Chandana Shetty :”చందన శెట్టి”.. ఈ పేరు చెప్తే జనాలు పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు. అదే ‘వరూధిని పరిణయం’ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. అంతలా “వరూధిని పరిణయం” అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన నటనతో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి చందన శెట్టి. తాజాగా అభిమానులకు శుభవార్తను అందించింది. గత నెల జూలై 26న తాను పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని దాదాపు 11 రోజుల తర్వాత సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. చిన్నారి చేతులు, కాళ్లు మాత్రమే కనిపించే అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంది. మా జీవితాలలోకి చిన్నారి అడుగు పెట్టింది అంటూ ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో అభిమానులు, టెలివిజన్ ప్రముఖులు, సహనట్లు చందన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సీరియల్స్ తో ప్రత్యేక గుర్తింపు :
చందన శెట్టి(Chandana Shetty )తెలుగు టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా “వరూధిని పరిణయం” సీరియల్ లో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఆ సీరియల్ ద్వారా ఇంటింటికి చేరిన చందన తర్వాత “బంధం” వంటి సీరియల్స్ లో కూడా నటించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం తమిళంలో రెండు సీరియల్స్ లో నటించి తన ప్రతిభను చాటుకుంది. తిరిగి తెలుగులో ‘స్వర్ణ ప్యాలెస్’ సీరియాల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి మంచి పాపులారిటీ దక్కించుకుంది. సహజమైన నటన , భావోద్వేగా సన్నివేశాలలో మెప్పించే అభినయంతో కుటుంబ ప్రేక్షకులకు మరింత చేరువైంది నటి చందన శెట్టి.
ALSO READ:TV:ఈరోజు టీవీలో వచ్చే తెలుగు సినిమాలు పూర్తి మూవీ షెడ్యూల్..!
సినిమాలు వివాహం అమెరికా జీవితం:
సీరియల్స్ తో పాటు తెలుగు కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో సినీ విజయాలు మాత్రం అందుకోలేకపోయింది. దీంతో కొంతకాలం నటనకు విరామం ఇచ్చిన చందనాశెట్టి 2024 ఏప్రిల్ లో అమెరికాలో స్థిరపడిన ఓ NRI ని వివాహం చేసుకుంది. వివాహం అనంతరం భర్తతో కలిసి అమెరికాలోని కాలిఫోర్నియాలో నివాసం ఉంటుంది. ఇటీవల తన ప్రెగ్నెన్సీ విషయాన్నీ కూడా అభిమానులతో పంచుకున్న ఆమె ఇప్పుడు పండు లాంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
ALSO READ:Friday OTT:శుక్రవారం ఓటిటి మూవీస్..ఓటీటీలో వినోద జాతర
డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ప్రారంభమైన ప్రయాణం:
చందన శెట్టి నటిగా మారకముందే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని ప్రారంభించింది. ఆమె తల్లి సరస్వతి ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ కావడంతో అదే రంగంలో తొలి అడుగులు వేసింది. 2008 నుంచి 2012 వరకు దాదాపు 45 సినిమాల్లో పలువురు హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది. అనంతరం నటనపై ఆసక్తితో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి విజయవంతమైన సీరియల్ నటిగా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం చందన శెట్టి పంచుకున్న ఈ శుభవార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!
https://www.instagram.com/p/DbqS58hlNyP/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==




