Dhurandhar:బాలీవుడ్ ఎనర్సిటిక్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ యాక్షన్ ద్రిల్లర్ మూవీ “ధురంధర్”. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రముఖ ఓటిటి వేదిక నెట్ఫ్లిక్స్లో 2026లో అత్యధిక మంది వీక్షించిన నాన్ ఇంగ్లీష్ సినిమాగా ఈ చిత్రం రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ కో-సీఈఓ టెడ్ సరాండోస్ ‘ఎక్స్ప్రెస్ అడ్డా’ కార్యక్రమంలో వెల్లడించారు.
3.7 కోట్లకు పైగా వ్యూస్ :
2026 జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో ధురంధర్ (Dhurandhar)కు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.3.7 కోట్లు అంటే 37 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు తెలిపారు. అమెరికా బ్రిటన్ చిత్రాల తర్వాత అంతర్జాతీయంగా అత్యధికంగా వీక్షించబడిన సినిమాగా ఇది నిలిచింది అంటూ ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా నెట్ఫ్లిక్స్ లో గ్లోబల్ ట్రెండింగ్ చార్ట్ లో ఒకేసారి 22 దేశాలలో అగ్రస్థానం సాధించడం ఇంకా విశేషం అని చెప్పాలి. దీంతో భారతీయ సినిమాల సత్తా ప్రపంచ ప్రేక్షకులకు మరోసారి తెలిసింది.
also read:Peddi:పెద్ది మూవీపై పరుచూరి రివ్యూ.. ఆ ఒక్కటే అప్సెట్ చేసిందట!
బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు :
దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ ఫ్రాంచైజీ బాక్సాఫీస్ వద్ద కూడా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 3,100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించినట్లు సమాచారం. ఇది చాలా చాలా స్పెషల్ రికార్డ్ అని చెప్పాలి. 2025 డిసెంబర్లో విడుదలైన తొలిభాగం భారీ విజయాన్ని అందుకోగా ఈ ఏడాది మార్చిలో వచ్చిన సీక్వెల్ ఇంకా పెద్ద హిట్ అయింది. ‘ధురంధర్: ది రివెంజ్’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో రన్వీర్ సింగ్ నటన వేరే లెవెల్ అంటూ విమర్శకులు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ లోనే దాదాపు రూ. 1,000 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించిన తొలి బాలీవుడ్ చిత్రంగా సీక్వెల్ రికార్డ్ సృష్టించినట్లు చిత్ర బృందం గతంలో పేర్కొంది.
also read:Peddi:పెద్ది మూవీపై పరుచూరి రివ్యూ.. ఆ ఒక్కటే అప్సెట్ చేసిందట!
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భారతీయ సినిమాల ఆదరణ:
భారతీయ కంటెంట్ కి అంతర్జాతీయ ప్రేక్షకులలో ఎప్పుడు ఆదరణ ఉంటుంది. ఇప్పుడు అది వేగంగా పెరుగుతుంది అంటూ టేడ్ సరెండోస్ అభిప్రాయపడ్డారు. 2024 నుంచి ప్రతి వారం కనీసం ఒక్కటంటే ఒక్క భారతీయ సినిమా లేదా సిరీస్ నెట్ గ్లోబల్ టాప్ 10 లో చోటు దక్కించుకుంటుంది అని ఆయన తెలిపారు. ఇది వెరీ వెరీ రేర్ రికార్డ్ అంటూ అభిప్రాయపడ్డారు. ప్రపంచ స్థాయి కథలు, భారీ నిర్మాణ విలువలు, విభిన్నమైన కథనాలతో భారతీయ సినిమాలు గ్లోబల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని ఈ విజయాలు స్పష్టం చేస్తున్నాయి. ధురంధర్ ఇంత పెద్ద రేర్ రికార్డ్ అచీవ్ చేయడంతో మరోసారి సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది..!!




