OTT:ఏదైనా సినిమా రిలీజ్ అయింది అంటే దాని గురించి వినిపించే మొదటి ప్రశ్న “సినిమా ఎలా ఉంది..?”, “సినిమా కలెక్షన్స్ ఎలా రాబట్టింది..?” ఈ రెండు ప్రశ్నల తర్వాత కచ్చితంగా వినిపించే ప్రశ్న మాత్రం “సినిమా ఏ ఓటీటీలో రిలీజ్ అవుతుంది..?”. అలా తయారైపోయింది పరిస్థితి. నిజానికి ముందు వరకు ఓటిటి అంటే పెద్దగా గుర్తింపు ఉండేది కాదు. కరోనా సమయంలో థియేటర్లు మూతపడడంతో ఓటీటీ ప్లాట్ఫామ్లకు ఊహించిన స్థాయిలో ఆదరణ లభించింది.
ఇక అప్పటినుంచి జనాలు థియేటర్ కి వచ్చే సినిమా చూడటం కన్నా కూడా సినిమా రిలీజ్ అయ్యాక ఎలాగో ఓటీటీకి వస్తుందిలే హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి తక్కువ ఖర్చుతోనే చూడొచ్చు అనే విధంగా ఆలోచించడం ప్రారంభించారు. థియేటర్ విడుదల లేకుండా పలు చిత్రాలు నేరుగా ఓటీటీలో విడుదలై మంచి లాభాలను కూడా తెచ్చాయి. అయితే 2026 నాటికి ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఓటిటి సంస్థలు ప్రతి సినిమాను వెంటనే కొనుగోలు చేయకుండా కఠినమైన నిబంధనలో అమలు చేస్తున్నాయి.
ఓటిటి సంస్థలు ఎందుకు ఆలోచిస్తున్నాయి:
గత కొన్ని నెలల డేటాను విశ్లేషించిన తర్వాత ఎక్కువ సినిమాలు కొనుగోలు చేసిన వాటిలో కొద్ది చిత్రాలకే భారీ వ్యూస్ వస్తున్నాయని ఓటిటి సంస్థలు గుర్తించాయి. మిగతా సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రజాధరణ పొందకపోవడం.. వారు పెట్టిన పెట్టుబడులపై ప్రాఫిట్స్ రాకపోవడం ఓటిటి సంస్థలు ఆలోచింపజేసేలా మారాయి. దీంతో కంటెంట్ ఎంపికలో మరింత జాగ్రత్త పడాల్సిన విధంగా ఓటిటి సంస్థలు ఆలోచించడం ప్రారంభించాయి.
అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు :
ప్రస్తుతం చాలా ఓటిటి సంస్థలు ముందుగా థియేటర్లలో సినిమా విడుదల చేయాలని సూచిస్తున్నాయి. థియేటర్లో వచ్చిన స్పందన సోషల్ మీడియా బజ్, సమీక్షలు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఆధారంగా డిజిటల్ ఒప్పందాలను ఖరారు చేసుకుంటున్నాయి. ఇక థియేటర్ విడుదల తర్వాత కనీస వ్యవధి పూర్తయిన తర్వాతే ఓటిటి స్ట్రీమింగ్ కు అనుమతిస్తున్నాయి. సినిమా కథ, జోనర్, స్టార్ వాల్యూ, ట్రైలర్స్ స్పందన వంటి అంశాలను కూడా ఇందులో పరిగణలోకి తీసుకుంటున్నాయి.
also read:Agadha trailer:అగధ ట్రైలర్ తో వణుకు పుట్టిస్తున్న డైరెక్టర్ ఎంఎస్ రాజు!
నిర్మాతల ఆదాయ మార్గాలు:
నేటి పరిస్థితుల్లో నిర్మాతలు థియేటర్ హక్కులు, ఓవర్సీస్, డిస్ట్రిబ్యూషన్, ఓటిటి శాటిలైట్, మ్యూజిక్, డబ్బింగ్ రీమిక్స్ ఒకటా రెండు చాలా విధాలుగా ఆలోచించి పెట్టుబడిన రికవరీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక్కే ఆదాయ వనరుల పై ఆధారపడకుండా పలు హక్కులను విక్రయించడం సాధారణంగా మారిపోయింది.
also read:Tollywood:ఆగస్టు నెలలో విడుదలైయ్యే సినిమాల లిస్ట్ ఇదే..అన్ని సూపర్ హిట్సే..!
థియేటర్లకు కలిసొచ్చే పరిణామం:
ఓటిటి(OTT) విడుదల ఆలస్యం కావడంతో ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లే అవకాశాలు పెరుగుతున్నాయి. దీంతో థియేటర్ వ్యవస్థ ఊతం లభిస్తుండగా సినిమాలకు మెరుగైన బాక్స్ ఆఫీస్ వసూలు సాధించే అవకాశం కూడా ఏర్పడుతుంది. మొత్తంగా చూస్తే ఓటిటి సంస్థలు ఇప్పటికి కేవలం సినిమాలను కాకుండా ఫుల్ టైం సబ్స్క్రైబర్లను ఆకర్షించే కంటెంట్ పైన పెట్టుబడులు పెట్టే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు..!!




