Wednesday, August 5, 2026
HomeLATESTKhushboo: త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి.. ఖుష్బూ పోస్ట్ వైరల్!

Khushboo: త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి.. ఖుష్బూ పోస్ట్ వైరల్!

Khushboo: ప్రముఖ సినీనటి త్రిషపై ఉదయనిధి బహిరంగంగా చేసిన కామెంట్లకు మండిపడుతూ కుష్బూ సంచలన పోస్ట్ పెట్టింది.

on
- Advertisement -banner Ad

Khushboo: ప్రముఖ సినీ నటుడు, డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ తాజా పరిణామాలతో చిక్కుల్లో పడ్డారు. ముఖ్యంగా తంజావూరులో జరిగిన కావేరీ జలాల సాధన నిరసన సభలో ఉదయనిధి ప్రసంగిస్తున్న సమయంలో చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ సినీ నటి త్రిషను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు ప్రధాన కారణం. కావేరి జలాల సాధన నిరసన సభలో ఉదయనిధి మాట్లాడుతూ.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కావేరీ నదీ జలాల సమస్యపై ఇందుకు స్పందించడం లేదు. నోరు మెదపడం లేదు అంటూ ఆరోపణలు గుప్పించారు.

త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి..

ఉదయనిధి మాట్లాడుతున్న సమయంలో సభలోని డీఎంకే కార్యకర్తలు ఒక్కసారిగా త్రిష.. త్రిష.. అంటూ చాలా గట్టిగా అరవడం మొదలుపెట్టారు. కార్యకర్తల తీరును వారించాల్సిన ఉదయనిధి.. నవ్వుతూ డబుల్ మీనింగ్ డైలాగ్ వచ్చేలా వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాలలో తీవ్ర విమర్శలకు దారి తీసింది.”ఎక్కడ నీళ్ళు వచ్చినా.. రాకపోయినా.. అక్కడ మాత్రం నీళ్లు రావాలంటూ” ఆయన చేసిన కామెంట్లు చాలా వివాదాస్పదంగా మారాయి.

- Advertisement -
Advertisement

also read:Rakul:ఆ ఒక్క కారణంగానే “శూర్పణఖ” పాత్ర చేసా: రకుల్ స్టన్నింగ్ ఆన్సర్

క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్..

అంతేకాదు మహిళల గౌరవాన్ని దిగజార్చేలా వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ప్రవర్తించిన ఉదయనిధి స్టాలిన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జాతీయ మహిళా కమిషన్ కి అధికారికంగా ఫిర్యాదు కూడా చేసింది. మరొకవైపు బిజెపితో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా ఉదయనిధి పై మండిపడుతున్నారు.

- Advertisement -
Advertisement

also read:OTT:బావిలో డెడ్‌బాడీ..ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళ థ్రిల్లర్..మిస్ అవ్వకండి!

ఖుష్బూ పోస్ట్ వైరల్..

ఈ విషయం పైన ప్రముఖ నటి, రాజకీయ మహిళగా పేరు సంపాదించిన ఖుష్బూ(Khushboo) ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ “ఉదయనిధి స్టాలిన్ ప్రసంగాన్ని విన్నాను. ఆయన మాటలు చాలా అసహ్యకరంగా , నీచంగా మహిళలను అవమానపరిచేలా ఉన్నాయి, అలాంటి వ్యాఖ్యలు ఆయన వారసత్వంగా పొందాలని ఆరాటపడుతున్న రాజకీయంగా కనిపిస్తున్నాయని, ఇలాంటి మనస్తత్వం ఉన్నవారు ఒక రాజకీయ పార్టీకి న్యాయకత్వం వహించాలని, ఏదో ఒకరోజు రాష్ట్రాన్ని పాలించాలని ఆశపడితే ఇక ఆ దేవుడే మనల్ని కాపాడాలి.. మహిళలను ఇలా కించపరచడం, అవమానపరచడం, దూషించడం ఒక రాజకీయ వినోదంగా భావిస్తూ తమ అనుచరులు మద్దతులు పొందుతూ చప్పట్లు, ఈలలు , నవ్వులు, ఇలా ఆనందించే వారి నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం.. ఇలాంటి భాషను సమర్థించే వారు ఎవరైనా సరే అలాంటి అవమానాల నుంచి తప్పించుకోలేరు” అంటూ ట్వీట్ చేసింది ఖుష్బూ.

- Advertisement -
Advertisement

ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. ఈ విషయం పైన క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయం పైన త్రిష ఎలా స్పందిస్తుందో తెలియాలి అంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you