Rithu Chowdary:సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న జోడీలలో రీతూ చౌదరి, డెమోన్ పవన్ జంట కూడా ఒకటి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లో పరిచయం మొదలు కాగా, అది స్నేహంగా మారింది. వీరు ప్రేమికులయ్యారంటూ పలు రకాల వార్తలు కూడా గత కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపైనే వీరిద్దరిలో ఎవరు కూడా నోరు మెదపడం లేదు. కానీ బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత కూడా వీరు మధ్య మంచి అనుబంధం అలాగే కొనసాగుతోంది.
పవన్ , రీతూ.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా?
అంతేకాకుండా నిత్యం పలు రకాల ఈవెంట్స్ , పలు రకాల షోలలో కనిపిస్తూ ఉన్నారు. తాజాగా ఈ జంట కలిసి నటించిన ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ బంగారం. ఇటీవల విడుదలైన సాంగ్ను కూడా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా ఈ సాంగ్లో రీతూ చౌదరి, డెమోన్ పవన్ స్క్రీన్ ప్రజెంట్స్ అందరిని బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా, యూట్యూబ్ లో వైరల్ గా మారింది. దీంతో త్వరలోనే రీతూ, పవన్ వివాహం చేసుకోబోతున్నారా? అంటూ పలు రకాల రూమర్స్ కూడా మొదలయ్యాయి. ఈ విషయం పైన తాజాగా రీతూ చౌదరి స్పందిస్తూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
also read:OTT :క్రైమ్ థ్రిల్లర్ లకి అమ్మ మొగుడి లాంటి సినిమా ఇది..ఓటీటీలో మోస్ట్ ట్రెండింగ్ మూవీ..!
స్పందించిన రీతూ చౌదరి..
బంగారం సాంగ్ ప్రమోషన్స్ లో భాగంగా రీతూ చౌదరిని (Rithu Chowdary)యాంకర్ ఒక ప్రశ్న అడిగారు… మీరిద్దరూ కలసి చేసే వీడియోలు చూస్తే చాలా మంది నిజంగానే ప్రేమలో ఉన్నారేమో అని అనుకుంటున్నారు.. కామెంట్ సెక్షన్లో కూడా పవన్, రీతూ చౌదరి ఎప్పుడు వివాహం చేసుకుంటారని అడుగుతున్నారు. దీనిపైన మీ సమాధానం ఏంటి? అంటూ యాంకర్ రీతూ చౌదరిని ప్రశ్నించింది. దీనిపైన రీతూ ఇలా స్పందిస్తూ ..” రీల్ కపుల్ రియల్ కపుల్ కావడం అంత సులువైనది కాదు. దానికి చాలానే సమయం పడుతుంది. ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉండాలని తెలిపింది.
also read:Shanmukh Jaswanths:‘అరేయ్ ఏంట్రా ఇది’.. యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఇలా మారిపోయాడు ఏంటి..?
ఆ సమయానికి చాలా టైం పడుతుంది..
అంతేకాకుండా ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి.. అన్ని విషయాలలో ఒకే అభిప్రాయంగా ఉండాలి. అలాంటప్పుడే ఏవైనా నిర్ణయాలు తీసుకోవచ్చు.. ప్రస్తుతమైతే మేము స్నేహితులుగా చాలా హ్యాపీగా ఉన్నాము. కలిసి ప్రాజెక్టులు చేస్తున్నాము. మీరు కూడా మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి “అంటూ రీతూ చౌదరి సమాధానం చెప్పింది. మరి రాబోయే రోజుల్లో పెళ్లి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి. మొత్తానికి రీతూ చౌదరి పెళ్లి పైన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.




