Sunday, August 2, 2026
HomeLATESTSurekha Vani: రెండో పెళ్లి పై ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన సురేఖ వాణి..!

Surekha Vani: రెండో పెళ్లి పై ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన సురేఖ వాణి..!

Surekha Vani: ప్రముఖ సినీనటి సురేఖ వాణి రెండో పెళ్లి వార్తలపై తాజాగా ఒక సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొని ఊహించని కామెంట్లు చేసింది.

on
- Advertisement -banner Ad

Surekha Vani: ఇండస్ట్రీలో సినీ ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన నటీమణులలో నటి సురేఖ వాణి గురించి చెప్పాల్సిన పనిలేదు. తనదైన కామెడీ డైలాగులతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సురేఖా వాణి గురించి గత కొంతకాలంగా రెండో పెళ్లి గురించి పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకు ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి ప్రస్తావన గురించి ప్రశ్న ఎదురైనప్పుడు.. ఆ ఆలోచన అయితే లేదు.. ఉండి ఉంటే ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సిన పనిలేదనీ, ప్రస్తుతానికైతే ఆ ఆలోచన లేదు. ఇక మీదట కూడా ఉండదని అనుకుంటున్నాను. ముఖ్యంగా మా అమ్మాయికి పెళ్లి చేసే వయసు వచ్చిందని తెలియజేసింది.

రెండో పెళ్లిపై స్పందించిన సురేఖ వాణి..

అంతేకాకుండా గత కొన్నేళ్లుగా మీడియా వర్గాలు చాలా కాలం నుంచి పెళ్లి చేసుకున్నారు అని రాసేస్తున్నారంటూ సరదాగా తెలిపింది సురేఖ వాణి(Surekha Vani). కూతురు సుప్రీతా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బాగానే క్రేజ్ సంపాదించుకుంది. దీంతో పలు చిత్రాలలో నటించే అవకాశాలను కూడా అందుకుంది. తన కూతురు ను ఇండస్ట్రీకి చాలా గ్రాండ్ గా పరిచయం చేయాలని సన్నాహాలు చేస్తున్నామని అందుకు తగ్గట్టుగానే కథలు వింటున్నాము.. కొన్ని కథలను విన్న తర్వాత తన డెసిషన్ కి వదిలేస్తానని తెలిపింది. సుప్రీత చేసిన మొదటి సినిమా ఇంకా విడుదల కాలేదు. అయితే ఆ చిత్రంలో కూడా తాను ఒక పాత్ర చేశానని అందులో డాక్టర్ క్యారెక్టర్ చేశానని తెలిపింది సురేఖా వాణి.

- Advertisement -
Advertisement

ALSO READ:TV:రియల్ ఎస్టేట్ కింగ్ గా టీవీ నిర్మాత కుటుంబం..!

సుప్రీత ఏమన్నారంటే?

గతంలో సుప్రీత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా అమ్మకి మళ్లీ వివాహం చేయాలనే ఆలోచన ఉంది.. ఈ విషయం పైన మా అమ్మతో కూడా మాట్లాడాను . కానీ ఆ బంధం నాన్నతో ఆగిపోవాలని ఉంది.. ఆ ప్లేస్లో ఎవరిని ఊహించుకోలేను అన్నట్లుగా చెప్పిందని సుప్రీత తెలియజేసింది. సుప్రీత మాత్రం నేను పెళ్లి చేసుకునే ముందు అయినా సరే మా అమ్మకి పెళ్లి చేయాలి.. మంచి అబ్బాయి దొరకాలి, ఆమె హ్యాపీగా ఉన్న తర్వాతే నేను వివాహం చేసుకుంటానని తెలిపింది.

- Advertisement -
Advertisement

ALSO READ:Eesha rebba: పట్టు లెహంగాలో కుర్ర కారు మనసు దోచుకుంటున్న ఈషా రెబ్బ!

అలాంటి ఆలోచన లేదని చెప్పిన సురేఖ వాణి..

కానీ ఇప్పుడు తాజాగా సురేఖ వాణి రెండో పెళ్లి పైన స్పందిస్తూ తనకి ప్రస్తుతం అలాంటి ఆలోచనలు లేవని బహిరంగంగానే తెలియజేసింది. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ కి సైతం ఇలా చెక్ పెట్టింది సురేఖ వాణి. ఇందుకు సంబంధించి ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you