Monday tv Movies:సోమవారం కావడంతో ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు ఈరోజు టీవీలో మంచి మంచి సినిమాలు అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ, థ్రిల్లర్, క్లాసిక్ హిట్స్ తో పాటు డబ్ అయిన చిత్రాలు కూడా ప్రసారం కాబోతున్నాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పలు ప్రముఖ ఛానల్లో ప్రసారమయ్యే సినిమాలో పూర్తి వివరాలు ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!
డీడీ యాదగిరి నుంచి ఈటీవీ వరకు :
డీడీ యాదగిరి లో ఉదయం 9 గంటలకు హాలీవుడ్ డబ్ మూవీ “టిల్ డెత్”.. మధ్యాహ్నం రెండు గంటలకు “స్వర్గం నరకం” ప్రసారం కానున్నాయి. ఈటీవీలో మధ్యాహ్నం మూడు గంటలకు, రాత్రి పది గంటల 30 నిమిషాలకు “పోకిరి రాజా” ప్రసారమవుతుంది. ఈటీవీ ప్లస్ లో మధ్యాహ్నం మూడు గంటలకు “అలజడి” ప్రేక్షకులను అలరించనుంది.
also read:Ravi-Aarti:రవి-ఆర్తి విడాకుల కోర్టు తీర్పు..న్యాయమూర్తికి బిగ్ ధ్యాంక్స్..!
ఈటీవీ సినిమా ఛానల్లో క్లాసిక్ చిత్రాల జాతర :
ఈటీవీ సినిమాలో ఉదయం “స్వప్న చక్రధారి” మధ్యాహ్నం “ముద్దుల మామయ్య” సాయంత్రం “గోరంత దీపం” రాత్రి “లాహిరి లాహిరిలో”.. “సుందరి సుబ్బారావు” వంటి పలు క్లాసిక్ చిత్రాలు వరుసగా ప్రసారం కానున్నాయి.
also read:Tollywood:అసిస్టెంట్ కెమెరా ఉమెన్‌గా స్టార్ హీరోయిన్..ఎవరో తెలుసా ?
జెమినీ ఛానల్ లో వినోదం:
జెమినీ టీవీలో ఉదయం “హనుమాన్ జంక్షన్” మధ్యాహ్నం “స్వామి రారా” ప్రసారం కానున్నాయి. జెమినీ లైఫ్ లో “నిరీక్షణ”, “అలా జరిగింది ఒకరోజు” సినిమాలు ప్రసారమవుతాయి. జెమిని మూవీస్ లో “కోడలు దిద్దిన కాపురం”, “దళం”, “గొప్పింటి అల్లుడు”, “ఖైది గారు”, “తుపాకీ”, “అంగరక్షకుడు”, “నువ్వు వస్తావని”, రాత్రి “కెప్టెన్ మిల్లర్” టెలికాస్ట్ కానున్నాయి.
జీ తెలుగు స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సినిమాలు :
జీ తెలుగులో ఉదయం “మారుతీ నగర్”, “సుబ్రహ్మణ్యం” ప్రసారం కానుండగా.. జీ సినిమాల్లో “ఇద్దరమ్మాయిలతో”, “ఓ మై ఫ్రెండ్”, “మిడిల్ క్లాస్”, “లౌక్యం”, “బ్రూస్లీ”, “కాష్మోరా” వరుసగా టెలికాస్ట్ అవుతాయి.
స్టార్ మా లో ఉదయం “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్” ప్రసారం కానుంది. ఇక స్టార్ మా మూవీస్ లో “ఎంతవాడుగాని”, “భూమి”, “తొలిప్రేమ”, “రఘువరన్ బీటెక్”, “కృష్ణ”, “అమరన్” ప్రేక్షకులను అలరించనున్నాయి.
విభిన్న అభిరుచులు ఉన్న ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రధాన తెలుగు ఛానల్(Monday tv Movies) ను ఈరోజు ఆకట్టుకునే మూవీ లైన్ అప్ ను బాగానే సిద్ధం చేశాయి. మరెందుకు ఆలస్యం మీకు నచ్చిన సినిమాలు ఎంచుకొని ఇంట్లోనే కుటుంబ సభ్యులతో సరదాగా కలిసి ఆస్వాదించండి..!!




