Friday, July 31, 2026
HomeLATESTJabardasth Rohini:ఇండస్ట్రీలో కమిట్మెంట్ పై జబర్దస్త్ రోహిణి కామెంట్స్!

Jabardasth Rohini:ఇండస్ట్రీలో కమిట్మెంట్ పై జబర్దస్త్ రోహిణి కామెంట్స్!

Jabardasth Rohini: ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ లేడీ కమెడియన్ రోహిణి ఇండస్ట్రీలో తనకి ఎదురైన కమిట్మెంట్ పై ఊహించని కామెంట్లు చేసింది.

on
- Advertisement -banner Ad

Jabardasth Rohini:జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ గుర్తింపు సంపాదించుకున్నారు. అలా వచ్చిన గుర్తింపుతోనే పలు సినిమాలలో కమెడియన్స్ గా నటిస్తూ బాగా పాపులారిటీ అవుతున్నారు. అలాంటి వారిలో జబర్దస్త్ రోహిణి కూడా ఒకరు. తన కామెడీ టైమింగ్ తో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న రోహిణి ముఖ్యంగా లేడీ కమెడియన్గా పంచ్ డైలాగులతో అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి టీవీ షో లతోపాటు మరికొన్ని షోలలో కూడా చేస్తోంది. అలాగే సినిమాలతో పాటు పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది రోహిణి

కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా..

బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి బాగానే క్రేజ్ సంపాదించుకుంది. ఇక నిరంతరం సోషల్ మీడియాలో పలు రకాల ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది రోహిణి. ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో రోహిణి(Jabardasth Rohini) మాట్లాడుతూ.. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించి పలు విషయాలను తెలియజేసింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీతోపాటుగా టెలివిజన్ రంగంలో కమిట్మెంట్ల గురించి రోహిణి పలు విషయాలను తెలియజేసింది. కెరియర్ ప్రారంభంలో తాను కూడా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు తెలియజేసింది.

- Advertisement -
Advertisement

also read:Janhvi kapoor:బడా ప్రొడ్యూసర్ తో జాన్వీ కపూర్ కి విభేదాలా?

క్యాస్టింగ్ కౌచ్ పై రోహిణి కామెంట్స్..

కెరియర్ ప్రారంభంలో తాను ఒక సీరియల్ కోసమని ఆడిషన్స్ కి వెళ్ళాను.. అక్కడ ప్రొడ్యూసర్ కి సంబంధించి మేనేజర్..నీకు ఛాన్స్ ఇస్తే కమిట్మెంట్ ఇవ్వాలి అంటూ డైరెక్ట్ గానే అడిగేశారు. దీంతో అప్పట్లో నాకు దీని గురించి పెద్దగా తెలియకపోవడంతో కమిట్మెంట్ గా వర్క్ చేస్తానని వర్క్ విషయంలో చాలా కష్టపడతానని చెప్పానని తెలిపింది. కానీ తీరా అసలు విషయం తెలిసాక చాలా బాధపడ్డాను అని తెలియజేసింది రోహిణి. ఈ విషయం అంతా కూడా తన అంకుల్ కి చెప్పాను. ఆ సదరు ప్రొడ్యూసర్ కి ఫోన్ చేసి మరి వార్నింగ్ ఇచ్చారని తెలిపింది.

- Advertisement -
Advertisement

also read:Akhil Lenin:మొదటిసారి తన కెరియర్లో అలాంటి రికార్డు సృష్టించిన అఖిల్..!

ఇండస్ట్రీలో చేదు అనుభవం..

ఆ విషయం పైన ఆ ప్రొడ్యూసర్ కూడా తనని నిన్ను నేను అడిగానా అంటూ పెద్ద ఎత్తున గొంతు వేసుకొని నాపైన అరిచారు అయినా ఆ సంఘటన తర్వాత మరొకసారి అక్కడికి వెళ్లలేదని తెలిపింది. ఒక ప్రముఖ ఛానల్ సీరియల్స్ లో అవకాశం కల్పిస్తామంటూ మరొక వ్యక్తి కమిట్మెంట్ అడిగారు.. ఈ విషయం పైన నేను గట్టిగా అతనిని తిట్టి బయటికి వచ్చేసానంటూ అప్పటి చేదు అనుభవాలను గుర్తుచేసుకుంది రోహిణి. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you