Allu Sirish : ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ప్రస్తుతం కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తూ గడుపుతున్నారు. తాను ప్రేమించిన నైనిక రెడ్డిని వివాహం చేసుకున్న తర్వాత ఈ జంట తరచూ సోషల్ మీడియాలో అభిమానులతో తమ సంతోషకరమైన క్షణాలను పంచుకుంటుంది. సినిమాల కంటే కుటుంబానికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్న శిరీష్ తాజాగా తన భార్యలోని ఒక ప్రత్యేకమైన ప్రతిభను అభిమానులకు పరిచయం చేయడం ఆసక్తిని రేకెత్తించింది.
ఆధ్యాత్మిక కార్యక్రమంలో నైనిక గానం:
ఇటీవల జరిగిన ఓ ఆధ్యాత్మిక పూజా కార్యక్రమంలో నైనిక రెడ్డి సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని భజనలు ఆధ్యాత్మిక గీతాలు ఆలపించారు. పసుపు రంగు చీరలో సాంప్రదాయ బద్ధంగా కనిపించిన ఆమె భక్తి శ్రద్ధలతో గానం చేస్తూ అక్కడున్న వారిని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమం కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న నైనిక భక్తి భావంతో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ALSO READ: Eesha rebba: పట్టు లెహంగాలో కుర్ర కారు మనసు దోచుకుంటున్న ఈషా రెబ్బ!
ఇంస్టాగ్రామ్ స్టోరీలో శిరీష్ స్పందన :
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు అల్లు శిరీష్(Allu Sirish) ఇంస్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేశారు. “ఆమెలో ఈ కోణం కూడా ఉందా..?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆయన రాసిన క్యాప్షన్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఈ ఒక్క పోస్ట్ తో భార్య ప్రతిభ పై ఆయనకు ఉన్న అభిమానం గౌరవం స్పష్టమైంది అంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఫోటోలో నైనిక వెనుక అల్లు కుటుంబ సభ్యులు కూడా కనిపించారు. అత్తగారు నిర్మల, తోటి కోడలు స్నేహారెడ్డి , మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖతోపాటు ఇతర కుటుంబ సభ్యులకు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని భక్తి భావంతో కనిపించారు. ఈ దృశ్యం అభిమానులను ఆకట్టుకుంటుంది.
ALSO READ: బ్రేకప్ పై మొదటిసారి స్పందించిన అనుపమ పరమేశ్వరన్!
సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువ :
ఈ ఫోటో వైరల్ కావడంతో నెటిజన్లు నైనిక రెడ్డి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అల్లు కుటుంబం కోడలిలో ఇంత మంచి టాలెంట్ ఉందా..? అంటూ పొగిడేస్తున్నారు. సాంప్రదాయాలను గౌరవించడం అభినందనీయం , కుటుంబ విలువలను నిలబెట్టే కోడలు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు భార్య ప్రతిభను అందరికీ పరిచయం చేసిన అల్లు శిరీష్ పై కూడా అభిమానుల ప్రశంసలు కురిపిస్తున్నారు.
https://www.instagram.com/cinemas.feed/reel/Dbfp4p6pYcp/




