Friday OTT:చూస్తూ చూస్తూనే..మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలో కొత్త సినిమాల సందడి కొనసాగుతూ ఉండగా.. ఓటీటీ వేదికలు కూడా వినోద ప్రియులకు భారీ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమైపోయాయి. ఈ శుక్రవారం(Friday OTT) ఒకేరోజు దాదాపు 17 సినిమాలు, వెబ్ సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ఫాములలో విడుదల కారున్నాయి. దీంతో ప్రేక్షకులకు ఫుల్ సందడే సందడి అని చెప్పుకోక తప్పదు. తెలుగు చిత్రాలతో పాటు హాలీవుడ్, బాలీవుడ్, కొరియన్, జపనీస్, మలయాళం ,మరాఠీ భాషలకు చెందిన పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న “లెనిన్” సినిమా జి ఫైవ్ లో స్ట్రీమింగ్ కానుండడం విశేషం.
నెట్ ఫ్లిక్స్ లో 10 కొత్త విడుదల:
నెట్ ఫ్లిక్స్ ఈ వారం అత్యధిక కంటెంట్ తో ప్రేక్షకులను అలరించబోతుంది. ‘ఇదయం మురళి’ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌తో పాటు ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’, ‘ది లాస్ట్ హౌస్’, ‘మై వాపస్ ఆవుంగా’, ‘రికీ గెర్వైస్: ఆలే క్యాట్’, ‘అవర్ స్టిక్కీ లవ్’, ‘డెత్ ఇంక్ సీజన్ 4’, ‘బిగ్ చికెన్: ఏ ఫాస్ట్ ఫుడ్ కాన్స్పిరసీ’, ‘లవ్ హర్ట్స్’ చిత్రాలు, సిరీస్‌లు ఆగస్టు 7 నుంచి అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. అలాగే ‘ది రిబ్బన్ హీరో’ జపనీస్ అనిమే చిత్రం ఆగస్టు 8న స్ట్రీమింగ్ కానుంది.
జి5, అమెజాన్ ప్రైమ్ లో తెలుగు సినిమాలు :
జి5 లో “లెనిన్”, “100 దేవుళ్ళు”, మరాఠీ చిత్రం ‘తుంబడ్ చీ మంజులా’ విడుదల కానున్నాయి. ఇక అదే విధంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఐశ్వర్య రాజేష్ నటించిన “ఓ సుకుమారి!” తెలుగు సినిమా.. అలాగే తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ “వదంది 2” ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి.
ALSO READ:Varun Tej:వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ ఎలా ఉంది? పూర్తి రివ్యూ, రేటింగ్ ఇదే
ఇతర ఓటిటిలో సినిమాలు :
జియో హాట్‌స్టార్‌లో ‘ది సూపర్ మారియో గెలక్సీ’ ఇంగ్లీష్ చిత్రం విడుదల కానుంది. మనోరమ మ్యాక్స్‌లో మలయాళ చిత్రం ‘పొంగళ’, సన్ నెక్ట్స్‌లో ‘సత్యతిల్ సంభవిచ’ స్ట్రీమింగ్ కానున్నాయి.
ALSO READ:Varanasi: మహేష్ పుట్టినరోజున షర్ట్ లెస్ పోస్టర్..!
వీక్ ఎండ్ కి బెస్ట్ ఛాయిస్ :
తెలుగు సినిమాల నుంచి అంతర్జాతీయ వెబ్ సిరీస్ ల వరకు విభిన్న ఛానల్లో క్రేజీకంటెంట్ అందుబాటులోకి వస్తూ ఉండడంతో ఈ వీకెండ్ ఓటిటి ప్రేక్షకులకు మంచి వినోదం లభించనుంది. యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, డ్రామా ,డాక్యుమెంటరీ వంటి విభిన్న విభాగాలలో విడుదలవుతున్న ఈ చిత్రాలు అదేవిధంగా సిరీస్ లు ప్రతి వర్గం ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి చూసే చిత్రాల నుంచి ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ల వరకు ప్రతి అభిరుచికి తగ్గ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి మరెందుకు ఆలస్యం ఏ ఓటీటీలో మీకు నచ్చిన సినిమా విడుదల అవుతుందో చూసి ఎంజాయ్ చేయండి..!!




