Avika Gor :కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ చిన్న జ్వరం వచ్చిన ఎంత హంగామా చేసేస్తారో అందరికీ తెలిసిందే. కోట్లు ఖర్చు పెట్టి భారీ సెట్స్ వేస్తే చిన్న అనారోగ్యం కారణంగా వెంటనే క్యాన్సిల్ చేసి నిర్మాతలకు కోట్ల నష్టాలు తెచ్చి పెట్టిన స్టార్ సెలబ్రెటీస్ ఎంతోమంది ఉన్నారు. కానీ వారందరిలోకి ప్రత్యేకంగా నిలిచింది “అవికా గోర్”. అదే చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ లో నటించినా ఆనంది. ఆమె అసలు పేరు “అవికా గోర్”. కానీ అందరి ముద్దుగా ఆనంది.. ఆనంది అనే పిలుచుకుంటారు. ఆనంది చిన్నప్పుడు సీరియల్స్ లో నటించింది పెద్దయ్యాక పలు సినిమాలో నటిస్తూ బిజీగా తన కెరీర్ ని ముందుకు తీసుకెళ్తుంది. ఈ అవికా గోర్ ప్రస్తుతం డెంగ్యూతో బాధపడుతున్నారు. గత కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతున్న ఆమెను ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే అధిక జ్వరం ఉన్నప్పటికీ షూటింగ్‌ను ఆపకుండా తన వృత్తిపట్ల ఆమె చూపించిన అంకిత భావం ఇప్పుడు చర్చనీయాంసంగా మారింది.
ఐదు రోజులుగా 14 డిగ్రీల జ్వరం:
అవికా గోర్(Avika Gor )కి దాదాపు 5 రోజుల నుంచి 104 డిగ్రీల వరకు జ్వరం ఉన్నట్లు తెలుస్తుంది. ఆమె భర్త దగ్గరుండి ఆమె బాగోగులు చూసుకుంటున్నారు. శుక్రవారం రాత్రి సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసిన ఆయన జ్వరం తగ్గకపోవడంతో అవికాను ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆమె తన పని పట్ల ఎక్కడ వెనకడుగు వేయడం లేదు అని స్పష్టం చేశారు.
also read:Dhurandhar:‘ధురంధర్’కు అరుదైన అంతర్జాతీయ ఘనత.. నెట్‌ఫ్లిక్స్‌లో సరికొత్త రికార్డు!
నిర్మాతకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతో:
అవికా ముందుగా అంగీకరించిన షూటింగ్ షెడ్యూల్ ని అనారోగ్య పరిస్థితుల్లోనూ పూర్తి చేసినట్లు భర్త తెలిపారు. షూటింగ్ వాయిదా పడితే నిర్మాతకు ఆర్థికంగా నష్టం వస్తుంది అని.. అది తనకు ఇష్టం లేదు అని తన వల్ల నిర్మాత నష్టపోకూడదు అన్న ఉద్దేశంతో ఆరోగ్యం బాగోలేకపోయినా ఆమె తన పనిని పూర్తి చేసింది అన్న విషయాన్ని చెప్పారు. షూటింగ్ పూర్తి చేసిన అనంతరం యాడ్ షూట్ కోసం ఢిల్లీకి కూడా వెళ్లినట్లు ఆయన వెల్లడించారు.
also read:Peddi:పెద్ది మూవీపై పరుచూరి రివ్యూ.. ఆ ఒక్కటే అప్సెట్ చేసిందట!
డెంగ్యూ నిర్ధారణతో ఆసుపత్రిలో చేరిక:
అయితే జ్వరం, నీరసం మరింత ఎక్కువ కావడంతో వైద్యులను సంప్రదించిన అవికాకు డెంగ్యూ పరీక్షలు నిర్వహించగా పరీక్షల్లో డెంగ్యూ పాజిటివ్ రావడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించినట్లు చెప్పారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుంది అని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని అవికా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
‘బుఖార్’ విడుదల రోజే ఆసుపత్రిలో:
అవికా నటించిన తాజా మ్యూజిక్ ఆల్బమ్ ‘బుఖార్ విడుదలైన రోజే జ్వరంతో ఆసుపత్రిలో చేరడం ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. ఆసుపత్రి బెడ్ నుంచి ఆల్బమ్ విడుదల విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. తన ప్లేట్లెట్ కౌంట్ పై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె డెంగ్యూ పరిస్థితి తీవ్రంగా ఉంది అంటూ తెలిపారు. అవికా బాలనాటిగా “బాలిక వధు” సీరియల్ లో ఆనంది పాత్రలో విశేషమైన గుర్తింపు పొందారు. ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి తన నటనకు మంచి మార్కులు వేయించుకున్నారు. ఇక ఆ తర్వాత తెలుగు హిందీ చిత్రాలలో పలు సినిమాల నటించి వేరే లెవెల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమె ప్రస్తుతం డెంగ్యూతో చికిత్స పొందుతూ హాస్పిటల్లో ఉన్నారు. త్వరగా ఆమె కోలుకోవాలని..మళ్ళీ తిరిగి షూటింగ్లో పాల్గొనాలి అని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.




