Nikhil:బుల్లితెర ప్రేక్షకులను అలరించే వినోదాత్మక షో “కుక్ విత్ జాతి రత్నాలు” మరో సరదా ఎపిసోడ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా రూపొందిన ఈ ప్రత్యేక ఎపిసోడ్ కు సంబంధించిన తేజా ప్రోమో విడుదలైంది . ఇందులో జాతి రత్నాలు టీం తమ స్నేహితుల గురించి చెప్పుకుంటూ చేసిన సందడి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎమోషన్, కామెడీ, ఫన్ టాస్క్ లతో ఈ ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉండబోతుందనే సంకేతాలు ప్రోమోలో కనిపించాయి.
ALSO READ:Ramayana:వార్నీ…బ్రహ్మముహూర్తంలో “రామయణం” ట్రైలర్ విడుదల చేసింది అందుకా..?
పల్లవి గౌడ భావోద్వేగ వ్యాఖ్యలు :
ప్రోమోలో పల్లవి గౌడ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. “నిజంగా నా స్నేహితులు ఎవ్వరు అని ఆలోచిస్తే ఎక్కువ మంది గుర్తుకు రాలేదు. నాకు చాలామంది ఫ్రెండ్స్ లేరనే విషయం గుర్తొచ్చి ఆ సమయంలో బాధగా అనిపించింది” అంటూ భావోద్వేగానికి గురైంది. ఆమె మాటలు అక్కడున్న వారినే కాకుండా ప్రేక్షకులను కూడా కదిలించేలా చేశాయి. ఆ తర్వాత స్నో అక్క మోనిషా స్టేజ్ పైకి వచ్చి నిఖిల్ ( Nikhil)విజయేంద్రసింహ గురించి సరదాగా మాట్లాడింది. “ఇతను చాలా సెల్ఫ్‌లెస్ పర్సన్. చాలా మంచి అబ్బాయి. చూడడానికి ఎదవలా కనిపించినా చాలా మంచి మనసున్న వ్యక్తి” అంటూ నవ్వులు పూయించింది. వెంటనే “చాలా మంచి కోతి” అని చెప్పడంతో అందరూ కేరింతలు కొట్టారు. అయితే ఆమె “జాతిరత్నం” అని అనగానే యాంకర్ ప్రదీప్ వెంటనే “జాతిరత్నం కాదు… కుక్” అంటూ సరదాగా సరిదిద్దడంతో మరింత వినోదం పండింది.
ALSO READ:OTT:’శ్రీనివాస మంగాపురం’ఓటీటీ ఫిక్స్.. ఏ ప్లాట్‌ఫామ్‌లో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్?
వింత గెటప్స్ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్:
ఈ ఎపిసోడ్లో ప్రతి ఒక్కరు విభిన్నమైన గెటప్స్ లో కనిపించారు. దీపిక పాప్ కార్న్ గెటప్ లో వచ్చి తనదైన శైలితో సందడి చేయగా డీమన్ పవన్ ఆమెకు ఫన్నీ కౌంటర్ ఇచ్చాడు. ఇమ్మానుయేల్ గ్లాస్ గెటప్‌లో ఫ్రెండ్‌షిప్ గురించి కామెడీ డైలాగ్ చెప్పగా, నిఖిల్ చీర్స్ కొడుతూ సరదా వాతావరణాన్ని సృష్టించాడు. హరి బైక్ గెటప్‌లో, రీతూ క్యారేజ్ గెటప్‌లో కనిపిస్తూ నవ్వులు పంచారు. చివరిగా కంటెస్టెంట్లకు ఒక ఆసక్తికరమైన టాస్క్ ఇచ్చారు ఒక బొమ్మను చూపించి దాన్ని కలర్ కేక్ తో తయారు చేయాలి అని సూచించారు. అనంతరం మిగతావారు ఏది ఏ బొమ్మ గుర్తించాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో పాల్గొన్న వారి సరదా ప్రయత్నాలు నవ్వుల పంచేలా కనిపించాయి. ఫ్రెండ్షిప్ డే స్పెషల్గా రాబోతున్న ఈ ఎపిసోడ్ కామెడీ ఎమోషన్ వినోదంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది..




