Ravi-Aarti:సినీ స్టార్స్ కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి జనాలు ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉంటారు. మరి ముఖ్యంగా స్టార్ హీరో, హీరోయిన్ లైఫ్ లో ఏం జరుగుతుంది..?? అనే విషయం ఎప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అలాంటి స్టార్ సెలబ్రెటీస్ ఎంతోమంది ఉన్నా.. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్న పేరు నటుడు రవి మోహన్. మనం జయం రవి అని పిలుచుకునే వ్యక్తి. సినిమాల్లో బాగా యాక్ట్ చేసి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆయన..ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా బాగా ట్రబుల్ అవుతున్నారు.
దొంగచాటుగా పెళ్లి చేయలేదు :
రీసెంట్గా ఆయన విడాకులు వ్యవహారం సోషల్ మీడియాలో ఎంత రచ్చ లేపిందో..ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిందే. బిగ్ బిగ్ స్టార్ సెలబ్రెటీస్ కూడా హవ్వా అంటూ ఆశ్చర్యపోయే రేంజ్ లో ట్విస్ట్ లు సోషల్ మీడియాని షేక్ చేసింది. తాజాగా నటుడు రవి(Ravi-Aarti) మోహన్ కు అత్త సినీ నిర్మాత సుజాత ఈ ఇష్యూ పై స్పందించారు. “నటుడు రవి మోహన్ కు నా కుమార్తె ఆర్తికి దొంగచాటుగా పెళ్లి చేయలేదు అని ఘాటుగా స్పందించారు”. వారిని వేరు చేయాలి అని ఎప్పుడు ఎవరు భావించలేదు అని .. ఆమె సూటిగా స్పష్టంగా తన మనసులోని విషయాన్ని వ్యక్తం చేశారు.
ALSO READ:Tollywood:అసిస్టెంట్ కెమెరా ఉమెన్‌గా స్టార్ హీరోయిన్..ఎవరో తెలుసా ?
ఏ తల్లి కూడా అలా చేయదు:
రవి మోహన్ అత్త ఆర్తి తల్లి సినీ నిర్మాత సుజాత విజయ్ కుమార్ శనివారం చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తన మనసులోని విషయాన్ని కరాకండిగా బయటకు చెప్పేశారు. ” ఏ తల్లి కూడా తన పిల్లలను భర్త నుంచి వేరు చేయాలి అని భావించదు అని ..ఆ విషయం అందరూ గ్రహించాలి అని గుర్తు చేశారు. పదివేల మంది ఆహ్వానితుల సమక్షంలో కోట్లు డబ్బులు ఖర్చు చేసి అంగరంగ వైభవంగా అన్ని కార్యక్రమాలను జరిపి వాళ్ల పెళ్లి చేశామని. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా మారిపోయింది అని ఎమోషనల్ అయ్యారు”.
ALSO READ:Shruti Haasan: గ్రీన్ శారీలో ఆకట్టుకుంటున్న శృతిహాసన్!
కోర్టు మంచి తీర్పు ఇచ్చింది:
సోషల్ మీడియాలో వచ్చే కొన్ని పుకార్లు మనసుకి ఇబ్బందికరంగా ఉంటుంది అని.. అవి తట్టుకోవడం చాలా చాలా కష్టమని ఆమె అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఈ నెల నుంచి రవి మోహన్ దంపతులు.. వారి ఇద్దరు కుమారులు ఆరవ్, అయాన్ నెలకోసారి కలుసుకొని మాట్లాడుకోవాలని ఇటీవల కోర్టు సూచించింది అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి మంచి తీర్పును వెలువరించిన న్యాయమూర్తికి నా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు సుజాత. ప్రెసెంట్ సోషల్ మీడియాలో సుజాత మాట్లాడిన మాటలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. కొంతమంది దీనిపై పాజిటివ్ గా స్పందిస్తూ ఉంటే మరి కొంతమంది మాత్రం నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు..!!




