Monday, August 3, 2026
HomeLATESTanupama parameswaran:బ్రేకప్ పై మొదటిసారి స్పందించిన అనుపమ పరమేశ్వరన్!

anupama parameswaran:బ్రేకప్ పై మొదటిసారి స్పందించిన అనుపమ పరమేశ్వరన్!

Anupama parameswaran: హీరో ధ్రువ్ విక్రమ్ పై అనుపమ ఇన్ డైరెక్ట్ గా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

on
- Advertisement -banner Ad

anupama parameswaran: టాలీవుడ్ లో క్యూట్ హీరోయిన్ గా పేరు సంపాదించిన అనుపమ పరమేశ్వరన్ గురించి గత కొద్ది రోజులుగా ఏదో ఒక విషయంలో హాట్ టాపిక్ గా ఈమె పేరు వినిపిస్తోంది. తాజాగా ఈమె నటించిన చిత్రం క్రేజీ కళ్యాణం. దీంతో తిరిగి మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్గా మారిన అనుపమ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే చిత్ర బృందం నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొంది. ఈవెంట్ కి ముఖ్య అతిథిగా నందిని రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా ప్రెస్మీట్లో అనుపమకు వరుస ప్రశ్నలు ఎదురవ్వగా వాటికి సమాధానాలను తెలియజేసింది.

రిపోర్టర్ కి కౌంటర్ ఇచ్చిన అనుపమ..

ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ పైన ప్రశ్నించగా తనదైన స్టైల్ లో సమాధానం చెప్పింది అనుపమ.. ఒక రిపోర్టర్ అనుపమతో(anupama parameswaran) ఆమె గతంలో ప్రైవేటుగా ఉండే వారని, అయితే గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా ద్వారా పలు విషయాలను బయట పెట్టడం అవసరమా అంటూ ప్రశ్నించగా? ముఖ్యంగా ఆమె అభిమానులతో రీల్స్ ద్వారా కనెక్ట్ అయ్యేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా భిన్నంగా ఉందంటూ కూడా రిపోర్టర్ ప్రశ్నించారు? ఇందుకు అనుపమ ఇలా స్పందిస్తూ.. అది నా సోషల్ మీడియా.. నేను ఏం పోస్ట్ చేయాలో నేనే నిర్ణయించుకుంటాను అంటూ సమాధానం చెప్పింది..

- Advertisement -
Advertisement

also read: TV:రియల్ ఎస్టేట్ కింగ్ గా టీవీ నిర్మాత కుటుంబం..!

తనను ఏదీ భయపెట్టలేదు అంటూ కామెంట్..

అంతేకాకుండా తాను దేనిని భయపెట్టలేదని, కేవలం ఒక మహిళ పరివర్తన గురించి మాత్రమే మాట్లాడుతున్నాను అలా చేసినందుకు చాలా గర్వపడుతున్నాను అంటూ తెలిపింది. మరో రిపోర్టర్ అది అవతల వారిని నిందించడం కాదా అని అడగగా? అనుపమ నా గురించి మీకు ఏమి తెలుసు? నా జీవితం గురించి మీకు ఏం తెలుసు అంటూ ప్రశ్నించారు? ఎవరికి ఏమి తెలియదంటూ రిపోర్టర్ చెప్పడంతో.. అనుపమ సో పర్వాలేదు.. ఇది మా ఇంస్టాగ్రామ్ మాకు నచ్చిందే మేము పోస్ట్ చేస్తామంటూ తెలియజేసింది.

- Advertisement -
Advertisement

also read: రెండో పెళ్లి పై ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన సురేఖ వాణి..!

ధ్రువ్ విక్రమ్ తో రిలేషన్ పై అనుపమ ఇండైరెక్ట్ కామెంట్..

కొద్దిరోజుల క్రితం హీరో ధ్రువ్ విక్రమ్ తో ప్రేమలో ఉన్నప్పుడు చాలా కండిషన్స్ పెట్టారని, ఆ బంధం బ్రేకప్ అయ్యిందని అందుకే చాలా ఆనందంగా ఉందంటూ వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆమె బ్రేకప్ గురించి ఇలా పరోక్షంగా మాట్లాడుతూ.. తాను ఇప్పుడు చాలా సంతోషంగా, క్షేమంగా ఉన్నానని , ఈ ఏడాదిలో నేను జీవితంలోనే అత్యంత కఠినమైన సంఘటన ఎదుర్కొన్నాను అనే విషయం వాస్తవమే అంటూ తెలియజేసింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you