Saturday, August 8, 2026
HomeLATESTVarun Tej:వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' ఎలా ఉంది? పూర్తి రివ్యూ, రేటింగ్ ఇదే

Varun Tej:వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ ఎలా ఉంది? పూర్తి రివ్యూ, రేటింగ్ ఇదే

Varun Tej:వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా నటించిన కొరియన్ కనకరాజు మూవీ ఎలా ఉంది?

on
- Advertisement -banner Ad

Varun Tej:వరుస పరాజయాలతో సతమతమవుతున్న వరుణ్ తేజ్‌కు ‘కొరియన్ కనకరాజు’ సినిమాపై మొదటి నుంచే మంచి బజ్ ఏర్పడింది. టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాతో వరుణ్ తేజ్ బాక్సాఫీస్ వద్ద బలమైన కమ్‌బ్యాక్ ఇస్తాడనే అంచనాలు నెలకొన్నాయి. వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించారు. భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? కథ ఏమిటి? నటీనటుల నటన ఎలా ఉంది? దర్శకుడు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించగలిగాడు? ఈ చిత్రానికి పూర్తి రివ్యూను ఇప్పుడు తెలుసుకుందాం.

కథ:

అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన కనకరాజు (వరుణ్ తేజ్) (Varun Tej)చెక్కభజనలు చేసుకుంటూ సాదాసీదా జీవితం గడిపే యువకుడు. అతనికి ఎప్పుడూ అండగా ఉండే స్నేహితుడు కిష్టప్ప (సత్య). అదే సమయంలో కియా కంపెనీలో పనిచేసే చైత్ర (రీతికా నాయక్) పరిచయం కావడంతో ఆమెను ప్రేమించడానికి కనకరాజు ప్రయత్నిస్తాడు. అయితే స్థానిక రౌడీ చెంగల్ రెడ్డి (సునీల్)తో జరిగిన గొడవలో అనుకోకుండా ఓ పాత సీసా పగిలిపోతుంది. అందులో బంధీగా ఉన్న కొరియన్ గ్యాంగ్‌స్టర్ ఆత్మ కనకరాజు శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత కనకరాజు ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. ఆ ఆత్మ అసలు ఎవరు? అతడి కోరిక ఏమిటి? చివరికి అందరూ కొరియా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

- Advertisement -
Advertisement

విశ్లేషణ:

దర్శకుడు మేర్లపాక గాంధీ కామెడీకి ఫాంటసీని జోడించి కొత్త కాన్సెప్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అయితే సినిమా ప్రారంభ భాగం మాత్రం నెమ్మదిగా సాగుతుంది. హీరో-హీరోయిన్ ట్రాక్, గ్రామీణ నేపథ్యం, విలన్‌తో గొడవలు వంటి సన్నివేశాలు కొత్తదనం లేకుండా అనిపిస్తాయి.ఇంటర్వెల్ సమయంలో వచ్చే కీలక ట్విస్ట్‌తో కథ ఒక్కసారిగా గేర్ మార్చుకుంటుంది. కనకరాజు శరీరంలోకి కొరియన్ ఆత్మ ప్రవేశించిన తర్వాత సినిమా అసలు ట్రాక్‌లోకి వస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే కామెడీ ఎపిసోడ్స్ ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి.

సత్య, వరుణ్ తేజ్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. వాట్సాప్ వీడియో కాల్ ద్వారా క్షుద్రపూజ చేసే సీన్, ఇంటర్నెట్ సమస్యలతో జరిగే కామెడీ థియేటర్‌లో మంచి నవ్వులు పంచుతుంది.అయితే కథ కంటే కామెడీకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల భావోద్వేగాలు, కథా బలం కొంత తగ్గిపోయాయి. క్లైమాక్స్ కూడా మరింత బలంగా ఉండాల్సిందని అనిపిస్తుంది. లాజిక్స్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా వినోదాన్ని ఆస్వాదించే వారికి మాత్రం సినిమా నచ్చే అవకాశం ఉంది.

- Advertisement -
Advertisement

also read:Varanasi: మహేష్ పుట్టినరోజున షర్ట్ లెస్ పోస్టర్..!

నటీనటుల పెర్ఫార్మెన్స్:

వరుణ్ తేజ్ ఈ సినిమాలో రెండు భిన్నమైన షేడ్స్‌లో కనిపించాడు. అమాయక గ్రామీణ యువకుడిగా, కొరియన్ గ్యాంగ్‌స్టర్ ఆత్మ ప్రవేశించిన తర్వాత స్టైలిష్ బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నాడు. కామెడీ టైమింగ్‌లో కూడా మంచి మెరుగుదల కనిపిస్తుంది. అయితే సినిమాకు అసలు హీరో సత్య అనే చెప్పాలి. తన డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్, టైమింగ్‌తో ప్రతి సన్నివేశాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాడు. రీతికా నాయక్ తన పాత్రకు తగిన నటనను కనబరిచింది. సునీల్ విలన్‌గా బాగానే మెప్పించాడు. మురళీధర్ గౌడ్ కామెడీ ట్రాక్‌లో మంచి మార్కులు కొట్టేశాడు. వీటీవీ గణేష్ సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

- Advertisement -
Advertisement

also read:The Paradise:ది ప్యారడైజ్ టీజర్ రిలీజ్.. మాస్ అవతార్లో నాని రచ్చ!

టెక్నికల్ విభాగం:

థమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బలం. కొన్ని యాక్షన్, కామెడీ సన్నివేశాల్లో బీజీఎం బాగా పనిచేసింది. పాటలు మాత్రం అంతగా గుర్తుండిపోయేలా లేవు.మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. పెనుగొండ గ్రామీణ అందాలు, కొరియా లొకేషన్లను విజువల్‌గా అందంగా చూపించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఎక్కడా రాజీ పడినట్టు అనిపించదు. ఎడిటింగ్ విషయంలో ఫస్టాఫ్‌లో కొంత ట్రిమ్మింగ్ చేసి ఉంటే సినిమా మరింత వేగంగా సాగేదనే భావన కలుగుతుంది. దర్శకుడు మేర్లపాక గాంధీ ఎంచుకున్న కాన్సెప్ట్ కొత్తదనాన్ని కలిగి ఉన్నప్పటికీ, కథను మొదటి నుంచి మరింత ఆసక్తికరంగా నడిపించి ఉంటే ఫలితం ఇంకా మెరుగ్గా ఉండేది.

ప్లస్ పాయింట్స్:

*వరుణ్ తేజ్ కొత్త తరహా నటన
*సత్య కామెడీ టైమింగ్
*ఇంటర్వెల్ ట్విస్ట్
*సెకండాఫ్ కామెడీ
*బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
*మంచి నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:

*నెమ్మదిగా సాగే ఫస్టాఫ్
*కథలో బలమైన ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం
*కొన్ని చోట్ల లాజిక్ మిస్ కావడం
*బలహీనమైన క్లైమాక్స్

పంచ్ లైన్: ఓవరాల్‌గా ‘కొరియన్ కనకరాజు’.. కేవలం వినోదం కోసమే చూస్తే నిరాశపరచని సినిమా.

రేటింగ్: 3/ 5

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you