూడా చేస్తోంది.
also read:Nikhil:నిఖిల్‌పై మోనీషా ఫన్నీ కామెంట్.. పల్లవి గౌడ ఎమోషనల్..!
రూమర్స్ కి చెక్ పెట్టిన మరో వార్త..
దీంతో ఆమెకు సౌత్ లో అనుకున్నంత స్థాయిలో సక్సెస్ రాకపోయినా అవకాశాలు మాత్రం వస్తున్నాయి. అలాగే బాలీవుడ్ లో కూడా పలు రకాల ప్రాజెక్టుల పైన దృష్టి పెట్టినట్లుగా వినిపిస్తున్నాయి. అయితే రూమర్స్ కి చెక్ పెడుతూ జాన్వీ కపూర్ ను ధర్మ ప్రొడక్షన్ బ్యానర్లో సినిమాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది .. ఇందుకు కారణం ఇటీవలే టైగర్ శ్రాఫ్, లక్ష్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కీలకమైన పాత్రలో నటించేందుకు సిద్ధమైందట. మరో సైకలాజికల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ లో కూడా నటించే అవకాశాలు ఉన్నట్లు వినిపిస్తోంది. దీంతో ఈ పరిణామాలనే చూస్తూ ఉంటే జాన్వీ కపూర్, కరణ్ జోహార్ మధ్య విభేదాలకు చెక్ పడిందని నెటిజన్స్ సైతం కామెంట్ చేస్తున్నారు.




