Saturday, August 8, 2026
HomeLATESTKeerthy Suresh:నెటిజన్ కి అదిరిపోయే కౌంటర్ వేసిన కీర్తి సురేష్..!

Keerthy Suresh:నెటిజన్ కి అదిరిపోయే కౌంటర్ వేసిన కీర్తి సురేష్..!

Keerthy Suresh: ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుత ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

on
- Advertisement -banner Ad

Keerthy Suresh:సినీ సెలబ్రెటీలు అంటే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన విషయాలను తెలియజేస్తూ అభిమానులతో ముచ్చటిస్తుంటారు. ముఖ్యంగా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను కూడా కొంతమంది నేరుగా స్పందిస్తూ ఉండగా.. మరి కొంతమంది ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ వేస్తూ ఉంటారు. ఇప్పుడు అలా టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా అదే పని చేసినట్లు తెలుస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ ది ప్యారడైజ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో కనిపించబోతోందని ప్రచారం జరుగుతోంది.

కీర్తి సురేష్ పై నెటిజన్ కామెంట్..

ఈ నేపథ్యంలోనే ఒక నెటిజన్ చేసిన కామెంట్ కు కీర్తి సురేష్ తనదైన స్టైల్ లో కౌంటర్ వేసింది. ది ప్యారడైజ్ టీజర్ విడుదలైన తర్వాత కీర్తి సురేష్ ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుందనే వార్తలు మరింత బలాన్ని చేకూర్చాయి. కానీ ఈ విషయం ఇప్పటివరకు అఫీషియల్ గా ఎక్కడ అనౌన్స్మెంట్ చేయలేదు చిత్ర బృందం. ఈ ప్రచారం నేపథ్యంలో ఒక ఇంస్టాగ్రామ్ యూజర్ కీర్తి సురేష్ పైన విమర్శలు చేశారు. ఆమె చెప్పుకోదగ్గ పాత్రలు లేకపోవడం వల్ల ఇలా ఐటెం సాంగ్ ఎంచుకోందని కామెంట్స్ చేశారు. ది ప్యారడైజ్ చిత్రం తెలుగు సినిమాకు బదులుగా కన్నడ సినిమా అంటూ ఆ వ్యక్తి కామెంట్ చేశాడు.

- Advertisement -
Advertisement

also read:Rithu Chowdary:రీతూ చౌదరి పెళ్లిపై షాకింగ్ కామెంట్..!

స్పందించిన కీర్తి సురేష్..

ఈ విషయం పైన కీర్తి సురేష్ (Keerthy Suresh)తనదైన స్టైల్ లో స్పందిస్తూ.. ఎలాంటి పెద్ద వివరణ ఇవ్వకుండా సరదాగా నెటిజన్ కి కౌంటర్ వేసింది. నాని తెలుగు సినిమాలలో నటిస్తాడని, కన్నడలో కాదని గుర్తు చేసి ఒక చిన్న సవరణ అంటూ ఆమె సమాధానం చెప్పుకొచ్చింది.. ది ప్యారడైజ్ సినిమా విషయానికి వస్తే.. నాని హీరోగా నటిస్తున్న ఈ యాక్షన్ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కాయాదు లోహార్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే తనికెళ్ల భరణి ,సంపూర్ణేష్ బాబు, మోహన్ బాబు, ఈశ్వరి రావు తదితర నటీనటులు ఇందులో నటిస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:OTT :క్రైమ్ థ్రిల్లర్ లకి అమ్మ మొగుడి లాంటి సినిమా ఇది..ఓటీటీలో మోస్ట్ ట్రెండింగ్ మూవీ..!

కీర్తి సురేష్ సినిమాలు..

సెప్టెంబర్ 24న ది ప్యారడైజ్ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. కీర్తి సురేష్ ప్రస్తుత ప్రాజెక్టుల విషయానికి వస్తే డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో డోరతీ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నారు. అలాగే విజయ్ దేవరకొండ తో రౌడీ జనార్ధన్ అనే సినిమాలో నటించబోతోంది. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ , వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్టులో కూడా కీర్తి సురేష్ నటిస్తోంది. వీటితోపాటుగా అక్క, రాఫ్తార్ తదితర చిత్రాలలో కీర్తి సురేష్ నటిస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో ఉన్న వరుస ప్రాజెక్టులతో షూటింగ్లలో బిజీగా ఉన్న ఈమె.. రోజుకు 20 గంటల పాటు పనిచేసినట్లు ఇటీవల సోషల్ మీడియాలో కూడా తెలిపింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you