Rashmika mandanna:టాలీవుడ్ హీరోయిన్ రష్మిక ఇటీవలె తాను నటిస్తున్న మైసా సినిమా షూటింగ్లో పాల్గొన్న సమయంలో గాయపడిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సాంగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు రష్మికకి గాయమయ్యింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంగా రష్మిక ఆరోగ్యం ఎలా ఉంది అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి సందర్భంలోనే రష్మిక సోషల్ మీడియా వేదికగా తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఒక పోస్టుని షేర్ చేశారు.
గాయం తర్వాత తొలిసారి స్పందించిన రష్మిక.
రష్మిక (Rashmika mandanna)తనకు గాయం తగిలిందనే విషయాన్ని ఎవరికీ తెలియకూడదు అనుకున్నాను. అయినా కూడా అందరికీ తెలిసిపోయింది. ప్రస్తుతం తనకు నొప్పిగా ఉన్నప్పటికీ అది భరించలేనంత స్థాయిలో లేదని వెల్లడించింది. అభిమానులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు అంటూ రష్మిక తెలియజేసింది. అంతేకాకుండా గాయాలు చాలా ఇబ్బంది పెడతాయి. నిజానికి అసలు విషయం ఎవరికీ తెలియకూడదు అనుకున్నాను. కానీ ఏం చేస్తాం అందరికీ తెలిసిపోయింది.. ఈమధ్య నేను కనిపించనందుకు నన్ను క్షమించండి .నేను మళ్ళీ వచ్చేస్తాను . ఈ గాయం కొంతకాలం క్రితమే అయ్యింది. ఇది నాకు మూడో గాయం అంటూ తెలిపింది.
also read:Khushboo: త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి.. ఖుష్బూ పోస్ట్ వైరల్!
ఇకపై మనిషిలా నా శరీరాన్ని చూసుకుంటాను..
అంతేకాకుండా ఇక మీదట నా శరీరాన్ని ఒక యంత్రంలా కాకుండా మనిషి శరీరం లాగా చూసుకోవడం నేను కచ్చితంగా నేర్చుకోవాల్సిన ఒక పాఠం అంటూ రష్మిక పోస్ట్ చేసింది. మైసా సినిమా డాన్స్ షూటింగ్ సమయంలో ఈ గాయం జరిగింది. నేను ఇప్పటివరకు చేసిన సినిమాలలో అత్యంత కష్టమైన శారీరక శ్రమతో కూడిన చిత్రం ఇదే అంటూ తెలియజేసింది. ఆ దేవుడు కూడా నువ్వు అసలు విశ్రాంతి తీసుకోవు సరే నీకు నేను బలవంతంగా బ్రేక్ ఇస్తాను అని చెప్పినట్టు అనిపిస్తోందని రష్మిక తెలియజేసింది.
also read:Rakul:ఆ ఒక్క కారణంగానే “శూర్పణఖ” పాత్ర చేసా: రకుల్ స్టన్నింగ్ ఆన్సర్
దేవుడు ఇచ్చిన సెలవులే ఇవి..
ఇప్పటివరకు నాకు తగిలిన గాయాలన్నీ కూడా విచిత్రమైన ప్రమాదాల వల్లే జరిగాయి.. అలా ఎలా జరుగుతాయో ఏమో ఇప్పుడు నాకు బలవంతపు సెలవులు వచ్చాయి. కానీ దాని గురించి ఎలాంటి ఫిర్యాదు లేదు.. ప్రస్తుతం తాను బరువు పెరగకుండా ఉండడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. తాను ఎప్పుడూ కూడా కఠినమైన వర్కౌట్లను పరుగులను తీస్తూ ఫిట్టుగా ఉంటాను. ఇప్పుడు కొంతకాలం ఆ పని చేయలేనని, వర్కౌట్స్ చేయకపోతే ఏమి చేస్తాను? కేవలం స్వీట్లని బాగా తింటాను.. వాటికి బానిసగా మారిపోతాను.. ఇంకేమైనా చెప్పడం మర్చిపోయానా ఏమీ లేదు కదా ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా త్వరలోనే అప్డేట్ ఇస్తానని తెలియజేసింది. రష్మిక తన భర్త విజయ్ దేవరకొండ తో కలిసి రణబాలి సినిమాలో కూడా నటిస్తోంది. ఇవే కాకుండా పలు రకాల ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మిక షూటింగ్ గాయం కారణం వల్ల ఇప్పుడు ఆ సినిమా షూటింగ్లన్నీ కూడా వాయిదా పడబోతున్నాయి.
https://www.instagram.com/p/DblEDJIiQ3l/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==




